Jagan Bengaluru: వైయస్సార్ కాంగ్రెస్ ( YSR Congress ) పార్టీ ఇబ్బందుల్లో ఉంది. ఈ సమయంలో ఆ పార్టీ ప్రజా పోరాటాలు చేయాలి. ప్రజల్లోకి బలంగా రావాలి. అయితే జగన్మోహన్ రెడ్డి మాత్రం ఏపీలో ఉండేది తక్కువ. బెంగళూరులో ఉండేది ఎక్కువ అన్నట్టు ఉంది పరిస్థితి. తాడేపల్లి లో మూడు రోజులపాటు గడుపుతున్న ఆయన.. బెంగళూరులో మాత్రం ఎక్కువగా విడిది చేస్తున్నారు. అక్కడ ఆయనకు ప్యాలెస్ ఉంది. అయితే తాడేపల్లిలో కేంద్ర కార్యాలయం ఉంది. అక్కడే నివాసం కూడా ఏర్పాటు చేసుకున్నారు. ప్రస్తుతం వైసీపీ ఉన్న పరిస్థితుల్లో తాడేపల్లిలో ఉండి జగన్ రాజకీయాలు చేయాలి. కానీ తరచు ఆయన బెంగుళూరు వెళ్తున్నారు. అక్కడే ఉండి రాజకీయ వ్యూహాలను అమలు చేస్తున్నారు. అయితే అక్కడ ఒక బ్యాక్ ఆఫీస్ ఉందని స్పష్టం అవుతుంది. బెంగళూరులో ఉండి ఏపీ పై కుట్రలు చేస్తున్నారని టిడిపి నేతలు ఆరోపించడం వెనుక ఏదో సమాచారం బయటకు వచ్చింది. త్వరలో దీనిపై క్లారిటీ రానుంది కూడా.
అన్ని హంగులతో తాడేపల్లి ప్యాలెస్..
జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి లో( Tadepalli ) ముచ్చటగా ప్యాలెస్ కట్టుకున్నారు. 2014లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షానికి పరిమితం అయింది. ఆ సమయంలో హైదరాబాదు నుంచి రాకపోకలు సాగించే కంటే రాజధాని లో నివాసం ఏర్పాటు చేసుకోవాలని చూశారు. అలా తాడేపల్లి లో ఇంటిని నిర్మించుకున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్యాలెస్ మరింత హంగులు సమకూర్చుకుంది. ఆపై పార్టీ కేంద్ర కార్యాలయంగా కూడా కొనసాగుతోంది. ఇక్కడ నుంచే రాజకీయ వ్యూహాలను అమలు చేసే తీరుగా అక్కడ కార్యాలయాన్ని మార్చుకున్నారు. కానీ ఎందుకో తాడేపల్లి కేంద్ర కార్యాలయం నుంచి కేవలం సమీక్షలు, పార్టీ సమావేశాలకు మాత్రమే పరిమితం చేస్తున్నారు. అసలైన వ్యూహాలన్నీ బెంగళూరు నుంచి అమలు చేస్తున్నారు అనేది ఒక అనుమానం. టిడిపి సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఇదే అనుమానం వ్యక్తం చేశారు. టిడిపి ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు దీనినే ప్రస్తావించారు.
ప్రజల్లో చీలిక కోసమే..
అయితే నేరుగా ప్రజల్లోకి వెళ్లి వారిలో మార్పు తెచ్చి అధికారంలోకి రావాలి అనేది ప్రతిపక్షం లక్ష్యం. కానీ ఏపీలో ఇదేది కనిపించడం లేదు. ప్రజల్లో చీలిక తేవడం ద్వారానే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గతంలో లబ్దిపొందింది. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి బెంగళూరు వేదికగా చేసుకుని అదే ప్రయత్నాల్లో ఉన్నారని టిడిపి నేతలు అనుమానిస్తున్నారు. మొన్న నకిలీ మద్యం వెలుగు చూడడం వెనుక బెంగళూరు వ్యూహం ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. చివరకు నిందితుడే అడ్డం తిరగడంతో ఈ విషయం బయటపడింది. కొద్దిరోజుల ముందు చిత్తూరు జిల్లాలో నకిలీ మద్యం బయటపడింది. ఆ తరువాత రోజు ఇబ్రహీంపట్నంలో మాజీమంత్రి జోగి రమేష్ యాగి చేశారు. అక్కడకు కొద్ది రోజులకే ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అద్దేపల్లి జనార్దన్ రావు తనతో ఈ నకిలీ మద్యం చేయించింది జోగి రమేష్ అని బయట పెట్టేశారు. అయితే 2014లో సైతం ఐప్యాక్ తో పాటు వైసీపీ సోషల్ మీడియాను ఆసరాగా చేసుకుని ఇదే తరహా ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు కూడా బెంగళూరు వేదికగా జగన్మోహన్ రెడ్డి అదే పని చేస్తున్నారన్న అనుమానం టిడిపి నేతల్లో ఉంది. అయితే ఆ అనుమానాల్లో నిజం ఎంత ఉందో చూడాలి.