Jagan public meeting update: వైఎస్ఆర్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ ఆలోచన మారడం లేదు. తాము ఇంకా బలంగానే ఉన్నామని ఆ పార్టీ భావిస్తోంది. ఆ పార్టీ శ్రేణుల ఆలోచన కూడా అదే. ఎంతవరకు ప్రజలకు మంచి చేశాం.. సంక్షేమ పథకాలు అందించాం అని చెబుతున్నారే తప్ప ప్రజలు అభివృద్ధి కోరుకున్నారు అన్న సంగతి గుర్తించడం లేదు. ఇప్పటికీ కూడా అదే భ్రమల్లో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ 2019 ఎన్నికల్లో ఓడిపోయింది. ఆ పార్టీ సైతం ఇలానే భావించింది. కానీ ప్రతి పరిస్థితిని తట్టుకొని నిలబడగలిగింది. కూటమి కట్టి విజయం సాధించింది. అయితే 2014లో వచ్చిన పరిస్థితి ఇప్పుడు లేదు. అప్పుడు చంద్రబాబు ఒంటరి. రాష్ట్రం చూస్తే కొత్తగా ఏర్పడింది. అప్పట్లో రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా కేంద్రం నుంచి తగినంత సహకారం లేదు. ఆ కారణం చేతనే 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి కి పరోక్ష సహకారం అందింది. అయితే అప్పటి పరిస్థితి ఇప్పుడు ఉందా? అన్న విషయాన్ని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గుర్తించుకుంటే మంచిది.
కేవలం ఆ ధీమాతో..
ఎంతవరకు ఈ ఎన్నికల్లో 40% ఓట్లు వచ్చాయి అన్నది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ధీమా. ఇవి నిలబడుతూ ప్రభుత్వ వైఫల్యం, వ్యతిరేకత ఇట్టే కలిసి వస్తుందన్నది ఆ పార్టీ ఆలోచన. కానీ ఇంతవరకు ఆ పార్టీ ప్రజల్లోకి వచ్చింది చాలా తక్కువ. ఎంతవరకు తమ పార్టీ నేతల పై నమోదైన కేసులు, తమ పార్టీ నేతలపై జరుగుతున్న దాడుల పేరుతో బాధితులను జగన్మోహన్ రెడ్డి పరామర్శిస్తున్నారు. అది కూడా ఆయన పర్యటనలు కేవలం జన సమీకరణ నడుమ సాగుతున్నాయి అందుకే ప్రజలు కూడా చాలా తేలిగ్గా తీసుకుంటున్నారు. ఆ జనాలను అలవాటైన విద్యగా మార్చేసింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. జగన్మోహన్ రెడ్డి ఎటువంటి పర్యటన చేసిన.. సందర్శనలు చేసిన జనాలు అన్నది సర్వసాధారణంగా మారిపోయింది. కానీ జనం ఆయన నుంచి ఏం కోరుకుంటున్నారు అన్నది గ్రహించడం లేదు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ.
కూటమిపై సానుకూలత..
ప్రస్తుతం కూటమి ప్రభుత్వం( Alliance government) పట్ల మెజారిటీ ప్రజలు సానుకూలంగానే ఉన్నారు. అనుకున్న స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగులు వ్యతిరేకించడం లేదు. కార్మిక వర్గాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేయడం లేదు. ఒకవైపు అభివృద్ధి మరోవైపు సంక్షేమంతో బ్యాలెన్స్ గా వెళ్తున్నారు చంద్రబాబు. దుబారా ఖర్చులు కనిపించడం లేదు. ఉపాధ్యాయ ఉద్యోగ నియామకాలు జరుపుతున్నారు. అమరావతి రాజధాని నిర్మిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు పనులను చేపడుతున్నారు. ఇన్ని జరుగుతున్నప్పుడు అధికార పార్టీకి ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తూ సానుకూలత చూపుతున్నారు. అందుకు తగ్గట్టు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు చేయడం లేదనేది విశ్లేషకులు అభిప్రాయం.
రెండు సంక్రాంతులు గడిచినా..
గత సంక్రాంతికి ముందు ప్రజల మధ్యకు వస్తాను అన్నారు జగన్మోహన్ రెడ్డి. కానీ ఏడాదిన్నర దాటిపోయింది కానీ ఆయన ప్రజల మధ్యకు వచ్చింది లేదు. ఎవరైనా నేతలు కేసుల్లో ఇరుక్కుని జైలుపాలు అయితే మాత్రం యాత్ర చేసి మరి వారిని పరామర్శిస్తున్నారు. దానినే ప్రజా సమస్యగా చూపిస్తున్నారు. కానీ ప్రజలు కోరుకున్న దానిపై పోరాటాలు చేయడం లేదు. ఇది ఎంత మాత్రం ఆ పార్టీకి శ్రేయస్కరం కానే కాదు. తెలుసుకోవాల్సింది ఆ పార్టీయే.