Raghurama Krishnam Raju vs venigandla Ramu : రఘురామకృష్ణంరాజు( Raghurama Krishnam Raju ) సంచలనాలకు వేదిక అవుతున్నారు. ఆయన కస్టోడియల్ టార్చర్ కేసు రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. అటు తిరిగి ఇటు తిరిగి తెలుగుదేశం పార్టీలోనే ప్రకంపనలు రేపుతోంది. వైసిపి ప్రభుత్వ హయాంలో ఎంపీగా ఉన్న రఘురామకృష్ణం రాజును సిఐడి అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో విచారణ పేరిట ఆయనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించినట్లు ప్రచారం నడిచింది. తన శరీరంపై గాయాలు చూపుతూ అప్పట్లో రఘురామకృష్ణంరాజు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో సిఐడి పోలీసులు ఆయనను విడిచి పెట్టాల్సి వచ్చింది. అయితే ఆయన టిడిపిలో చేరి ఉండి ఎమ్మెల్యేగా గెలిచారు. కూటమి అధికారంలోకి వచ్చింది. దీంతో మరోసారి తన కస్టోడియల్ టార్చర్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు రఘురామకృష్ణంరాజు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. అప్పటి సిఐడి చీఫ్ సునీల్ కుమార్, డీఎస్పీ విజయ్ పాల్, ప్రైవేటు వ్యక్తి తులసి బాబును అరెస్టు చేశారు. ఇంతవరకు ఓకే కానీ… ఇప్పుడు ఈ అంశం తెలుగుదేశం పార్టీలోనే ఒక రకమైన గందరగోళం సృష్టించింది.
* సంచలన విజయం
ఈ ఎన్నికల్లో గుడివాడ( Gudivada ) నుంచి సంచలన విజయాన్ని నమోదు చేసుకున్నారు వెనిగండ్ల రాము. రాష్ట్రం మొత్తం టిడిపి వర్గాలను ఎంతో ఆశించారు. టిడిపి శ్రేణులు ఆయనను ఒక హీరోగా చూస్తాయి. ఎందుకంటే టిడిపి శ్రేణులు ద్వేషించే కొడాలి నానిని ఓడించడంతో అంతటి గుర్తింపు పొందారు ఆయన. అయితే ఇప్పుడు అదే వెనిగండ్ల రాము టిడిపి శ్రేణులకు మింగుడు పడని నేతగా మారిపోయారు. అప్పట్లో రఘురామకృష్ణం రాజు పై దాడి చేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్న తులసి బాబును వెనుకేసుకు రావడం పై పార్టీలో ఆయనపై ఆగ్రహాలు పెరుగుతున్నాయి.
* గుడివాడ ఎమ్మెల్యేకు సన్నిహితుడు
తులసి బాబు అనే వ్యక్తి వెనిగండ్ల రాముకు( venigandla Ramu ) ప్రధాన అనుచరుడుగా కొనసాగుతున్నారు. అయితే అంతకంటే ముందే ఆయన వైసీపీ నేతలతో సన్నిహితంగా మెలిగారన్న ఆరోపణలు ఉన్నాయి. అప్పటి సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ కు అత్యంత సన్నిహితుడు కూడా. అప్పట్లో రఘురామకృష్ణంరాజు కేసులో ఆయనను బెదిరించేందుకుగాను తులసి బాబు సేవలను వినియోగించుకున్నారట. విచారణ పేరిట రఘురామకృష్ణంరాజు గుండెపై తులసి బాబును కూర్చోబెట్టారట. అందుకే ఇప్పుడు రఘురామకృష్ణంరాజు తులసి బాబు పేరును బయటపెట్టారు. ఆయనను సైతం అరెస్టు చేయాలని ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే వెనిగండ్ల రాము వందలాది వాహనాలతో పోలీస్ స్టేషన్ కు వెళ్లి తులసి బాబుకు మద్దతు తెలపడం, పరామర్శించడం టిడిపిలో విభేదాలకు ఆస్కారం ఏర్పడింది. తులసి బాబు వైసీపీ సన్నిహితుడని తెలుసుకున్నాక వెనిగండ్ల రాము దూరం పెట్టక పోవడాన్ని ఎక్కువమంది తప్పు పడుతున్నారు.
* టిడిపిలో గందరగోళం
తులసి బాబు( Thulasi Babu ) ఎపిసోడ్ తెలుగుదేశం పార్టీలో ఒక కన్ఫ్యూజన్ వాతావరణాన్ని క్రియేట్ చేస్తోంది. పార్టీలోనే ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య పోరాటంగా మారింది. తనపై కస్టోడియల్ టార్చర్ కేసు విషయంలో స్వతంత్రం గానే ముందుకు సాగాలని రఘురామకృష్ణంరాజు భావిస్తున్నారు. ఇప్పటికే తులసి బాబు బెయిల్ పిటిషన్ సవాల్ చేస్తూ.. రఘురామకృష్ణం రాజు మరో పిటిషన్ వేశారు. అయితే ఇన్నాళ్లు కొడాలి నానిని ఓడించారని వెనిగండ్ల రామును టిడిపి శ్రేణులు ఆకాశానికి ఎత్తే సాయి. కానీ వైసీపీ సన్నిహితులను ఆయన వెనుకేసుకు రావడం పై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇది ఎంత దూరం తీసుకెళ్తాయో చూడాలి.