Homeఆంధ్రప్రదేశ్‌Google data center Vizag investment: గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు ను మర్చిపోకముందే.. వైజాగ్...

Google data center Vizag investment: గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు ను మర్చిపోకముందే.. వైజాగ్ కు మరో భారీ పెట్టుబడి..

Google data center Vizag investment: అంతర్జాతీయ నగరంగా ఎదగడానికి విశాఖపట్నం వేగంగా అడుగులు వేస్తోంది. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ విశాఖ నగరాన్ని సమూలంగా మార్చడానికి కంకణం కట్టుకున్నారు. ఈ క్రమంలోనే విశాఖపట్నం అభివృద్ధికి.. అంతర్జాతీయ నగరంగా ఎదగడానికి కావలసిన అన్ని సదుపాయాలు కల్పిస్తున్నారు.

విశాఖపట్నం నగరంలో విస్తారంగా భూమి ఉంది. వనరులు కూడా ఉన్నాయి.. టిడిపి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మౌలిక వసతులు కల్పించడంతో అక్కడ వివిధ కంపెనీలు తమ కార్యాలయాలను ఏర్పాటు చేసుకోవడానికి అనుకూలమైన వాతావరణం ఏర్పడింది. ఈ నేపథ్యంలో గూగుల్ తన డాటా సెంటర్ ను ఏర్పాటు చేసింది. దీని విలువ అక్షరాల 1.35 లక్షల కోట్లు. ఇది ఒక గిగా వాట్ సామర్ధ్యంతో పనిచేస్తుంది.

Google సంస్థ డేటా సెంటర్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. అది అలా ఉండగానే ఏపీ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి వచ్చింది. ఈసారి కూడా విశాఖపట్నంలోనే ఆ సంస్థ తన కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఇంతకీ ఆ సంస్థ మరేదో కాదు.. రిలయన్స్.. రిలయన్స్ ఇండస్ట్రీస్ 1.6 లక్షల కోట్ల ఖర్చుతో 1.5 గిగావాట్ సామర్థ్యం తో డాటా సెంటర్ ఏర్పాటు చేస్తోంది. ఇది పూర్తిగా ఏఐ విధానంలో పనిచేస్తుంది. దీంతోపాటు క్యాప్టివ్ సోలార్ ఎనర్జీ, బ్యాటరీ స్టోరేజి సిస్టం ను ఏర్పాటు చేస్తుంది. మొదటగా 500 మెగావాట్ల ప్రాజెక్టు అక్టోబర్ 2028 నాటికి పూర్తవుతుంది. 1 గిగా వాట్ రెండవ దశ 2030 నాటికి పూర్తవుతుంది..

రెండు అతిపెద్ద భారీ సంస్థలు విశాఖపట్నంలో అత్యంత భారీ పెట్టుబడి పెడుతున్న నేపథ్యంలో నగరం రూపురేఖలు పూర్తిగా మారబోతున్నాయి. విశాఖపట్నం అంటే ఇప్పటివరకు సముద్రం.. నేవి.. కొండలు.. మన్యం వంటి ప్రాంతాలు మాత్రమే గుర్తుకొచ్చేవి. ఇకపై ఈ డేటా సెంటర్లు కూడా ఆ నగర కలకితురాయిలో భాగం కాబోతున్నాయి. వీటివల్ల అక్కడి యువతకు ప్రత్యక్షంగా.. పరోక్షంగా ఉపాధి లభించబోతోంది. ప్రభుత్వానికి కూడా దండిగా ఆదాయం వస్తుంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...

Lenin Movie : 11వ రోజు ఊహించని రికార్డు నెలకొల్పిన ‘లెనిన్’.. ఇప్పట్లో ఈ సునామీ ఆగేలా లేదు..

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన 'లెనిన్' చిత్రం వసూళ్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న...

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...
Oktelugu Epaper
Exit mobile version