Kodali Nani Latest News: రాజకీయాల్లో క్రియాశీలకం అవుతానని కొడాలి నాని( Kodali Nani) ప్రకటించారు. జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసే వరకు పోరాడుతానని చెప్పారు. నిన్ననే ఆయన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా గుడివాడ వచ్చి కీలక వ్యాఖ్యలు చేశారు. అన్ని అంచనాలను తెరదించుతూ కొడాలి నాని యాక్టివ్ అవుతానని చెప్పేసరికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సైతం ఆనందంతో ఉబ్బితబిబ్బయ్యాయి. అయితే అంతవరకు ఓకే కాని గతం మాదిరిగా అదే భాషను కొడాలి నాని ప్రయోగిస్తారా? అనే అనుమానం అయితే ఉంది. వాడు,వీడు, నా కొడకా, గాండు నా కొడకా, పకోడీ నా కొడకా అంటూ పదప్రయోగం చేసేవారు కొడాలి నాని. అయితే ఈ తరహా భాష వాడేవారు బోరుగడ్డ అనిల్ కుమార్. ఇప్పుడు అదే బోరుగడ్డను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేదని నాయకత్వం తేల్చేసింది. అసలు ఆ బోరు గడ్డ ఎవరు అని తమకు తెలియదని సంశయం వ్యక్తం చేస్తోంది. కానీ ఆయనతో సమానంగా వ్యాఖ్యలు చేసిన కొడాలి నాని వైసీపీలో యాక్టివ్ అవుతామంటే ఒప్పుకుంటుందా అనేది ఒక అనుమానం. అయితే కచ్చితంగా ఒప్పుకుంటుంది. ఎందుకంటే కొడాలి నాని లాంటి దూకుడు నేత యాక్టివ్ అవుతామంటే వైసీపీకి అదనపు బలమే. అయితే మొన్న ఎన్నికల్లో మాత్రం కొడాలి నాని పదప్రయోగం మైనస్ గా మారింది. అది ప్లస్ గా మారాలి అంటే కొడాలి నాని భాషలో మార్పు రావాలి.
సీనియర్ల బాధ అదే..
అయితే మొన్నటి ఎన్నికల ఫలితాలు అనంతరం కొడాలి నాని లాంటి వారి మూలంగానే ఓడిపోయామన్న బాధ చాలామంది సీనియర్లు వ్యక్తం చేశారు. ఆయన వాడిన భాష వల్ల పార్టీకి మైనస్ అయింది అన్నది మెజారిటీ సీనియర్ నేతల అభిప్రాయం. ఇప్పుడు అదే కొడాలి నాని పార్టీలో యాక్టివ్ అవుదాం అంటే సీనియర్లు ఒప్పుకుంటారా అనేది ఒక ప్రశ్న. నిన్ననే కొడాలి నాని యాక్టివ్ అవుతానని చెప్పారు. అప్పుడే పార్టీ నుంచి ఒక ప్రెస్ నోట్ రిలీజ్ అయింది. బోరుగడ్డ అనిల్ కుమార్( borugadda Anil Kumar ) అనే వ్యక్తితో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదని.. ఆయన వ్యాఖ్యలతో పార్టీకి ప్రమేయం లేదు అంటూ ఆ ప్రెస్ నోట్లో పేర్కొన్నారు. అంటే ఇప్పుడు కొడాలి నాని విషయంలో పార్టీ హై కమాండ్ ఏదో ఒక క్లారిటీ ఇవ్వాలి కదా అన్నది ఒక సెటైరికల్ గా వస్తున్న మాట.
సేమ్ టు సేమ్ పదప్రయోగం..
వాస్తవానికి బోరుగడ్డ అనిల్ కుమార్ ప్రయోగించిన భాష కు దగ్గరగా ఉంటుంది కొడాలి నాని నోటి నుంచి వచ్చే భాష. మరి అటువంటి అప్పుడు కొడాలి నాని విషయంలో కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రకటన చేయాలి కదా. ఆయన వ్యాఖ్యలతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదని చెప్పొచ్చు కదా. ఐదేళ్లపాటు బోరుగడ్డ అనిల్ కుమార్ ను ఎంటర్ టైన్ చేసింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. కానీ ఇప్పుడు అవసరం తీరాక ఆయన ఎవరో కాదంటుంది. అలాగే కొడాలి నాని కి గుడివాడలో ప్రత్యామ్నాయ నాయకుడు దొరికితే అదే మాట వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చెప్పగలుగుతుందా? అంతగా చెప్పే సాహసం చేయగలదా? ఇలా ఎన్నెన్నో ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అంతిమంగా ఒక విషయాన్ని ఇవి తెలియజెప్పుతున్నాయి. రాజకీయపరంగా అతిగా భాష వాడితే అంతిమంగా వారితో పాటు వారు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీకే నష్టం. ఇకనైనా కొడాలి నాని లాంటి వారు ఈ విషయాన్ని తెలుసుకుంటే మంచిది?