Who after Jagan: ఏ రాజకీయ పార్టీకైనా.. సంస్థాగత నిర్మాణం ముఖ్యం. ఎంతటి క్లిష్ట పరిస్థితినైనా ఎదుర్కునేలా దీని నిర్మాణం ఉండాలి. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు( Chandrababu) అరెస్టు సమయంలో ఆ పార్టీ నిర్మాణం స్పష్టంగా కనిపించింది. ఒక పద్ధతి ప్రకారం పార్టీ శ్రేణులు రోడ్డు ఎక్కాయి. ఆందోళనలు నిర్వహించాయి. అధినేత జైల్లో ఉండగా.. లోకేష్ ఢిల్లీలో ఉండగా.. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించడంలో టిడిపి నేతల మధ్య సమన్వయం స్పష్టంగా కనిపించింది. ఈ విషయంలో బిజెపిలో ఉన్న టిడిపి సన్నిహిత నేతల సహకారం కూడా అందింది. చివరకు విదేశాల్లో సైతం ఆందోళనలు జరిపేలా ప్రణాళిక ఉండేది. తెలంగాణలో కెసిఆర్ అధికారంలో ఉండగా హైదరాబాదులో ఆందోళనలో చేపట్టగలిగారు. అంతటి సంస్థాగత నిర్మాణం టిడిపి సొంతం. కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విషయానికి వచ్చేసరికి అటువంటి నిర్మాణం ఏమైనా ఉందా? అంటే సమాధానం చెప్పలేని దుస్థితి. ప్రస్తుతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సంక్లిష్ట పరిస్థితుల్లో ఉంది. అధినేత జగన్మోహన్ రెడ్డి తర్వాత ఎవరు? ఆ పార్టీ అనుబంధ విభాగాలు ఏంటి? అంటే మాత్రం సమాధానం చెప్పలేని దుస్థితి.
నాయకులు ఉన్నారంతే..
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) పార్టీ ఆవిర్భవించి దాదాపు 15 సంవత్సరాలు అవుతోంది. జగన్ తరువాత ఎవరూ అంటే మాత్రం చెప్పుకోలేని పరిస్థితి. చాలామంది నాయకులు ఆ పార్టీలో ఉన్నారు. సీనియర్లుగా చలామణి అవుతున్న వారు ఉన్నారు. కానీ వారు లీడ్ తీసుకునే ఛాన్స్ ఆ పార్టీలో లేదు. జగన్మోహన్ రెడ్డి వద్ద తగ్గి ఉండాల్సిందే. సజ్జల రామకృష్ణారెడ్డి, గతంలో విజయసాయి రెడ్డి లాంటి నేతలు ఉండేవారు. కానీ వారు కార్యాలయాల వరకు.. పార్టీ కార్యక్రమాలకు అన్నట్టు మాదిరిగా ఉండేవారు. జగన్మోహన్ రెడ్డి మాదిరిగా ప్రజల్లోకి వచ్చే అవకాశం లేదు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఒక స్ట్రక్చర్ అంటూ లేదు. అయితే ప్రత్యేక పరిస్థితుల్లో ఏర్పాటయింది ఆ పార్టీ. ఇప్పటికీ సోలో పెర్ఫార్మెన్స్ మాత్రమే కొనసాగుతోంది.
సీనియర్లు చెప్పిన వినలే..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఒక సంస్థాగత నిర్మాణం అవసరమని విజయసాయిరెడ్డి ( Vijaya Sai Reddy )చాలాసార్లు చెప్పారట. కానీ అందుకు జగన్ అంగీకరించలేదట. నేను ఒక్కడినే ఉంటే చాలు అన్నట్టు ఆయన వ్యవహార శైలి ఉండేదట. చాలామంది సీనియర్ నేతలు సైతం పార్టీ నడిపే విధానం ఇది కాదని సలహా ఇచ్చారట. అబ్బబ్బే మీకు తెలియదు. నేను ఉంటేనే పార్టీ ఉంటుంది. నేను లేకుంటే పార్టీ ఉండదు అన్నట్టు వ్యవహరించారట. ఎవరైనా తాను ఉన్నా.. లేకపోయినా.. పార్టీ నడిచేలా ఒక నిర్మాణాన్ని జరుపుతారు. కానీ జగన్మోహన్ రెడ్డి విషయంలో అలా కాదు.
బలమైన నిర్మాణం అవసరం..
వాస్తవానికి ప్రాంతీయ పార్టీలు సుదీర్ఘకాలం కొనసాగలేవు. దానికి కారణం బలమైన నిర్మాణం జరగకపోవడమే. అయితే ఈ విషయంలో తెలుగుదేశం పార్టీకి బలమైన నిర్మాణం జరిగింది. అందుకే మధ్యలో ఎన్నో రకాల సంక్షోభాలు వచ్చిన నిలబడగలిగింది. కనీసం దాని నుంచి చూసి గుణపాఠాలు నేర్చుకోలేదు జగన్మోహన్ రెడ్డి. ఎంతవరకు తాను ఉంటే చాలు అన్నట్టు ఆయన వైఖరి ఉంది. తాను ఉంటే పార్టీ ఉంటుంది. లేకపోతే లేదు అనే ఆలోచనతో ఉన్నారు జగన్. కచ్చితంగా ఇది ఎంతవరకు ఆమోదయోగ్యం కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.