Waqf Bill: రాజకీయంగా నిర్ణయాలు తీసుకోవడంలో వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ వెనుకబాటు స్పష్టంగా కనిపిస్తోంది. మొన్నటికి మొన్న వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకించింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. పార్లమెంటులోని ఉభయసభల్లో వ్యతిరేకంగా ఓటు వేసింది. తాము ముస్లింల పక్షమేనని తేల్చి చెప్పింది. అయితే కేంద్రం పెట్టిన ఆ బిల్లు పాస్ అయ్యింది. దానిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి రాజకీయ పార్టీలు. ఎంఐఎం తో పాటు చాలా పార్టీలు కోర్టులో పిటిషన్లు వేశాయి. అయితే తాజాగా పిటిషన్ దాఖలు చేసింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. దీంతో ఆ పార్టీ తీరుపై ఇప్పుడు కొత్త చర్చ ప్రారంభం అయ్యింది.
Also Read: జగన్ కు ముద్రగడ లేఖ.. జీర్ణించుకోలేకపోతున్న కాపు సామాజిక వర్గం!
* ఏకాభిప్రాయానికి ప్రయత్నం..
మూడోసారి ఎన్డీఏ( National democratic Alliance) అధికారంలోకి వచ్చిన తరువాత వక్ఫ్ బిల్లును సవరించాలని చూసింది. అయితే అన్ని రాజకీయ పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో మిత్రపక్షాల సాయంతో ఈ బిల్లుకు ఆమోదం పొందాలని కేంద్రం చూసింది. ముందుగా ఏకాభిప్రాయానికి ప్రయత్నించింది. కాకపోయేసరికి ఏకంగా బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. అయితే ఈ బిల్లును సవరించడం ద్వారా ముస్లింల హక్కులకు భంగం వాటిల్లుతుందని.. వారికి చెందిన ఆస్తులకు రక్షణ లేకుండా పోతుందన్నది ఆందోళన. ఎట్టి పరిస్థితుల్లో ఈ బిల్లుకు సహకారం అందించవద్దని ముస్లింలు అన్ని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేశాయి. అయితే బిజెపితో పాటు టిడిపి, జెడియు, జెడిఎస్, జనసేన సహకారంతో ఈ బిల్లు ఆమోదం పొందింది.
* వారం రోజుల తర్వాత పిటిషన్..
పార్లమెంట్లో ( parliament)ఓటింగ్ జరిగి వారం రోజులు దాటిపోయింది. బిల్లు పాస్ అయిన రోజునే అసదుద్దీన్ ఓవైసీ తో సహా చాలామంది పిటిషన్లు వేశారు. తాజాగా తమిళనాడులో టీవీకి అధ్యక్షుడు విజయ్ కూడా పిటిషన్ వేశారు. వారందరూ వేసిన తర్వాత తీరుబాటుగా ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వేసింది. అయితే ఇటీవల ఆ పార్టీ వ్యవహరించిన తీరుతో డ్యామేజ్ జరిగింది. ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. కానీ రాజ్యసభలో మాత్రం ఓ ఇద్దరు ఎంపీలు క్రాస్ ఓటింగ్కు పాల్పడినట్లు జాతీయస్థాయిలో చర్చ జరిగింది. దీంతో కేంద్రంలో ఉన్న బిజెపికి భయపడి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అలా వ్యవహరించిందన్న టాక్ కూడా ఉంది. ఈ తరుణంలో ముస్లింల నుంచి ఆగ్రహం రాకుండా ఈ పిటిషన్ నాటకానికి తెరలేపిందన్న టాక్ వినిపిస్తోంది.
* అడగకుండానే మద్దతు..
ఎన్డీఏ మూడోసారి అధికారంలోకి వచ్చింది. అందులో తెలుగుదేశం( Telugu Desam) పార్టీ కీలక భాగస్వామిగా ఉంది. ఒక విధంగా చెప్పాలంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేక ప్రభుత్వం అది. కానీ జగన్ మాత్రం అలా భావించలేదు. కేంద్ర ప్రభుత్వం అడగకుండానే తన మద్దతును తెలిపారు. స్పీకర్ ఎన్నిక సమయంలో స్వచ్ఛందంగా మద్దతు ప్రకటించారు. చాలా బిల్లుల విషయంలో ఎన్డీఏకు అనుకూలంగా ఓటింగ్ వేశారు. కానీ తనకు వెన్నుదన్నుగా నిలుస్తున్న ముస్లింలను దూరం చేసుకోవడం జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదు. అలాగని కేంద్రానికి వ్యతిరేకించే పరిస్థితి లేదు. అందుకే రాజ్యసభలో అనుకూలంగా ఓటింగ్ వేయించి.. ఇలా న్యాయస్థానంలో పిటిషన్ వేయించారని ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. మొత్తానికైతే జగన్మోహన్ రెడ్డి ద్వంద వైఖరి స్పష్టంగా కనిపిస్తోంది.
Also Read: కెసిఆర్ ను ఫాలో అవుతున్న జగన్!