Minister Nara Lokesh
Minister Nara Lokesh: ఏపీ ప్రభుత్వం ( AP government) వాట్సాప్ గవర్నెన్స్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ప్రజలకు సులభతరమైన ప్రభుత్వ సేవలు అందించేందుకు ఏపీ ప్రభుత్వం మెటా సంస్థతో ఒప్పందం చేసుకుంది. వాట్సాప్ ద్వారా 161 సేవలను ప్రారంభించింది. మన మిత్ర యాప్ ద్వారా జనవరి నెలలో ఈ సేవలను అందుబాటులోకి తెచ్చింది. కొద్దికాలంలో మరో 500 సేవలను అందించేందుకు అన్ని రకాల కసరత్తు చేస్తోంది ఏపీ ప్రభుత్వం. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబుతో పాటు లోకేష్ వాట్సాప్ గవర్నెన్స్ సేవలపై దృష్టి పెట్టారు. మెటా సంస్థ ప్రతినిధులతో మంత్రి నారా లోకేష్ చర్చలు జరిపారు. అవి సక్సెస్ కావడంతో మరిన్ని సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
Also Read: నాగబాబు, పిఠాపురం వర్మ ఓకే.. మిగతా ఆ నలుగురు ఎవరు?
* స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు..
చేతిలో స్మార్ట్ ఫోన్( smartphone) ఉంటే చాలు అన్ని రకాల సేవలను పొందే విధంగా ప్రత్యేక యాప్ ను తీసుకొచ్చింది ఏపీ ప్రభుత్వం. మన మిత్ర పేరిట 9552300009 నంబర్ ను సంప్రదిస్తే చాలు 161 రకాల పౌర సేవలను అందించే విధంగా ప్లాన్ చేసింది. దేవాదాయ, ఇంధన, ఏపీఎస్ఆర్టీసీ, రెవెన్యూ, మున్సిపల్ శాఖలతో సహా దాదాపు అన్ని శాఖల సర్వీసులను ఈ యాప్ ద్వారా అందుబాటులోకి తెచ్చింది ఏపీ ప్రభుత్వం. కార్యాలయాల చుట్టూ తిరగకుండా పౌర సేవలను ప్రజల చెంతకు తెచ్చేందుకే ఈ సరికొత్త ఆలోచనలు చేసింది.
* జనవరిలో ప్రయోగాత్మకంగా
అయితే ఏపీ ప్రభుత్వం( AP government) జనవరిలో ప్రయోగాత్మకంగా మనమిత్ర పేరిట వాట్సాప్ గవర్నెన్స్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఇది విజయవంతం కావడంతో.. 200 సేవల వరకు వీటిని పెంచింది. భవిష్యత్తులో 500 సేవల వరకు అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సీఎం చంద్రబాబు ఇటీవల ప్రకటించారు. అందుకు సంబంధించి ఏర్పాట్లను చురుగ్గా చేస్తున్నట్లు కూడా చెప్పుకొచ్చారు. అతికొద్ది కాలంలోనే ఈ యాప్ ను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తేవాలన్నది ప్రభుత్వ ప్రణాళికగా తెలుస్తోంది. ప్రజలకు సులువైన, సరళతరమైన పౌర సేవలు అందించేందుకే ఈ ఏర్పాట్లు అని ప్రకటించింది ఏపీ ప్రభుత్వం.
* మంత్రి లోకేష్ కీలక ప్రకటన
మరోవైపు ఏపీలో మన మిత్ర( Mana Mitra) వాట్సాప్ గవర్నెన్స్ సేవలపై మంత్రి నారా లోకేష్ మాట్లాడారు. ఈ సేవలను మరింత విస్తృతం చేస్తున్నట్లు ప్రకటించారు. భవిష్యత్తులో 500 సేవలను అందించే వీలుగా కసరత్తు చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ప్రజలకు సులువైన పౌర సేవలు అందించేందుకు, వ్యయ ప్రయాసలు తగ్గించేందుకు ఇది ఎంతగానో దోహదపడుతుందని చెప్పుకొచ్చారు. ప్రజలు వాట్సాప్ గవర్నెన్స్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. దేశంలో ఏపీ డిజిటల్ గవర్నెన్స్ శక్తి చాటి చెప్పాలని పిలుపునిచ్చారు. సామాన్యుల కోసమే కూటమి ప్రభుత్వం ఇటువంటి నిర్ణయాలు కూడా తీసుకుంటుందని గుర్తు చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను సులువుగా అందుకునేందుకు ఇది ఎంతగానో దోహదపడుతుందని కూడా నారా లోకేష్ చెప్పుకొచ్చారు.
Also Read: ఆ సీనియర్ ఎమ్మెల్యే పై రాయలసీమ బిజెపి నేతల ఫిర్యాదు
What a remarkable milestone!
Mana Mitra’s WhatsApp governance services have now reached 200, showcasing the power of digital governance in Andhra Pradesh.
By making public services more accessible and efficient, this initiative enhances convenience and transparency. We will… pic.twitter.com/cWaBDKLHzS
— Lokesh Nara (@naralokesh) March 6, 2025
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read MoreWeb Title: Whatsapp governance 200 more services soon minister nara lokesh sensational announcement
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com