Vijay TVK party expansion in AP: ఎవ్వరూ ఊహించని విధంగా , 5 దశాబ్దాల నుండి పాలిస్తున్న ద్రవిడ పార్టీల కంచుకోటలను బద్దలు బద్దలు కొట్టి, తమిళనాడు సూపర్ స్టార్ విజయ్ టీవీకే పార్టీ ఎలాంటి ఫలితాలను సొంతం చేసుకుందో మనమంతా చూస్తూనే ఉన్నాం. ఏకంగా 107 స్థానాల్లో ఘనవిజయం సాధించిన టీవీకే, రేపు లేదా ఎల్లుండి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేసే రోజు కోసం ఆయన అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 118 సీట్లు విజయ్ వద్ద లేకపోవడంతో , నేడు జరగాల్సిన ప్రమాణస్వీకార కార్యక్రమం రద్దు అయ్యింది. ప్రస్తుతం విజయ్ వద్ద 107 స్థానాలతో పాటు కాంగ్రెస్ పార్టీ కి సంబంధించిన 5 మంది ఎమ్మెల్యేలు, అదే విధంగా వీసీకే పార్టీ కి సంబంధించిన మరో ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. నేటి ఆయన వద్ద 114 సీట్లు ఉన్నాయి.
ఇక కేవలం 4 సీట్లు మాత్రమే అవసరం ఉంది. ప్రస్తుతం చర్చలు నడుస్తున్నాయి. త్వరలోనే ఈ చర్చలు ఒక కొలిక్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇదంతా పక్కన పెడితే, విజయ్ తన టీవీకే పార్టీ ని తెలుగు రాష్ట్రాల్లో కూడా విస్తరింపజేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. SC , ST వర్గాల్లో విజయ్ కి తెలుగు లో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. టీవీకే పార్టీ గెలవగానే మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని దళిత వాడల్లో టీవీకే బ్యానర్స్ కనిపించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిన విషయం. ఆయన ఆంధ్ర ప్రదేశ్ లోకి అడుగుపెడితే , ఇక్కడ షర్మిల సారథ్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ తో కలిసి నడుస్తాడు. అదే విధంగా తెలంగాణలో కూడా ప్రస్తుతం అధికారం లో ఉన్న కాంగ్రెస్ పార్టీ తో కలిసి ఆయన ఎన్నికలకు వెళ్లొచ్చు.
కేవలం తెలుగు రాష్ట్రాలతోనే విజయ్ సరిపెట్టేలా లేడు , కేరళ లో కూడా ఆయన తన పార్టీ ని విస్తరింపజేయాలని చూస్తున్నాడట. సౌత్ మొత్తం తన పార్టీ ని విస్తరింపజేసేసే ఆలోచనలో ఉన్నాడట. అందుకు తగ్గ ప్లానింగ్ , రూట్ మ్యాప్ అన్నీ సిద్ధం చేసుకున్నాడట విజయ్. ఒకవేళ విజయ్ ఆంధ్ర రాజకీయాల్లోకి అడుగుపెడితే , వైసీపీ పార్టీ ఓటు బ్యాంక్ కి గండి పడే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఎస్సీ , ఎస్టీ మైనారిటీలు దశాబ్ద కాలం నుండి జగన్ తో కొనసాగుతున్నారు. ఇప్పుడు విజయ్ వస్తే కచ్చితంగా ఆ ఓటు బ్యాంక్ చీలుతుంది. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.