Zodiac signs : ప్రతి ఆరు నెలలకు ఒకసారి గ్రహాలు తమ స్థానాన్ని మార్చుకుంటూ ఉంటాయి. గ్రహాల మార్పు వల్ల కొన్ని రాశులపై ప్రభావం పడి ఆయా రాశులు కలిగిన జీవితాల్లో ఊహించని మార్పులు ఉంటాయి. అయితే వేద శాస్త్రం ప్రకారం ఒక్కోసారి మూడు గ్రహాల కలయిక ఉంటుంది. గ్రహాలన్నింటిలో శుక్రుడుని చల్లని వాడిగా చూస్తారు. శుక్ర గ్రహం సంపదకు నిలయంగా భావిస్తారు. ఈ గ్రహం ఒక రాశిలో ప్రయాణిస్తే మరికొన్ని రాశులపై ప్రభావం పడుతుంది. అయితే ప్రస్తుతం మీనరాశిలో శుక్రుడు సంచరిస్తున్నాడు. దీంతో కొన్ని రాశుల వారికి ఊహించని అదృష్టాన్ని తీసుకొస్తున్నాడు. ముఖ్యంగా శుక్ర గ్రహం సంచారం వల్ల మూడు రాశుల వారికి సంపదలు పెరిగిపోయే అవకాశం ఉంది. అంతేకాకుండా వీరు ఏ పని చేపట్టిన విజయవంతంగా పూర్తిచేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటారు. ఇంతకీ ఆ మూడు రాశులు ఏవో తెలుసుకుందాం..
మీన రాశిలోకి శుక్రుడు ప్రవేశించడం వల్ల కర్కాటక రాశిపై ప్రభావం పడుతుంది. మీన రాశిలో శుక్రుడు రాహుతో సంయోగం చెందుతాడు. దీంతో ఈ రాశి వారికి అన్నీ శుభ ఫలితాలే ఉంటాయి. వ్యాపారం చేసే వారు కొత్త ప్రాజెక్టులను చేపడుతారు. ఊహించని లాభాలు ఉంటాయి. జీవిత భాగస్వామితో వ్యాపారం చేసే వారికి శుభ ఫలితాలు కలుగుతాయి. ఉద్యోగులు పదోన్నతిని పొందుతారు. వీరికి జీతం కూడా పెరుగుతుంది. మొత్తంగా శుక్రుడు మీన రాశిలో సంచరించిన సమయంలో ఈ రాశి వారికి అదృష్టం ఉంటుంది.
శుక్రుడి సంచారం వల్ల మిధున రాశిపై కూడా ప్రభావం పడుతుంది. మిధున రాశి వారి సంపద పెరుగుతుంది. ఉద్యోగులు లక్ష్యాలను పూర్తి చేయడంతో అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. ప్రభుత్వ ఉద్యోగులు అయితే పదోన్నతులు పొందుతారు. రాజకీయాల్లో ఉండే వారికి ఇదే అనుకూల సమయం. వీరికి ఊహించని పదవులు దక్కుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటే విజయం సాధిస్తారు. గతంలో ఉన్న పనులను పూర్తిచేస్తారు. అనారోగ్యంతో బాధపడే వారికి ఈ సమయంతో కుదుటపడతారు.
శుక్రుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు. ఈ సమయంలో సొంత రాశిపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది. అయితే ఈ రాశి వారికి ఊహించని విధంగా ధన లాభం ఉంటుంది. ఏ పని చేపట్టిన విజయవంతంగా పూర్తి చేస్తారు. అనుకోని ప్రయాణాలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా ఉంటారు. పాత స్నేహితులతో కలిసి షికార్లు కొడతారు. వ్యాపారులో కొత్త ప్రాజెక్టును చేపట్టడంతో ధనలాభం అధికంగా ఉంటుంది. పెండింగ్ బకాయిలు వసూలు అవుతాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. విదేశాల్లో ఉండేవారి నుంచి శుభవార్తలు వింటారు. బంధువుల నుంచి ధన సహాయమందుతుంది.
ఈ మూడు రాశులు మాత్రమే కాకుండా మిగతా రాశులపై శుక్రుడి ప్రభావం స్వల్పంగా ఉంటుంది. అయితే కొన్ని కొన్ని రాశుల వారు తమ కార్యకలాపాలలో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారులు నగదు వ్యవహారాలు జరిపేటప్పుడు పెద్దల సలహా తీసుకోవడం మంచిది. ఉద్యోగులు సీనియర్లతో సంయమనం పాటించాలి. ఎటువంటి వాదనలకు దిగినా నష్టమే చేకూరుతుంది. అందువల్ల ఆచితూచి వ్యవహరించాలి.