Vijayasai Reddy :  ఇలా పేర్లు మార్చడం ఏంటి… విజయసాయిరెడ్డి బాధ అంతా ఇంతా కాదు..

దేశంలోనే వైసీపీ సోషల్ మీడియా అత్యంత పవర్ ఫుల్.పార్టీ ఆవిర్భావం నుంచే వైసీపీ సోషల్ మీడియా చాలా యాక్టివ్ గా పని చేస్తుంది. ప్రజలను వర్గ విభజన చేసి వైసిపి వైపు యు టర్న్ చేయడంలో వైసీపీ సోషల్ మీడియాది అందివేసిన చేయి.

Written By: Dharma, Updated On : August 21, 2024 12:15 pm

Vijayasai Reddy

Follow us on

Vijayasai Reddy : దొంగే దొంగ అన్నట్టుంది వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి వ్యవహార శైలి. మొన్న ఆ మధ్యన ఆయనపై వచ్చిన అభియోగం తో మైండ్ బ్లాక్ అయ్యింది. తేరుకోవడానికి చాలా సమయం పట్టింది. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఎపిసోడ్లో విజయసాయిరెడ్డి పేరు బయటకు వచ్చింది. అప్పట్లో మీడియాను పచ్చి బూతులు తిట్టారు. రామోజీరావు లాంటి వ్యక్తిని చీల్చి చెండాడానని.. మీరు అసలు మాకు లెక్క అన్నట్టు మాట్లాడారు. త్వరలో మీడియా ఛానల్ ప్రారంభిస్తానని.. అందరి లెక్క తేల్చుతానని హెచ్చరించారు. కొద్దిరోజుల పాటు సైలెంట్ అయ్యారు. ఇప్పుడు తెరపైకి వచ్చి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని కుల ప్రస్తావన తీసుకొచ్చారు. రెడ్డి, గౌడ, నాయుడుల పేరుతోసోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారని.. అసలు పేర్లతో కాకుండా.. కులాలు మార్చి సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు అంటూ టిడిపి పై నిందలు వేసే ప్రయత్నం చేస్తున్నారు. అలా పోస్టులు పెడుతున్న వారంతా కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారేనని చెబుతూ.. మిగతా సామాజిక వర్గాల బలం వైసీపీకి మాత్రమే ఉందని.. అందుకే ఆ కులాలకు సంబంధించి పేర్లతో సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు అన్నది విజయసాయిరెడ్డి వాదన. వైసీపీ సోషల్ మీడియా అసలు ఫేక్ అనేదే ఉండదని పరోక్షంగా చెప్పుకొస్తున్నారు.

* ప్రత్యర్థులను వెంటాడింది మీరు కాదా
ఇంతకుముందు వైసీపీ సోషల్ మీడియా హ్యాండిల్ చేసిన సజ్జల భార్గవరెడ్డి సైతం ఇదే మాదిరిగా చెప్పుకొచ్చారు. మహిళల పట్ల అశ్లీలత, దుష్ప్రచారం వంటివి వైసిపి సోషల్ మీడియా చేయదని భార్గవ రెడ్డి మీడియాలో ప్రకటించారు. అయితే గతంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కుటుంబాలపై సైతం దుష్ప్రచారం చేసింది వైసీపీ సోషల్ మీడియా అన్న విషయాన్ని గ్రహించుకోలేకపోయారు. ఇప్పుడు అదే మాదిరిగా విజయసాయిరెడ్డి కూడా వేదాలు వల్లిస్తున్నారు.

* అత్యంత పవర్ ఫుల్
దేశంలో రాజకీయ పార్టీలకు సోషల్ మీడియా వెన్నుదన్నుగా ఉన్న పార్టీల్లో వైసిపి ఒకటి. పార్టీ కార్యవర్గాల కంటే వైసీపీలో సోషల్ మీడియా కి అత్యంత ప్రాధాన్యం దక్కుతుంది. గతంలో సోషల్ మీడియా బాధ్యత విజయసాయిరెడ్డి చూసేవారు. భారీగా వాలంటీర్లను భర్తీ చేసి నాడు టిడిపి ప్రభుత్వం పై దుష్ప్రచారం చేయడంలో ముందుండేవారు. గత ఐదేళ్ల వైసిపి పాలనలో సోషల్ మీడియా విభాగాన్ని శక్తివంతంగా తయారు చేశారు. చివరకు యువగళం పాదయాత్ర కోసం భారీగా రిక్రూట్మెంట్ సైతం చేశారు.

* అవన్నీ మరిచిపోతే ఎలా
ప్రజలను కులమతాలుగా విభజించి ప్రచారం చేయడంలో వైసిపి సోషల్ మీడియా ఎంత చెయ్యాలో అంత చేసింది. రాజకీయ ప్రత్యర్థులను వెంటాడింది. కుల ప్రచారానికి తెరతీసింది. కులాల మధ్య కుంపట్లు పెట్టింది. అవన్నీ మరిచిపోయి ఇప్పుడు విజయసాయిరెడ్డి.. సోషల్ మీడియాని తప్పుపడుతున్నారు. కులాల పేర్లు వాడుకొని సోషల్ మీడియాలో తమపై ప్రచారం చేస్తున్నారనిఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే విజయసాయి రెడ్డి వ్యవహార శైలి తెలిసినవారు.. దొంగే దొంగ అన్నట్టుంది అని వ్యాఖ్యానిస్తున్నారు.