Vijaya Sai Reddy: వైసీపీలో(YCP) విజయసాయిరెడ్డి ది కీలక పాత్ర. పార్టీ ఆవిర్భావం నుంచి ఆయనది యాక్టివ్ రోల్. ఒకానొక దశలో పార్టీలో నెంబర్ 2 ఎవరంటే విజయసాయిరెడ్డి పేరే వినిపించేది. కానీ ఎందుకో సజ్జల రామకృష్ణారెడ్డి(Sajjala Ramakrishna Reddy) వచ్చిన తర్వాత ప్రాధాన్యత తగ్గుతూ వచ్చింది. అయితే ఉన్నట్టుండి వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి(Prabhakar Reddy) టిడిపిలోకి వెళ్లిపోవడంతో… విజయసాయిరెడ్డిని తెరపైకి తెచ్చారు జగన్(Jagan). నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయించారు. ఎన్నికల ప్రచారంలో మెరుపులు మెరిపించిన విజయసాయి.. పోలింగ్ తర్వాత సడన్ గా మాయమయ్యారు. కనీసం ఇంతవరకు ఎక్కడా కనిపించడం లేదు. ఎటువంటి సమయంలోనైనా మాట్లాడగలగే నేర్పరి ఎందుకు మౌనం వహించారు అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
Also Read: Andhra Pradesh: సంక్షేమం వైపా.. అభివృద్ధి వైపా.. ఏపీ ప్రజలు ఎటువైపు?
పోలింగ్ ముగిసిన తర్వాత వైసీపీ నేతలు ఒక్కొక్కరు తెరపైకి వచ్చారు. సీఎం జగన్ ఐప్యాక్ కార్యాలయానికి వెళ్లి మనదే విజయం అని చెప్పుకొచ్చారు. అనంతరం విదేశాలకు వెళ్లిపోయారు. అటు తరువాత సీనియర్ మంత్రి బొత్స తెర పైకి వచ్చారు. వైసీపీదే విజయం అని తేల్చేశారు. అంతటితో ఆగకుండా విశాఖలోజూన్ 9న జగన్ ప్రమాణస్వీకారం చేస్తారని కూడా ప్రకటించారు. ఇంచుమించు వైవి సుబ్బారెడ్డి కూడా ఆతరహా ప్రకటనే చేశారు. తరువాత సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చారు. మరి కొంచెం మసాలా తట్టించి మాట్లాడారు. అయితే ఇంత జరిగినా విజయసాయిరెడ్డి కనిపించకపోవడం మాత్రం ఆందోళన కలిగిస్తోంది. ఓడిపోతున్నామన్న బాధ, లేకుంటే ఓడిపోయే నియోజకవర్గానికి పంపించారన్న బాధ తెలియదు గానీ ఆయన మాత్రం ఎటువంటి కామెంట్స్ చేయడం లేదు.
Also Read: AP Election Results 2024 : తొలి ఫలితం ఆ నియోజకవర్గానిదే!
గతంలో టిడిపి పై ఒంటికాలితో విజయసాయిరెడ్డి లేచేవారు. అయినదానికి కాని దానికి చంద్రబాబు, లోకేషులపై విరుచుకుపడేవారు. అకస్మాత్తుగా ఆయన మౌనం పాటించడం ఏమిటి అన్న ప్రశ్న అయితే ఒకటి బలంగా వినిపిస్తోంది. ఆయన తరువాత క్యాడర్ లో ఉన్న అంబటి రాంబాబు, జోగి రమేష్ లాంటి వారు మాట్లాడుతున్నారు తప్ప.. విజయసాయిరెడ్డి ఎక్కడా మాట్లాడడం లేదు. పైగా వైసీపీకి అనుకూల ఫలితాలు ఇచ్చిన ఆరా మస్తాన్ సైతం.. నెల్లూరులో విజయసాయిరెడ్డి ఓడిపోతున్నారని తేల్చి చెప్పారు. అసలే నెల్లూరులో పోటీ చేయడం విజయ్ సాయి రెడ్డికి ఇష్టం లేదని ప్రచారం జరిగింది. ఇప్పుడు ఆయన వ్యూహాత్మక మౌనం ఎటు దారితీస్తుందో అన్న అనుమానం వైసీపీ శ్రేణుల్లో ఉంది.