Visakhapatnam Tech Hub: కూటమి ప్రభుత్వంలో విశాఖ ( Visakhapatnam) స్వరూపమే మారిపోతుంది. పెద్ద ఎత్తున పరిశ్రమలు తరలివస్తున్నాయి. విశాఖ ఐటీ హబ్ గా మారుతోంది. రేపే గూగుల్ డేటా సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన జరగనుంది. అయితే గతంలో ఇదే విశాఖను పాలన రాజధానిగా ప్రకటించారు జగన్మోహన్ రెడ్డి. అయితే రాజధాని చేయలేకపోయారు కానీ. అందుకు తగ్గ సన్నాహాలు చేశారు. రాజధాని అంటేనే ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. కానీ దానిని విశాఖ ప్రజలు విశ్వసించలేదు. ఉత్తరాంధ్ర ప్రజలు ఆహ్వానించలేదు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం పెట్టుబడులు తెస్తుండడం.. విశాఖ ఐటీ హబ్ గా మారుతుండడాన్ని మాత్రం ఆహ్వానిస్తున్నారు. రాజకీయంగా గుర్తింపు వద్దు.. పెట్టుబడులే ముద్దు అన్నట్టు విశాఖ ప్రజలు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. అయితే రేపటి నుంచి విశాఖ ప్రపంచ చిత్రపటంలోనే ప్రత్యేక గుర్తింపు సాధించనుంది. ఇప్పటివరకు పర్యాటకం గానే గుర్తింపు సాధించింది విశాఖ నగరం. ఇకనుంచి పెట్టుబడులతో పాటు ఐటీ హబ్ గా దేశంలో తనకంటూ ఒక ముద్ర చాటుకోనుంది.
* చంద్రబాబు దర్శనీకత..
ఏపీ సీఎం చంద్రబాబుకు( AP CM Chandrababu) ఒక ప్రత్యేకమైన ముద్ర ఉంది. ముందుచూపుతో వ్యవహరిస్తారని ఆయనకు మంచి పేరు ఉంది. ఇప్పుడు విశాఖ విషయంలో ఆయన కృషిని గుర్తించాల్సిన అవసరం ఉంది. టెక్ దిగ్గజం గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుతో ఏపీలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభం కానుంది. విశాఖ నగరం అంతర్జాతీయ టెక్ మ్యాప్ లో చేరనుంది. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుతో దేశ టెక్నాలజీ రంగంలో విశాఖ ఒక సరికొత్త ఆవిష్కరణకు వేదిక కానుంది. ఆసియా ఖండానికి ఓ కీలకమైన ఏఐ గేట్ వేగా విశాఖ అవతరించనుంది. ఇది నిజంగా గొప్ప పరిణామం కూడా.
* అతిపెద్ద విదేశీ పెట్టుబడి..
ఏఐ గూగుల్ డేటా సెంటర్( AI Google data centre ) అనేది దేశంలోనే అతిపెద్ద పెట్టుబడి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిగా రికార్డ్ సృష్టించింది. 1 గిగా వాట్ సామర్థ్యం తో కూడిన ఏఐ డేటా సెంటర్ ను ఏర్పాటు చేస్తోంది గూగుల్. పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించేందుకు సీఎం చంద్రబాబు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానం అమలు చేస్తుండడంతో గూగుల్ డేటా సెంటర్ సాకారం కానుంది.. దీనితో విదేశాలకు నేరుగా టెక్నాలజీ అనుసంధానం కానుంది. గూగుల్ డేటా సెంటర్ ద్వారా భారీగా డేటా స్టోరేజీ తో పాటు ఏఐ క్లౌడ్ ఇన్ఫ్రా అందుబాటులోకి రానుంది. రేపే ఈ సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన జరగనుంది. విశాఖ వైపు ప్రపంచమే చూసేలా సరికొత్త ఆవిష్కృతం రేపు జరగనుంది. వేలాదిమందికి ఉద్యోగాల కల్పన కూడా ప్రారంభం కానుంది. ప్రధానంగా ఫైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ ఆపరేషన్, మెయింటినెన్స్, క్లౌడ్ ఆర్కిటెక్చర్, డేటా సైంటిస్ట్ వంటి రంగాల్లో యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగు పడనున్నాయి.
