KIA Seltos: ఆటోమొబైల్ రంగంలో ప్రస్తుతం మిడ్ సైజ్ SUV కార్లకు విపరీతమైన డిమాండ్ ఉంది. నేరుగా SUV కార్లను కొనలేని వారు వీటికి ప్రాధాన్యత ఇస్తున్నారు. వినియోగదారుల అవసరాలను గుర్తించిన కొన్ని కంపెనీలు ప్రత్యేకంగా ఈ మోడల్స్ను మార్కెట్లోకి తీసుకొస్తున్నారు. లేటెస్ట్ గా ప్రముఖ కంపెనీ KIA Seltos సెకండ్ జనరేషన్ ను ఆవిష్కరించింది. లేటెస్ట్ ఫీచర్లతో పాటు అత్యాధునికమైన పరికరాలతో మార్కెట్లోకి తీసుకువచ్చింది. అయితే ఈ కారుకు సంబంధించిన బుకింగ్ గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. మరి కియా సేల్టోస్ లేటెస్ట్ జనరేషన్ విశేషాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
కియా సేల్టోస్ గురించి ఇప్పటికే కార్లు ఉన్న వారికి అవగాహన ఉంది. అయితే నేటి కాలం వారికి అనుగుణంగా అత్యధిక సౌకర్యాలను అమర్చి దీనిని మార్కెట్లోకి తీసుకువస్తున్నారు. ఇందులో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్, 1.5 లీటర్ టర్బో పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్ అనే మూడు ఇంజన్లను అమర్చారు. ఇవి వరుసగా 115, 160, 116 హెచ్పి పవర్ ను అందిస్తుంది. అలాగే 144, 253, 250 NM పార్కులు రిలీజ్ చేస్తాయి. మాన్యువల్ తో పాటు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ తో పనిచేసే ఈ కారు లో సేఫ్టీ కోసం సిక్స్ ఎయిర్ బ్యాగ్స్, ఈఎస్పీ, డిస్క్ బ్రేక్స్, 360 డిగ్రీ కెమెరా, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వంటి ఫీచర్లతో అత్యంత రక్షణను ఇస్తాయి.
ఇంటీరియర్ ఫీచర్స్ విషయానికి వస్తే. ఇందులో 12.3 అంగుళాల డిజిటల్ హెచ్డి ఇన్ఫోటైన్మెంట్ సిస్టం టచ్ స్క్రీన్ సింగల్ ప్యానెల్ తో పాటు విజువల్ కమాండర్ ఉన్నాయి. ఫ్రంట్ వెంటిలేటర్ సీట్లు, 64 కలర్ యాంబినేట్ మూడు లైటింగ్ వంటివి ఉన్నాయి.ఎక్స్టీరియర్ ఫీచర్స్ విషయానికి వస్తే గతంతో పోలిస్తే లేటెస్ట్ కారు 80 మిల్లీమీటర్ల వీల్ బేస్ పెరిగింది. అలాగే 18 అంగుళాల అల్లాహ్ ఈ వీల్స్, కనెక్టెడ్ లైట్ లతో కూడిన అప్డేటెడ్ టైల్ gate అమర్చారు. ఫ్రంట్ అండ్ బ్యాక్ గన్ మెటల్ ఫినిష్ స్కిడ్ ప్లేట్ల తో పాటు కొత్త బంపర్లు అమర్చారు. అలాగే ప్రస్తుతం ఎక్కువమంది కోరుకునే పనోరమిక్ సన్రూఫ్, ఇంటిగ్రేటెడ్ రియల్ spoiler వంటివి ఉన్నాయి.
SUV ఎక్కువగా కోరుకునే వారితోపాటు కొత్తగా కార్ కొనాలని అనుకునే వారికి ఈ లేటెస్ట్ మోడల్ బాగా నచ్చుతుందని కంపెనీ ప్రతినిధులు అంటున్నారు. అయితే ఈ కారు ఫీచర్స్ తెలిసినప్పటికీ ధర మాత్రం అధికారికంగా వెల్లడించలేదు. గతంలో కియా seltos రూ.13 లక్షల ప్రారంభ ధర నుంచి రూ. 24 లక్షల వరకు ఉండేది. అయితే ఇప్పుడు కొత్త కారు కూడా ఇంచుమించు అదే ధరలో ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు.