Visakhapatnam Investment Summit: విశాఖలో( Visakhapatnam) పెట్టుబడుల సదస్సు జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ సదస్సులో.. ఏపీ సీఎం చంద్రబాబు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. ప్రపంచ నలుమూలల నుంచి వివిధ సంస్థల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు వచ్చారు. అయితే ఎక్కువమంది చంద్రబాబుతో మాట్లాడేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. బహిరంగంగానే ఈ ఈ విషయాన్ని వారు చెబుతున్నారు. చంద్రబాబుకు ఉన్న అనుభవం, విజనరీ ఆలోచనలు తమ వ్యాపారాలకు ఉపయోగపడతాయని వారు భావిస్తున్నారు. అందుకే పెట్టుబడుల సదస్సులో చర్చల్లో పాల్గొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. చంద్రబాబు ను రాజకీయంగా విభేదించిన వారు ఉండవచ్చు కానీ.. ఆయన ఆలోచనలు మాత్రం భవిష్యత్ తరాలకు తగ్గట్టుగా ఉంటాయి. ముఖ్యంగా వ్యాపార, వాణిజ్య అంశాల్లో చంద్రబాబు శైలి ప్రత్యేకం.
* ప్రారంభం నుంచి అంతే..
1995లో చంద్రబాబు( CM Chandrababu) ముఖ్యమంత్రి అయ్యారు. అయితే అది మూన్నాళ్ళ ముచ్చట అని ఎక్కువ మంది భావించారు. ఎందుకంటే అప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ బలీయమైన శక్తిగా ఉండేది. ఏపీలో చంద్రబాబును ప్రయోగించి మహాశక్తిగా ఉన్న ఎన్టీఆర్ను అధికారం నుంచి దూరం చేసింది కాంగ్రెస్. కానీ చంద్రబాబులో పాలనా దక్షత, సుదీర్ఘ ప్రయోజనాల ఆలోచనలు, ఏపీ ప్రజలను ప్రభావితం చేసే శక్తి ఉందన్న విషయాన్ని కాంగ్రెస్ గ్రహించలేదు. నాడే గ్రహించి ఉంటే చంద్రబాబుకు తప్పకుండా అడ్డుకట్ట పడేది. చంద్రబాబు సీఎం గా బాధ్యతలు స్వీకరించిన మరుక్షణం పెట్టుబడులు, పరిశ్రమలు, స్కిల్, ఉపాధి అంటూ ఆయన చేసిన ప్రయత్నాలతో ఎన్నో దిగ్గజ కంపెనీలు వచ్చాయి. అప్పటికే ఉన్నవి విస్తరించాయి. ప్రజలకు అవే నచ్చాయి. చంద్రబాబు నాయకత్వాన్ని నిలబెట్టాయి.
* అందరి చూపు ఏపీ వైపు..
దేశంలో చాలా రాష్ట్రాలు ఉండగా ఇప్పుడు పారిశ్రామికవేత్తలు ఏపీ వైపు చూడడానికి ప్రధాన కారణం చంద్రబాబు. ఆ రాష్ట్రాల మాదిరిగా రాజకీయ ఒత్తిళ్లు ఏపీలో ఉండవు. చంద్రబాబు ఉన్నారన్న ధీమా పారిశ్రామికవేత్తల్లో ఉంటుంది. మరోవైపు ఏపీలో పెట్టుబడులు పెట్టాలంటే ఇట్టే అనుమతులు వస్తున్నాయి. పరిశ్రమల ఏర్పాటుకు కూడా మార్గం వేగంగా సుగమం అవుతోంది. గతంలో కియా పరిశ్రమ విషయంలో చంద్రబాబు చూపిన చొరవ ఇప్పటికీ గుర్తించుకుంటారు పారిశ్రామికవేత్తలు. అయితే కియా పరిశ్రమ అనంతపురం వచ్చింది కానీ అనుబంధ పరిశ్రమలు తీసుకురావడంలో తర్వాత వచ్చిన వైసిపి ప్రభుత్వం విఫలమయింది. చంద్రబాబు ప్రయత్నం బూడిదలో పోసిన పన్నీరు అయింది.
* లోకేష్ సైతం
చంద్రబాబు అనుకుంటే.. ఆయన కుమారుడు లోకేష్( Nara Lokesh) సైతం అదే ధోరణి అనుసరిస్తున్నారు. పరిశ్రమలతో పాటు పెట్టుబడులను ఆకర్షించేందుకు లోకేష్ చేస్తున్న ప్రయత్నాలు వర్కౌట్ అవుతున్నాయి. విద్యాధికుడు కావడంతో పాటు ఆలోచన సరళి కూడా చంద్రబాబుకు పోలి ఉండడంతో పారిశ్రామిక పెట్టుబడులు నేరుగా ఏపీకి వస్తున్నాయి. ప్రపంచ దిగ్గజ సంస్థల ప్రతినిధులతో నేరుగా కలిసి డీల్ చేస్తున్నారు అంటే లోకేష్ ఏ స్థాయిలో పావులు కదుపుతున్నారో ఇట్టే అర్థమవుతుంది. అందుకే చంద్రబాబుతో పాటు లోకేష్ విషయంలో ఎలా స్పందించాలో రాజకీయ ప్రత్యర్థులకు సైతం తెలియడం లేదు. పార్టీలు అన్నాక విమర్శలు చేస్తారు కానీ ఈ తండ్రి కొడుకుల చర్యలు మాత్రం తటస్థులను ఆకట్టుకుంటున్నాయి.