Visakhapatnam Honey Trap: విశాఖలో( Visakhapatnam) హనీ ట్రాప్ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్నారు జాయ్ జమీమా. ఆమెను మరోసారి పోలీసులు అరెస్టు చేయడం హాట్ టాపిక్ అవుతోంది. 2019లో జరిగిన బ్లాక్ మెయిలింగ్ కేసులోనే ఆమెను అరెస్టు చేసినట్లు విశాఖ పోలీస్ వర్గాలు చెబుతున్నాయి. ఈ కేసులో మరో నిందితుడిగా భావిస్తున్న రత్నరాజు కూడా గతంలో అరెస్టయ్యారు. అయితే 2019లో జరిగిన బ్లాక్మెయిలింగ్ కేసుకు సంబంధించి తాజాగా జమీమాను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఆమె బాధితులు ఎవరైనా ఉంటే ఫిర్యాదు చేయవచ్చని పోలీసులు తెలిపారు.
Also Read: విశాఖలో ‘సుధార్’ మార్ట్.. దాని ప్రత్యేకత ఏంటంటే?
బెయిల్.. ఆపై అరెస్ట్.. జమీమాపై( jamiema ) గతంలో భీమిలి, కంచరపాలెం పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులలో అరెస్ట్ అయ్యారు. తరువాత బెయిల్ పై విడుదలయ్యారు. అయితే 2019లో బ్లాక్ మెయిలింగ్ కేసులో మళ్లీ ఇప్పుడు పోలీసులు అరెస్టు చేశారు. అప్పట్లో రామా టాకీ సమీపంలో ఓ ప్రైవేటు సంస్థలో జమీమా పని చేసేది. ఆ సమయంలోనే భాస్కర్ రెడ్డి అనే వ్యక్తితో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఏకంగా ఓ సంస్థ అధినేతకు వలపు వల విసిరింది. వారిని అరకు తీసుకెళ్లి కొన్ని ఫోటోలు తీశారు. ఆ ఫోటోలతో బ్లాక్ మెయిల్ చేశారు. సదరు బాధితుడిని రామ్ నగర్ లోని ఓ లాడ్జిలో బంధించి డబ్బులు వసూలు చేశారు. అయితే దీనిపై 2024లో ఎంవిపి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు బాధితులు. దీంతో పోలీసులు ఆమెను మళ్లీ అరెస్టు చేశారు. 2019లో జరిగిన ఘటనకు సంబంధించి ఇప్పుడు అరెస్టు చేయడం విశేషం. అయితే పోలీసులు మాత్రం ఈమె చేతిలో చాలామంది బాధితులు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. అటువంటివారు ఫిర్యాదు చేయవచ్చని.. వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని చెబుతున్నారు.
Also Read: ఎయిర్ పోర్టు రేంజ్ లో ఆ రైల్వే స్టేషన్.. ఏకంగా రూ.466 కోట్లతో.!
బాధితులుగా ప్రముఖులు..
అయితే జమీమా వెనుక ఒక ముఠా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నట్లు తెలుస్తోంది. విశాఖ పోలీస్ కమిషనర్( Visakha police commissioner) సీరియస్ యాక్షన్ లోకి దిగినట్లు సమాచారం. జెమినీ మా తన అందంతో, మాటలతో చాలామందిని మోసం చేసింది. వారి నుంచి డబ్బులు వసూలు చేసింది. గతంలో హైదరాబాద్కు చెందిన వ్యక్తి ఫిర్యాదు చేయడంతో ఆమెను విశాఖపట్నంలో అరెస్టు చేశారు. గతంలో ఆమెతోపాటు మరో కీలక నిందితుడిగా ఉన్న రత్నరాజును పోలీసులు అరెస్టు చేశారు. రత్నరాజు ఐటిసి ట్రేడింగ్ కంపెనీ సీఈవోగా పనిచేస్తున్నారు. రత్నరాజు జమీమాల మధ్య ఆర్థిక లావాదేవీలు కూడా జరిగాయని పోలీసులు గుర్తించారు. రత్నరాజు చాలా కాలంగా పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరిగేవాడు. భీమిలి పోలీసులు చాకచక్యంగా మూడు నెలల కిందట ఆయనను పట్టుకున్నారు. కోర్టు రిమాండ్ విధించడంతో ప్రస్తుతం సెంట్రల్ జైల్లో ఉన్నారు. అయితే ఈ ముఠా చేతిలో ప్రముఖులు సైతం బాధితులుగా మారినట్లు సమాచారం. అందుకే పోలీసులు సీరియస్ యాక్షన్ లోకి దిగినట్లు తెలుస్తోంది. మున్ముందు ఈ కేసులో కీలక అరెస్టులు ఉంటాయని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.