Vijayasai Reddy Padayatra: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీకి గుడ్ బై చెప్పారు విజయసాయిరెడ్డి. ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ పదవిని సైతం వదులుకున్నారు. ఇకనుంచి వ్యవసాయం చేసుకుంటానని చెప్పారు. ఏ రాజకీయ పార్టీలో చేరడానికి కూడా తేల్చి చెప్పారు. అయితే ఆయన ఏం వ్యవసాయం చేశారో తెలియదు కానీ.. తనకు రాజకీయాలంటే ఆసక్తి తగ్గలేదని సంకేతాలు ఇచ్చారు. త్వరలో పొలిటికల్ రీఎంట్రీ ఉంటుందని ప్రకటించారు. బిజెపిలో చేరుతారని ఒకసారి.. తిరిగి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిపోతారని మరోసారి.. సొంతంగా పార్టీని ఏర్పాటు చేస్తారని ఇంకోసారి.. ఇలా రకరకాల ప్రచారం జరుగుతూనే ఉంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే విజయసాయిరెడ్డి పాదయాత్ర చేస్తారని కొత్త ప్రారంభమైంది. జూన్ నుంచి ఆయన పాదయాత్ర మొదలు పెడతారని ప్రచారం జరుగుతోంది. పాదయాత్ర చేసిన తర్వాత తన రాజకీయ వైఖరిని వెల్లడిస్తారని కొత్త టాక్ నడుస్తోంది. పొలిటికల్ వర్గాల్లో ఇది ఆసక్తికర చర్చగా మారింది.
* వైయస్ కుటుంబానికి విధేయుడు..
వైయస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి అత్యంత విధేయుడుగా ఉన్నారు విజయసాయిరెడ్డి( Vijaya Sai Reddy). కుటుంబ ఆడిటర్ గా ఉంటూ జగన్మోహన్ రెడ్డికి దగ్గరయ్యారు. ఆయనతో పాటు జైలు జీవితం అనుభవించారు. జగన్మోహన్ రెడ్డి అవినీతి కేసుల్లో సహ నిందితుడుగా కూడా ఉన్నారు. ఆయనతో పార్టీ ఏర్పాటు చేయించి అధికారంలోకి వచ్చేందుకు సర్వశక్తులు వడ్డారు. అయితే వైసీపీ హయాంలో తాను చేసిన పనికి తగిన ప్రతిఫలం రాలేదని.. అంతా కోటరి సిఫారసులకి పెద్దపీట వేశారని.. ఇప్పుడు కూడా తన మాట చెల్లుబాటు కావడం లేదని చెప్పి ఆయన పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయారు. ఇటీవల విపరీతంగా వ్యాఖ్యానాలు చేస్తున్నారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా. నేరుగా వైసీపీ నేతలకు ఫోన్ చేసి పార్టీ పెడుతున్నానని ఆహ్వానిస్తున్నారు. దీంతో ఆయన పార్టీ పెడతారని ప్రచారం మొదలైంది.
* మద్యం కుంభకోణం పై సంచలనం..
మద్యం కుంభకోణం( likhkar scam ) కేసులో ఇప్పటికే ఆయనను సిఐడి విచారించింది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఈడీ సైతం విచారణ చేపట్టింది. అయితే మద్యం కుంభకోణంలో తన పాత్ర లేదని చెప్పడం ద్వారా తాను నిర్దోషినని చెబుతున్నారు విజయ్ సాయి రెడ్డి. ఒకసారి జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా ఇదంతా జరగదని అభిప్రాయపడుతున్నారు. మరోసారి ఆయనకు ఈ విషయం తెలియదు అంటున్నారు. జగన్ చుట్టూ ఉన్న కోటరి వల్లే ఇదంతా జరిగిందని చెప్పుకొస్తున్నారు. అయితే జగన్ మాత్రం విపక్ష నేతలతో చేతులు కలిపారని విజయసాయిరెడ్డి పై మీడియా ముఖంగా వ్యాఖ్యానాలు చేశారు. తద్వారా విజయసాయి రెడ్డికి వైసీపీలోకి ఎంట్రీ లేదని తెలియజేశారు. మరోవైపు బిజెపిలో చేరుతారన్న ప్రచారానికి టిడిపి నుంచి అభ్యంతరాలు వ్యక్తం అయినట్లు తెలుస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో బిజెపిలోకి ఎంట్రీ లేక.. సొంత పార్టీని ఏర్పాటు చేసుకోలేక విజయసాయిరెడ్డి సత్తపత్తమవుతున్నట్లు తెలుస్తోంది. అందుకే జూన్లో పాదయాత్ర చేయడం ద్వారా రాజకీయాల్లో పట్టు సాధించాలని గట్టి ప్రయత్నంలో ఉన్నట్లు సమాచారం. మరి అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.