Mana Shankara Vara Prasad Story: కమర్షియల్ సినిమాలను సక్సెస్ ఫుల్ గా తెరకెక్కించగలిగే దర్శకులలో అనిల్ రావిపూడి ఒకరు. ఆయన నుంచి వచ్చే ప్రతి సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉంటాయి. అలాగే తన మార్క్ కామెడీ తో ప్రేక్షకులను అలరిస్తూ ఉంటాడు. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలన్నీ సూపర్ సక్సెస్ గా నిలిచాయి. కారణం ఏదైనా కూడా అతని సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందనే చెప్పాలి. ఇక కొంతమంది జనాలకు ఆయన సినిమాలు రొటీన్ కామెడీ సినిమాలు గా అనిపించినప్పటికి చాలామంది ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం అతని సినిమాలను ఆదరిస్తూ ఉంటారు. ఇక రీసెంట్ గా చిరంజీవితో చేసిన ‘మన శంకర వరప్రసాద్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమా సైతం పాజిటిక్ టాక్ ను సంపాదించుకొని ముందుకు దూసుకెళ్తుండడం విశేషం… నిజానికి మన శంకర వరప్రసాద్ సినిమా కథని తమిళ్ స్టార్ హీరో అయిన రజినీకాంత్ కోసం రాసుకున్నారట. కానీ చిరంజీవితో సినిమా సెట్ అవ్వడంతో రజినీకాంత్ కోసం అనుకున్న కథలోనే చాలా వరకు మార్పులు చేర్పులు చేసి చిరంజీవి ఇమేజ్ కి తగ్గట్టుగా అతను చేజెస్ చేసి సినిమా చేసినట్టుగా తెలుస్తోంది.
ఇక ఏది ఏమైనా కూడా అనిల్ రావిపూడి చిరంజీవికి ఒక మంచి సక్సెస్ ని కట్టబెట్టాడనే చెప్పాలి… అనిల్ ఏ హీరోతో అయితే సినిమా చేస్తాడో ఆ సినిమా హీరోకు సంబంధించిన గత సినిమాల నుంచి తన మ్యానరిజమ్స్ ని తీసుకొని అందులో ఏదో ఒక పాయింట్ ను లాక్ చేసి దాని మీద కథ మొత్తం నడిపిస్తూ ఉంటాడు.
అందుకే అనిల్ రావిపూడి సినిమాలకు సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది. ఇక హీరోల అభిమానులను సైతం అతను అలరిస్తుంటాడు. కాబట్టి అనిల్ రావిపూడి సినిమాలను ఆయా హీరోల ఫ్యాన్స్ సైతం ఆదరిస్తూ ఉంటారు. ఇక ఇప్పటివరకు ఆయన స్టార్ హీరోలతో సినిమాలను చేస్తూ వస్తున్నాడు.
మరి ఇకమీదట చేయబోతున్న సినిమాల విషయంలో ఆయన మరికాస్త జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందని పలువురు సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇక ఇప్పటికైనా ఆయన కొంచెం రూటు మార్చి కొత్త తరహాలో వెళ్తే ప్రేక్షకులకు మరింత కిక్ ఇచ్చినవాడవుతాడు…