Homeవింతలు-విశేషాలుMansa Musa: మస్క్‌ను మించిన తోపు అతనే.. ప్రపంచంలో అంతటి కుబేరుడు లేడు.. ఎవరో తెలుసా?

Mansa Musa: మస్క్‌ను మించిన తోపు అతనే.. ప్రపంచంలో అంతటి కుబేరుడు లేడు.. ఎవరో తెలుసా?

Mansa Musa: అతను ఒక రాజు.. కాదు కాదు.. మహా చక్రవర్తి.. అంతే కాదు మహా బలుడు. ఇంకా చెప్పాలంటే.. ఆయన సంపదను ఇప్పుడు లెక్కిస్తే 400 మిలియన్‌ డాలర్లు. అంటే ప్రస్తుతం ప్రపంచ కుబేరుడిగా ఉన్న ఎలాన్‌ మస్క్‌ సంపదకన్నా రెండు రెట్లు ఎక్కువ అతనివద్దే ఉంది. ఇప్పటి వరకు మానవ చరిత్రలో ఇంత సంపద కలిగి ఉన్న మరో వ్యక్తి లేరు. అంతటి సంపద ఉన్న కుబేరులకే కుబేరుడు ఎవరు.. అంత సంపద అతనికి ఎలా వచ్చింది.. ఆయన ఏం చేసేవాడు.. తదితర వివరాలు తెలుసుకుందాం.

మాలి సామ్రాజ్యాధినేత..
ఆఫ్రికాలోని ప్రస్తుత మాలి, సెనెగల్, గాంబియా, గినియా, నైగర్, నైజీరియా, చాద్, మారిటేనియా తదితర దేశాలతో కూడిన విశాల సామ్రాజ్యాన్ని పాలించేవాడు మన్సా మూసా. దీనిని ’మాలి’ విశాల సామ్రాజ్యం అని పిలిచేవారు. ప్రస్తుతం ఉన్న మాలిలోని టింబుక్టు నిర్మించింది ఆయనే. దీని కోసం పశ్చిమాసియా, ఆఫ్రికా ఖండం నలుమూలల నుంచి వేల మంది నిపుణులైన పనివాళ్లను రప్పించారు. మూసా క్రీస్తు శకం 1312 నుంచి 1337 వరకు పాలన సాగించారు. ఆయన పాలనలో మాలి ఖ్యాతి విశ్వవ్యాప్తమైంది.

బంగారమే సంపద
మూసా సామ్రాజ్యంలో బంగారం, ఉక్కు గనులు ఎక్కువగా ఉండేవి. ప్రత్యేకించి బంగారు గనులు ఎక్కువగా ఉండడంతో బంగారం వేల టన్నుల్లో మూసా ఖజానాలో ఉండేది. బంగారం, ఉక్కును ఇతర దేశాలకు ఎగుమతి చేయడంతో భారీగా సంపద మాలి సామ్రాజ్యానికి వచ్చేది. ఇప్పటికీ బంగారం గనులు ఆఫ్రికాలో ఉన్నాయి. ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే బంగారంలో ప్రస్తుతం 20 శాతం ఆఫ్రికా దేశాల నుంచే జరుగుతోంది. అందుకు గల్ఫ్‌ దేశాల్లో బంగారం విలువ తక్కువగా ఉంటుంది.

లక్షమందితో హజ్‌ యాత్ర!
ఇక మూసా ‘హజ్‌ యాత్ర’కు బయలుదేరినప్పుడు.. మార్గమధ్యంలో ఈజిప్టులో ఆగి ఆ దేశ పాలకుడికి భారీగా బంగారాన్ని బహుమతిగా ఇచ్చాడు. ఫలితంగా ఆ దేశంలో బంగారం విలువ పడిపోయింది. అంటే అంత విరివిగా ఈజిప్టులో ప్రజల వద్దకు చేరిందని అర్థం. ఇక మూసా హజ్‌ యాత్రకు దాదాపు లక్షమంది పరివారంతో బయలుదేరినట్టు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. ప్రపంచంలోనే ఇంత ఖరీదైన యాత్ర ఇప్పటివరకు లేదు.

అభివృద్ధికి ప్రాధాన్యం..
ఇక మూసా హజ్‌ యాత్ర నుంచి వచ్చిన అనంతరం టింబక్టు నగరంతోపాటు పలు ప్రాంతాలను అభివృద్ధి చేశారు. ఆ కాలంలో మాలిలోని పలు ప్రాంతాలు విద్యాకేంద్రాలుగా ఉండేవి. సుదూర తీరాల నుంచి వేలాది మంది విద్యార్థులు వచ్చి విద్యాభ్యాసం చేసేవారు. అనంతర కాలంలో మూసా అనేక ప్రజోపయోగ కార్యక్రమాలు చేపట్టారు. కేవలం అంతులేని ఐశ్వర్యానికి చిహ్నంగానే కాకుండా విద్యాభివృద్ధికి, శాస్త్ర సాంకేతిక పరిశోధనలకు కృషిచేశారు. మూసా 1337లో కన్నుమూశారు. అనంతరం వచ్చిన పాలకులు అసమర్థులు కావడంతో మూసా నిర్మించిన మహాసామ్రాజ్యం విచ్ఛిన్నమైంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version