spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Nara Lokesh sharp counter YCP: మాది గూగుల్.. మీది గొడ్డలి.. ఆ ఒక్క మాటతో...

Nara Lokesh sharp counter YCP: మాది గూగుల్.. మీది గొడ్డలి.. ఆ ఒక్క మాటతో వైసీపీకి ఇచ్చిపడేసిన నారా లోకేష్

Nara Lokesh sharp counter YCP: ప్రఖ్యాత గూగుల్ సంస్థ విశాఖపట్నంలో భారీగా పెట్టుబడి పెట్టింది. 1.35 లక్షల కోట్లతో ఒక గిగా వాట్ సామర్ధ్యంతో డాటా సెంటర్ ఏర్పాటు చేయబోతోంది.. డాటా సెంటర్ కు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ఐటీ మంత్రి నారా లోకేష్.. గూగుల్ ప్రతినిధులు.. విదేశీ ప్రతినిధులు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమం తర్వాత విదేశీ ప్రతినిధులతో.. దేశీయ ఐటీ నిపుణులతో ఓ కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం నిర్వహించింది.

ఎక్కడో ఉన్న అమెరికాలో గూగుల్ సంస్థ ప్రతినిధులతో మాట్లాడి.. వారికి విశాఖపట్నంలో ఉన్న అనుకూలతలను వివరించి.. గూగుల్ ప్రతినిధులను ఒప్పించి.. ఈ స్థాయిలో పెట్టుబడులు పెట్టించడానికి ఎంత కష్టపడింది నారా లోకేష్ వివరించారు. గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు కోసం విశాఖపట్నం నగరంలో ఉన్న రైతులు తమ భూములు ఇచ్చారని.. కానీ ఈ డేటా సెంటర్ ఏర్పాటు ఇష్టం లేని వైసిపి తన ఎంపీ తో కేసు వేయించిందని నారా లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. వైసిపికి అభివృద్ధి అనేది ఇష్టం ఉండదని.. వారిది కేవలం హత్య రాజకీయమని నారా లోకేష్ ఆరోపించారు.

నారా లోకేష్ ఈ వేదిక మీద మాట్లాడుతూ మరో సంచలన వ్యాఖ్య చేశారు. తమ పార్టీ పేరు చెబితే గూగుల్ గుర్తుకొస్తుందని.. తమ విధానం కూడా అభివృద్ధి అని.. అందువల్లే గూగుల్ లాంటి కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తున్నాయని నారా లోకేష్ వివరించారు. తమ పార్టీ విధానం అభివృద్ధి వైపు సాగుతూ ఉంటే. వైసీపీ విధానం మాత్రం గొడ్డలి వైపు సాగుతోందని లోకేష్ ఆరోపించారు. “మాది గూగుల్.. వైసీపీ ది గొడ్డలి” అని నారా లోకేష్ విమర్శించారు.

అంతేకాదు ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ మీద కూడా నారా లోకేష్ సెటైర్లు వేశారు. ఆయనకు క్రెడిట్ చోరీ చేసే అలవాటు ఉందని.. రేపట్నాడు గూగుల్ డాటా సెంటర్ కూడా తన వల్లే ఏర్పాటయిందని చెప్పుకుంటారని లోకేష్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. జగన్ పార్టీ.. కార్యకర్తలు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలని.. ఏపీ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధికి అడ్డు పడకూడదని నారా లోకేష్ సూచించారు. నారా లోకేష్ ఈసారి ప్రసంగంలో పవన్ కళ్యాణ్, బాలయ్యను ప్రస్తావించారు. అత్తారింటికి దారేది సినిమాలో లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కే వేరప్ప.. బాలకృష్ణ నటించిన అఖండ సినిమాలో బోత్ ఆర్ నాట్ సేమ్ డైలాగులను నారా లోకేష్ ప్రస్తావించి సభికులను నవ్వించే ప్రయత్నం చేశారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version