Chandrababu plan working: ఏపీలో( Andhra Pradesh) కూటమి ప్రభుత్వం దూకుడు మీద ఉంది. పెద్ద ఎత్తున అభివృద్ధి పై దృష్టి పెట్టింది. ఒకవైపు సంక్షేమ పథకాలను అమలు చేస్తూనే మరోవైపు అభివృద్ధిని పరుగు పెట్టిస్తోంది. అయితే సంపద సృష్టిస్తానన్న చంద్రబాబు ఆదాయంలో వెనుకబడ్డారని విపక్షాలు విమర్శలు చేస్తూ వచ్చాయి ఈ నేపథ్యంలో రాబడిపై దృష్టి పెట్టారు చంద్రబాబు. అవి సత్ఫలితాలను ఇచ్చేలా ఉన్నాయి. కేవలం 9 నెలల కాలానికి పన్ను రాబడి ఆదాయం లక్ష కోట్ల రూపాయల మార్కును దాటడం విశేషం. ఏపీలో మారుతున్న పరిణామాలకు ఇది నిదర్శనం అని కూటమి వర్గాలు చెబుతున్నాయి. ఈ స్థాయిలో పన్ను రాబడిని సాధించింది గతంలో ఎప్పుడూ లేదు. ఇది నిజంగా కూటమి ప్రభుత్వం సాధించిన రికార్డుగా చెప్పవచ్చు.
సంక్షేమంతో పాటు అభివృద్ధి..
2024 ఎన్నికల్లో చంద్రబాబు( CM Chandrababu) చాలా రకాల హామీలు ఇచ్చారు. రెట్టింపు సంక్షేమం అంటూ ప్రకటనలు చేశారు. అయితే అధికారంలోకి వచ్చిన తొలి మూడు నెలలు పాలనపై దృష్టి పెట్టారు. ప్రభుత్వం కుదురుకోవడానికి సమయం పట్టింది. ఈ పరిస్థితుల్లో ప్రతిపక్షాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. సంక్షేమ పథకాల అమలు లేదు.. సంపద సృష్టి లేదు అంటూ వైసీపీ నేతలు విమర్శలు చేయడం ప్రారంభించారు. ఇటువంటి తరుణంలో పన్నుల ఆదాయం పై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టారు సీఎం చంద్రబాబు. అందుకే ఇప్పుడు జీఎస్టీ, స్టాంపుల రిజిస్ట్రేషన్ ల ఫీజుతోపాటు భూమి శిస్తు, అమ్మకపు పన్ను, ఎక్సైజ్ సుంకం, కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా, ఇతర పనులను కలిపితే రాష్ట్ర రాబడి వస్తోంది. దీంతో గతంలో ఎన్నడూ లేని ఆదాయం కనిపిస్తోంది ప్రభుత్వానికి.
ఇంకా మూడు నెలల వ్యవధి..
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం( financial year ) దాదాపు తొమ్మిది నెలలు పూర్తవుతోంది. ఇంకా మూడు నెలల వ్యవధి ఉంది. అయితే ఈ ఆర్థిక సంవత్సరంలో పన్నుల రాబడి రూ. 1.66 లక్షల కోట్లు వస్తాయని అంచనా వేశారు. గత డిసెంబర్ వరకు 63.23% రాబడి సమకూరింది. అయితే అనేక రకాల అనుమానాలు ఉన్న దృష్ట్యా సంక్రాంతి సందర్భంగా జరిగిన క్రయవిక్రయాలతో ఏపీకి భారీ ఆదాయం వచ్చింది. ఈ తొమ్మిది నెలల కాలంలోనే లక్ష కోట్ల పన్నుల ఆదాయం దాటేసింది. అయితే మూడు నెలల వ్యవధిలో మరో 50 వేల కోట్ల రూపాయలు సమకూర్చుకోవాల్సి ఉంటుంది. వాస్తవానికి సెప్టెంబర్ నుంచి ఏపీకి పన్నుల రూపంలో రాబడి పెరిగింది. భారీగా ఆదాయం సమకూరింది. ఈ ఏడాది సంక్రాంతితో పూర్తిగా స్వరూపమే మారిపోయింది.