Kavitha Arya Visit: మీడియాదేముంది ఉస్కో అంటే డిస్కో అంటుంది.. కల్వకుంట్ల కవిత విషయంలో కూడా ఇలానే మీడియా వ్యవహరిస్తుందేమో అనే అనుమానాలు మొదటి నుంచి కూడా ఉన్నాయి. అయితే నిన్న జరిగిన పరిణామం మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది. ఎందుకంటే భారత రాష్ట్ర సమితి శాసనమండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత ఎర్రవల్లి వెళ్లారు. ఆమె వెంట కుమారుడు ఆర్య, భర్త అనిల్ కూడా ఉన్నారు. ఇటీవల కాలంలో కల్వకుంట్ల కవితకు ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం గేట్లు తెరుచుకోవడం లేదు. ఆ మధ్య ఆమెకు అందులోకి ప్రవేశం లభించినప్పటికీ కెసిఆర్ దర్శన భాగ్యం మాత్రమే సాధ్యమైంది. ఆయన నోటి నుంచి మాటగాని.. కుశల ప్రశ్నగాని కవితకు ఎదురు కాలేదు. ఒక రకంగా కవిత అన్నట్టుగా దయ్యాలు ఉండడం వల్లే కేసీఆర్ లాంటి దేవుడి పలకరింపు ఎదురు కాలేదేమో.. ఈ ఆగ్రహమో.. లేఖలు బయటికి విడుదల చేశారని కోపమో.. కారణాలు ఏమైనప్పటికీ కవిత తన అసంతృప్తిని, ఆవేదనను బయటకు వ్యక్తం చేశారు.. ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. భారత రాష్ట్ర సమితికి దగ్గర కావడానికి ఇటీవల ఒక ట్వీట్ లో రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ.. ఒక కీలక వ్యాఖ్య చేశారు. కల్వకుంట్ల కవిత ఒక మెట్టు దిగి స్నేహ హస్తం చాచినప్పటికీ గులాబీ పార్టీలోకి పున:ప్రవేశం లభించే అవకాశం దక్కనట్టు కనిపిస్తోంది.
Also Read: సొంత గూటికి కల్వకుంట్ల కవిత! ఇదిగో ప్రూఫ్
తాజాగా ఆమె తన కుమారుడు ఆర్యను తీసుకొని తన తండ్రి వ్యవసాయ క్షేత్రంలోకి వెళ్లిందని వార్తలు వస్తున్నాయి. ఆర్య అమెరికాలో గ్రాడ్యుయేషన్ చేయడానికి వెళుతున్నాడు. అమెరికా వెళ్లడానికంటే ముందు తన తండ్రి ఆశీర్వాదం ఇప్పించాలని కవిత భావించారు. ఇందులో భాగంగానే తండ్రి దగ్గరికి వెళ్లారు. తండ్రి వ్యవసాయ క్షేత్రం గేట్లు తెచ్చుకున్నప్పటికీ.. తండ్రి మాట మాత్రం కరువైంది. కనీసం కుశల ప్రశ్న కూడా సాధ్యం కాలేదు. వ్యవసాయ క్షేత్రంలో శోభమ్మ కూడా ఉండడంతో కూతురి బాధను అర్థం చేసుకొని.. నేరుగా కేసీఆర్ ఉండే పడకగదిలోకి తన మనవడు ఆర్యను తీసుకొని వెళ్ళింది. ఈ నేపథ్యంలో తను అమెరికా వెళుతున్న విషయాన్ని ఆర్య కెసిఆర్ కు చెప్పారు. ఎంతైనా బిడ్డ కొడుకు కాబట్టి.. ఎక్కడ చదువుతున్నావ్? ఏ కాలేజీ? తీసుకుంటున్న కోర్స్ ఏమిటి? ఆ వివరాలను మొత్తం కెసిఆర్ అడిగారు. శోభమ్మ దగ్గరుండి ఆర్యకు కెసిఆర్ ఆశీర్వాదం ఇప్పించారు. అనంతరం కవిత తన కుమారుడిని తీసుకొని వెళ్ళిపోయారు. ఇంతటి పరంపరలో గులాబీ బాస్ ఒక్క మాట కూడా కవితతో మాట్లాడలేదట. కవిత మాట్లాడేందుకు.. తండ్రి దగ్గరికి వెళ్లేందుకు ప్రయత్నించినప్పటికీ ఉపయోగం లేకుండా పోయిందట. ఈ మొత్తం ఎపిసోడ్లో కవిత మీద ఇంకా గులాబీ దళపతికి కోపం తగ్గలేదా.. ఆమె స్నేహ హస్తం చాచినప్పటికీ గులాబీ సుప్రీం తగ్గడం లేదా… ఇవే ప్రశ్నలు ఇప్పుడు ఎదురవుతున్నాయి. ఈ ప్రశ్నలకు కాలం గడిస్తే తప్ప సమాధానాలు సాధ్యం కావు.
Also Read: కల్వకుంట్ల కవిత హెచ్చరిస్తోంది.. రేవంత్ ప్రభుత్వం ఇకనైనా మారుతుందా..
కల్వకుంట్ల కవిత తన జాగృతిని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే కమిటీలను నియమించారు. జాగృతి ఆధ్వర్యంలో విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సామాజిక మాధ్యమ ఖాతాలలో కవిత యాక్టివ్ గా ఉంటున్నారు. ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. ఇదే సమయంలో తన పొలిటికల్ అడుగులకు బ్రేక్ వేస్తున్న సొంత పార్టీ నాయకులను కూడా వదిలిపెట్టడం లేదు. మొత్తంగా తెలంగాణ రాజకీయాలలో కవిత ఒక ఫైర్ బ్రాండ్ గా అవతరించారు.