Pawan Kalyan : పవన్ కళ్యాణ్ పొలిటికల్ కెరియర్ ఎటు వైపు వెళ్తుంది… సీఎం అవుతాడా లేదా..?

మరి కొంతమంది అయితే పవన్ కళ్యాణ్ ఏ ఉద్దేశ్యంతో పార్టీని పెట్టాడు ఇప్పుడు ఎటు వైపు వెళ్తున్నాడు అని కామెంట్లు కూడా చేస్తున్నారు...

Written By: NARESH, Updated On : May 18, 2024 8:03 pm

Pawan Kalyan's political career

Follow us on

Pawan Kalyan : సినిమా కెరియర్ పీక్స్ లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ జనసేన అనే పార్టీని పెట్టాడు. అయితే పవన్ కళ్యాణ్ కి సినిమాల్లో చాలా డబ్బులు వచ్చేవి అయినప్పటికీ తను ఆ డబ్బులన్నింటిని వదిలేసి, జనానికి సేవ చేయాలనే ఒకే ఒక ఉద్దేశ్యంతో ఆయన ‘జనసేన ‘ అనే పార్టీ పెట్టి జనాల్లోకి అడుగు పెట్టాడు. ఇక అందుకే ఈ పార్టీ ద్వారా ప్రజల గొంతుకు గా మారి వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే మాట్లాడుతూ ప్రభుత్వం పైన పోరాటం చేస్తూ వస్తున్నాడు.

అయితే పవన్ కళ్యాణ్ జనసేన అనే పార్టీ పెట్టినప్పుడు ఆయన నిజంగా ఒకటే లక్ష్యం గా పెట్టుకున్నాడు. ఇక ఎప్పటికైన తను అధికారంలోకి వచ్చి జనానికి మంచి చేయాలని కోరుకున్నాడు. ఇక 2019 వ సంవత్సరంలో పవన్ కళ్యాణ్ రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయాడు. అయినప్పటికీ తను ఎక్కడా కూడా తన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా పార్టీ క్యాడర్ ని కాపాడుకుంటూ అపోజిషన్ పార్టీగా ఉంటూ ఎప్పటికప్పుడు పోరాటం చేస్తూ వస్తున్నాడు. ఇక ఈ క్రమంలోనే తన పార్టీని బలోపేతం చేసుకొని ఎదుగుతున్నాడు అనుకున్న క్రమంలోనే ఆయన ఈసారి తెలుగుదేశం, బిజెపి కూటమితో కలిసి పోటీ చేశాడు. ఇదంతా చూస్తుంటే పవన్ కళ్యాణ్ ఎందుకోసం పొలిటికల్ ఎంట్రీ ఇచ్చాడు. అధికారం తను దక్కించుకుంటే ప్రజలకు సేవ చేయవచ్చని రాజకీయ రంగంలోకి అడుగుపెట్టాడు.

మరి ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు అని ఆయన మీద కొన్ని విమర్శలైతే చేస్తున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎజెండా ఏదైనా కూడా ఆయనను సీఎంగా చూడాలని ఆయనను అభిమానించే వాళ్ళు ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఆయన ఒక్కసారి సీఎం అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు మారిపోతుందని నమ్మే వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి ఇలాంటి క్రమంలో ఈ కూటమితో పోటీ చేస్తే వీళ్ళు ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ చేసిన చంద్రబాబు నాయుడు సీఎం అవుతాడు. పవన్ కళ్యాణ్ కి డిప్యూటీ సీఎం లేదంటే మంత్రి పదవి ఇచ్చే అవకాశాలైతే ఉన్నాయి.

ఇదంతా చూస్తున్న సినీ రాజకీయ మేధావులు సైతం ఒక మంత్రి పదవి పొందడానికి పవన్ కళ్యాణ్ ఇంతలా కష్టపడాల్సిన పని లేదు కదా..ఆయనకున్న క్రేజ్ కి ఆయన ఏ పార్టీకి సపోర్ట్ చేసిన ఈజీగా తనకు మంత్రి పదవి అయితే వస్తుంది. దాని ద్వారా ప్రజలకు సేవ చేయొచ్చు అంటూ ఆయన పైన కొంతమంది నెగిటివ్ గా ప్రచారం అయితే చేస్తున్నారు. మరి కొంతమంది అయితే పవన్ కళ్యాణ్ ఏ ఉద్దేశ్యంతో పార్టీని పెట్టాడు ఇప్పుడు ఎటు వైపు వెళ్తున్నాడు అని కామెంట్లు కూడా చేస్తున్నారు…