spot_img
Homeహెల్త్‌Elaichi Tea: ఇలాచీ టీ వల్ల ఇన్ని ప్రయోజనాలా..ఇన్నాళ్లు తెలియలేదే..

Elaichi Tea: ఇలాచీ టీ వల్ల ఇన్ని ప్రయోజనాలా..ఇన్నాళ్లు తెలియలేదే..

Elaichi Tea: ఉదయం లేవగానే టీ తాగనిదే రోజూ ప్రారంభం కాదు. అయితే కొందరు రకరకాల టీ లను సేవించడంలో ఇష్టపడుతుంటారు. ఇలాంటి సమయంలో ఇలాచీ టీ గురించి ఆసక్తిగా చర్చ సాగుతోంది. ఇలాచీ టీ కేవలం రుచిగా ఉండడమే కాకుండా ఆరోగ్య పరంగా కూడా ఎంతో మేలు చేసే పానీయం అని కొందరు ఆరోగ్య నిపుణులు అంటున్నారు. సాధారణ టీకి యాలకులు కలిపితే అది మరింత సువాసనతో పాటు శరీరానికి ఉపయోగకరమైన గుణాలను అందిస్తుంది. యాలకుల్లో సహజసిద్ధమైన పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వల్ల రోజూ మితంగా తీసుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. అంతేకాకుండా కొన్ని దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా ఉపశమనం లభించే అవకాశాలు ఉన్నాయి. అవేంటంటే?

రక్తపోటు:
యాలకుల టీ రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం వంటి మూలకాలు రక్తనాళాలను రిలాక్స్ చేసి బీపీ స్థాయిలను సమతుల్యం చేస్తాయి. క్రమంగా తీసుకోవడం వల్ల హృదయ ఆరోగ్యం కూడా మెరుగుపడే అవకాశం ఉంటుంది.

జీర్ణక్రియ:
ప్రస్తుత కాలంలో రకరకాల ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల జీర్ణక్రియ సమస్యలతో బాధపడేవారి సంఖ్య ఎక్కువవుతోంది. ఈ సమస్య నివారణకు యాలకుల టీ చాలా ఉపయోగపడుతుంది. గ్యాస్, ఎసిడిటీ, ఉబ్బరం వంటి సమస్యలతో బాధపడేవారికి ఇది మంచి ఔషధంలా పనిచేస్తుంది . యాలకులు జీర్ణ ఎంజైమ్‌లను ఉత్తేజపరచి ఆహారం సులభంగా జీర్ణమయ్యేలా చేస్తాయి. భోజనం తర్వాత ఒక కప్పు ఇలాచీ టీ తీసుకుంటే కడుపు హాయిగా ఉంటుంది.

మెటబాలిజం:
మెటబాలిజాన్ని పెంచడంలో కూడా ఈ టీ సహాయపడుతుంది. శరీరంలో కాలరీలు వేగంగా ఖర్చయ్యేలా చేయడంతో వెయిట్ లాస్‌కు మద్దతు ఇస్తుంది. అయితే ఇది ఒంటరిగానే బరువు తగ్గించదు. దీనితో పాటు సరైన డైట్, వ్యాయామంతో కలిపి తీసుకుంటే మంచి ఫలితాలు కనిపిస్తాయి.

శ్వాసకోస సమస్యలు:
జలుబు, దగ్గు వంటి శ్వాసకోశ సమస్యలను తగ్గించడంలో యాలకుల టీ చాలా ఉపయోగకరం. యాలకుల్లో ఉండే యాంటీబాక్టీరియల్ గుణాలు గొంతును శుభ్రపరచి శ్వాసనాళాల్లో ఉన్న ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో సహాయపడతాయి. చల్లని వాతావరణంలో వేడి వేడి యాలకుల టీ తీసుకోవడం వల్ల తక్షణ ఉపశమనం లభిస్తుంది.

నోటి దుర్వాసన:
నోటి దుర్వాసన సమస్యతో బాధపడేవారికి కూడా ఇది మంచి పరిష్కారం. యాలకుల సహజ సువాసన నోటి లోపలి బ్యాక్టీరియాను తగ్గించి శ్వాసను తాజాగా ఉంచుతుంది. అందుకే చాలా మంది భోజనం తర్వాత యాలకులు నమిలే అలవాటు కూడా పాటిస్తారు.

మానసిక ఆరోగ్యానికి కూడా యాలకుల టీ ప్రయోజనకరమే. దీని సువాసన, రుచి మనసును ప్రశాంతంగా ఉంచి స్ట్రెస్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. రోజు మొత్తం పని ఒత్తిడిలో ఉన్నవారికి ఇది మంచి రిలాక్సింగ్ డ్రింక్‌గా పనిచేస్తుంది. ఇలాచీ టీ మన దైనందిన జీవితంలో సులభంగా చేరదీయగల ఆరోగ్యకరమైన పానీయం. అయితే ఏదైనా మితిమీరకుండా తీసుకోవడం ముఖ్యం. రోజుకు ఒకటి లేదా రెండు కప్పులు తీసుకుంటే సరిపోతుంది. సరైన జీవనశైలితో కలిపి దీన్ని తీసుకుంటే శరీరం, మనసు రెండూ హెల్తీగా ఉంటాయి.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version