West Godavari : మీరేం మనుషుల్రా బాబూ.. చివరికి గేదెను కూడా వదలరా.. పశ్చిమగోదావరి జిల్లాలో దారుణం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం మండలం తోకలపూడి గ్రామానికి చెందిన సీతారామయ్యకు కొన్ని గేదెలున్నాయి. అతడికి కొంత పొలం కూడా ఉంది.. ఆ పొలాన్ని సాగు చేసుకుంటూ, గేదెలను సాకుతూ అతడు జీవన సాగిస్తున్నాడు. మంగళవారం తన గేదెలను దొడ్లో కట్టేశాడు. అందులో ఒక గేదె యదకు వచ్చింది

Written By: Bhaskar, Updated On : July 17, 2024 3:16 pm
Follow us on

West Godavari :  ఇటీవల నంద్యాలలో ఓ మైనర్ ను ముగ్గురు బాలురు గ్యాంగ్ రేప్ చేశారు. ఆ తర్వాత ఆ బాలిక మృతదేహాన్ని ఓ నదిలో పడేశారు. ఈ సంఘటన ఏపీలోనే కాదు, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటన మరొక ముందే మరో ప్రాంతంలో ఏడు నెలల పసికందుపై.. ఓ వృద్ధుడు అత్యాచారం చేయడం కలకలం రేపింది. ఈ రెండు ఘటనల్లో నిందితులపై పోలీసులు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి.. రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించారు. నంద్యాల జిల్లాలో జరిగిన ఘటనలో నిందితులను జువైనల్ హోమ్ కు తరలించారు. ఏపీలో రోజుల వ్యవధిలో జరిగిన ఈ సంఘటనలు సంచలనం సృష్టించాయి. మనుషుల్లో రోజురోజుకు పెడుతున్న రాక్షస ప్రవృత్తిని బయటపెట్టాయి. ఈ ఘటనలు మరవకముందే.. ఏపీలో మరో దారుణం చోటుచేసుకుంది.

ఇంతకీ ఏం జరిగిందంటే..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం మండలం తోకలపూడి గ్రామానికి చెందిన సీతారామయ్యకు కొన్ని గేదెలున్నాయి. అతడికి కొంత పొలం కూడా ఉంది.. ఆ పొలాన్ని సాగు చేసుకుంటూ, గేదెలను సాకుతూ అతడు జీవన సాగిస్తున్నాడు. మంగళవారం తన గేదెలను దొడ్లో కట్టేశాడు. అందులో ఒక గేదె యదకు వచ్చింది. అయితే ఆ గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు మద్యం తాగి వచ్చి.. తాగిన మైకంలో.. ఆ గేదె కాళ్లను కట్టేశారు. మద్యం తాగిన వ్యక్తులు రేప్ చేశారు. దీంతో ఆ గేదె మర్మాంగం నుంచి తీవ్రంగా రక్తస్రావం కావడంతో.. సీతారామయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని.. తీవ్రంగా గాయపడిన గేదెను పరిశీలించారు.. అనంతరం ఆ గేదె మర్మాంగం నుంచి వీర్య నమూనాలు సేకరించారు. ప్రయోగశాలకు పంపారు.

చర్చనీయాంశం

ఈ విషయం దావానం లాగా వ్యాపించడంతో చర్చనీయాంశంగా మారింది. అయితే ఆ వ్యక్తులను గుర్తించేందుకు పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. అయితే తోకలపూడిలో ఎక్కువగా సీసీ కెమెరాలు లేకపోవడంతో కేసు దర్యాప్తు లో పురోగతి లభించడం లేదు. అయితే ఈ ఘాతుకానికి పాల్పడింది స్థానికులా? ఇతర ప్రాంతాలకు చెందిన వ్యక్తులా? అనేది తెలియ రావడం లేదు.. దీనిపై మరింత స్పష్టత కోసం పోలీసులు విస్తృతంగా దర్యాప్తు చేస్తున్నారు. అనుమానితులను పిలిపించి వివరాలు తెలుసుకుంటున్నారు.

గతంలోనూ..

గతంలోనూ ఈ ప్రాంతంలో ఇదే తరహా సంఘటన జరిగింది. అప్పుడు పోలీసులు వేగంగా దర్యాప్తు చేయడంతో స్థానికంగా ఉన్న ఓ వ్యక్తి ఆ దారుణానికి పాల్పడ్డాడని తేలింది. దీంతో పోలీసులు అతడి పై కేసు నమోదు చేసి కోర్టుకు రిమాండ్ కు తరలించారు. ప్రస్తుతం అతడు శిక్ష అనుభవిస్తున్నాడు. అయితే ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ముమ్మరంగా విచారణ సాగిస్తున్నారు. నిందితులను త్వరలో పట్టుకుంటామని చెబుతున్నారు.. అయితే పోలీసుల విచారణలో తోకలపూడి కి పక్క గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు ఈ ఘాతుకానికి పాల్పడినట్టు తెలిసింది. ఆ విషయాన్ని పోలీసులు అత్యంత గోప్యంగా ఉంచుతున్నారు. అయితే ఆ వ్యక్తులు గతంలో పలు కేసుల్లో పోలీస్ స్టేషన్ కు వెళ్లి వచ్చినట్టు తెలుస్తోంది. దొంగతనాలు, హింసాత్మక ఘటనలకు పాల్పడిన నేపథ్యంలో.. వారిపై కేసులు నమోదైనట్టు తెలుస్తోంది. అయితే వారే ఈ దారుణానికి పాల్పడ్డారని చుట్టుపక్కల వారు కూడా చెబుతున్నారు. అందువల్లే పోలీసులు వారి కదలికలపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్టు తెలుస్తోంది. త్వరలోనే వారిని అరెస్టు చేసి.. వారిదైన శైలిలో విచారించి పూర్తి నిజాలను రాబట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.