KA Paul (1)
KA Paul: భారతదేశంలో బెట్టింగ్ యాప్స్(Betting aaps) ప్రమోషన్ వివాదం తీవ్ర రూపం దాల్చింది. విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, రానా దగ్గుబాటి, నిధి అగర్వాల్ వంటి 25 మంది సెలెబ్రిటీలపై తెలంగాణ సైబరాబాద్ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. మియాపూర్ పోలీస్(Miyapur Police)స్టేషన్‌లో ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు దాఖలైంది.
Also Read: యాక్షన్ లోకి సోము వీర్రాజు.. మైక్ కనిపిస్తే జగనే టార్గెట్!
తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వివాదంలో సెలబ్రిటీలకు ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే 25 మందిపై తెలంగాణ పోలీసులు(Telangana Police) కేసు నమోదు చేశారు. పలువురిని విచారణకు పిలిచారు. కానీ యాంకర్లు విష్ణుప్రియ(Vishnu Priya), రితూ చౌదరి(Rithu Choudari) మాత్రమే విచారణకు వచ్చారు. శ్యామల(Shyamala) కోర్టును ఆశ్రయించి తర్వాత మార్చి 24న విచారణకు హాజరయ్యారు. అయితే ఈ కేసులో చిన్న యాంకర్ల నుంచి పెద్ద హీరోల వరకు చాలా మంది ఉన్నారు. కానీ, సెలబ్రిటీలను విచారణకు పిలవడం లేదు. బాలకృష్ణ పేరు ఎక్స్‌లో ప్రస్తావించినా అధికారికంగా ఎఫ్‌ఐఆర్‌లో కనిపించలేదు. ఇక 25 మందిని అరెస్ట్ చేస్తారన్న దానిపై స్పష్టత లేదు.
కేఏ. పాల్ డెడ్‌లైన్
బెట్టింగ్ యాప్స్‌పై ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ.పాల్(KA. Poul) తీవ్రంగా స్పందించారు. ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన 25 మందిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అరెస్ట్ చేయకపోతే సుప్రీంకోర్టు(Supream Court)కు వెళతానని హెచ్చరించారు. 72 గంటల్లో సెలెబ్రిటీలు క్షమాపణ చెప్పి, బెట్టింగ్ యాప్స్ ద్వారా సంపాదించిన డబ్బును బాధిత కుటుంబాలకు పంచాలని డిమాండ్ చేశారు. ప్రకాశ్ రాజ్ గతంలో 2015లో ఒక యాప్‌ను ప్రమోట్ చేసినట్లు, తప్పు జరిగిందని క్షమాపణ చెప్పారు. విజయ్ దేవరకొండ, రానా వంటి వారు తాము చట్టబద్ధమైన స్కిల్–బేస్డ్ గేమ్‌లను మాత్రమే ప్రమోట్ చేశామని, అవి గ్యాంబ్లింగ్ కాదని సుప్రీంకోర్టు గుర్తించిన వాదనలను సమర్థించారు.
సెలబ్రిటీల సంబంధంపై రచ్చ..
ఈ వివాదం బెట్టింగ్ యాప్స్‌తో సెలెబ్రిటీల సంబంధంపై పెద్ద చర్చను రేకెత్తించింది. పోలీసుల దర్యాప్తు సెలెబ్రిటీలు ప్రమోట్ చేసిన యాప్స్ చట్టవిరుద్ధ గ్యాంబ్లింగ్‌కు సంబంధించినవా లేదా స్కిల్–ఆధారిత గేమ్‌లకు సంబంధించినవా అనే దానిపై దష్టి సారించింది. ఈ కేసులో తదుపరి చర్యలు పోలీసులు, న్యాయస్థానాల నిర్ణయాలపై ఆధారపడి ఉన్నాయి. సామాజిక మాధ్యమాల్లో ఈ అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది, కానీ అరెస్ట్‌లు జరుగుతాయా లేదా అనేది ఇంకా అనిశ్చితంగానే ఉంది.