https://oktelugu.com/

Telugu Language: తేట తెలుగుకు ఏమిటీ ఈ దుస్థితి?

Telugu Language: దేశభాషలందు తెలుగు (Telugu) లెస్స. ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని తెలుగును కీర్తించారు. కానీ రానురాను తెలుగు భాష తన ప్రభావాన్ని కోల్పోతోంది. తెలుగు భాష ప్రస్తుతం కనుమరుగయ్యే స్థాయిలో ఉందని సర్వేలు చెబుతుండడం బాధాకరమే. మన భాషను మనమే నాశనం చేసుకుంటున్నాం. దేశంలో హిందీ మాట్లాడే వారి తరువాత రెండో స్థానంలో ఉన్న తెలుగు భాష క్రమంగా కిందకు దిగజారిపోతోంది. మన భాష పరిరక్షణకు మనమే పాటు పడడం లేదు. దీంతో […]

Written By:
  • Srinivas
  • , Updated On : August 30, 2021 / 10:06 AM IST
    Follow us on

    Telugu Language: దేశభాషలందు తెలుగు (Telugu) లెస్స. ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని తెలుగును కీర్తించారు. కానీ రానురాను తెలుగు భాష తన ప్రభావాన్ని కోల్పోతోంది. తెలుగు భాష ప్రస్తుతం కనుమరుగయ్యే స్థాయిలో ఉందని సర్వేలు చెబుతుండడం బాధాకరమే. మన భాషను మనమే నాశనం చేసుకుంటున్నాం. దేశంలో హిందీ మాట్లాడే వారి తరువాత రెండో స్థానంలో ఉన్న తెలుగు భాష క్రమంగా కిందకు దిగజారిపోతోంది. మన భాష పరిరక్షణకు మనమే పాటు పడడం లేదు. దీంతో తెలుగు భాష రాబోయే రోజుల్లో మరింత కిందకు జారిపోయే పరిస్థితి పొంచి ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భాషను రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది.

    దేశంలో అత్యంత వేగంగా పతనమయ్యే భాషల్లో తెలుగు కూడా ఒకటి కావడం గమనార్హం. ఇంకా తెలుగు వారు మేల్కోకపోతే మరింత అధ్వాన స్థితికి దిగజారిపయే ప్రమాదం పొంచి ఉందని సమాచారం. మాతృభాష పరిరక్షణకు నడుం బిగించాల్సిన అవసరాన్ని గుర్తించాలి. అప్పుడే మన భాష మనుగడకు గుర్తింపు ఉంటుంది. భాషాభిమానంలో తమిళ, కన్నడ వారి కంటే మన స్థితి దారుణంగా ఉంది. తమిళనాడులో ఏ నగరంలో చూసినా బోర్డులన్నీ తమిళంలోనే ఉంటాయి. కర్ణాటకలో అన్ని కన్నడంలోనే ఉంటాయి. మన తెలంగాణలో మాత్రం అన్ని ఆంగ్లంలోనే ఉంటాయని తెలుసుకున్నాం.

    తెలగు భాష నేడు పతనమైపోయే ప్రమాదంలో పడిపోయింది. ఆంగ్ల మాధ్యమ పాఠశాలలతో తెలుగును మరిచిపోతున్నారు. తెలుగును డిగ్రీ వరకు తప్పనిసరి ఒక విషయంగా ప్రవేశపెట్టాలి. తెలుగు మాధ్యమంలో చదివిన విద్యార్థులకు ఉద్యోగావకాశాల్లో ప్రాధాన్యత కల్పించాలి. అప్పుడే తెలుగు వైభవం పెరుగుతుంది. భాషను బతికించుకున్న వాళ్లమవుతాం. కానీ మన ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఉన్నత విద్యను సైతం తెలుగు మాధ్యమంలో చదువుకోవచ్చని చట్టం తేవడం ఆహ్వానించదగినదే.

    ప్రభుత్వాలు కూడా భాషా పరిరక్షణకు ఉద్యమించాల్సిన అవసరం ఉంది. మాతృభాషలో చదివిన వారికి ప్రోత్సాహకాలు అందజేయాలి. అన్ని లేఖలు తెలుగులోనే ఉండేందుకు చర్యలు చేపట్టాలి. మాతృభాషా పరిరక్షణలో అందరు భాగస్వాములు కావాలి. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో తెలుగును తప్పనిసరిగా వాడాలి. అన్ని లెటర్లు తెలుగులో ఉండేలా చూసుకోవాలి. అప్పుడే తెలుగు మాధ్యమం కూడా మంచి ఆరదణ ఉంటుంది. ప్రస్తుతం తెలుగు మాధ్యమ పాఠశాలలు కనిపించడం లేదు. ఆంగ్ల మాధ్యమానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఫలితంగా తెలుగు కనీసం చదవడం కూడా రావడం లేదు. దీనికి అందరు కూడా తెలుగులోనే మాట్లాడేలా చూసుకోవాలి.

    పతనమైపోతున్నమన భాషను కాపాడుకునే క్రమంలో పాఠశాలల్లో తెలుగు విషయం తప్పనిసరిగా ఉండేలా చూడాలి. ఉత్తర ప్రత్యుత్తరాలు అన్ని తెలుగులోనే ఉండేందుకు జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే మనం మరింత దిగజారిపోయే ప్రమాదం పొంచి ఉంది. తెలుగు భాష కోసం ఎందరో మహానుభావులు తమ జీవితాలను ధార పోశారు. తెలుగు సినిమాల్లో పాటల ద్వారా శ్రీశ్రీ, దాశరథి, వేటూరి, సిరివెన్నెల, సినారె తదితరులు మన భాష బతికేందుకు తమ శక్తియుక్తులను ధారపోశారు. భాషను బతికించారు. మనం కూడా వారి వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని భాష పరిరక్షణకు నడుం బిగించాల్సిన అవసరం గుర్తించాలి.