Vangaveeti Asha Kiran: వంగవీటి కుటుంబం( vangaveeti family) పై రకరకాల చర్చ నడుస్తోంది. ప్రధానంగా వంగవీటి మోహన్ రంగా కుమార్తె ఆశాకిరణ్ రాజకీయ రంగ ప్రవేశం పై రకరకాల రచ్చ జరుగుతుంది. మొన్న ఆ మధ్యన ఆమె తన తండ్రి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ క్రమంలో రంగా, రాధా మిత్రమండలి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేపడతానని చెప్పారు. ఆపై త్వరలో రాజకీయ రంగ ప్రవేశం చేస్తానని చెప్పుకొచ్చారు. అది మొదలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అతిగా ప్రచారం చేస్తోంది. త్వరలో ఆమె వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ప్రచారం చేయడం ప్రారంభించింది. జగన్మోహన్ రెడ్డితో భేటీ అయిన తర్వాత ఆ విషయం ప్రకటిస్తారని నిన్న మొన్నటి నుంచి ఒకటే ప్రచారం. రంగా అభిమానులు కూడా ఆమెను వైసీపీలో చేరమని కోరుతున్నారని కూడా ప్రచారం సాగుతోంది.
పదవి కోసం ఎదురుచూపు..
అయితే ఇప్పటికే వంగవీటి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీలో( Telugu Desam Party) ఉన్నారు. గతంలోనూ ఆయన వైసీపీలో పని చేశారు. ఆ పార్టీ తరపున ఒకసారి పోటీ చేసి ఓడిపోయారు. ఆశించిన సీటు ఇవ్వకపోవడంతో జగన్మోహన్ రెడ్డిని విభేదించి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆయన అనుకున్నట్టు ఆ ఎన్నికల్లో తెలుగుదేశం అధికారంలోకి రాలేదు. తాజాగా అధికారంలోకి వచ్చింది. పదవి కోసం రాధాకృష్ణ ఎదురుచూస్తున్నారు. తప్పకుండా పదవి ఇస్తామని సీఎం చంద్రబాబు తో పాటు మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు. ఇటువంటి సమయంలో ఆయన సోదరి విభజన నిర్ణయం తీసుకుంటారా? అసలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారా? ఇప్పుడు ఇదే ఒక రకమైన ప్రశ్న.
కోరుకున్న సీటు ఇవ్వలేక..
జగన్ రాజకీయంగా దూకుడు తనం ప్రదర్శించారు. అప్పట్లో ఆయనది పైచేయిగా ఉండేది. 2014లో ప్రతిపక్షానికి పరిమితం అయినా అధికారపక్షంతో సమానంగా రాజకీయం చేశారు. అధికారంలోకి వచ్చాక జగన్ వైఖరి తెలియంది కాదు. అయితే జగన్ బలంగా ఉన్నప్పుడే వంగవీటి వారసుడు ఆయన వెంట ఉండేవారు. కానీ ఆశించిన స్థాయిలో పదవులు ఇవ్వలేదు. ప్రాధాన్యత కల్పించలేదు. చివరకు ఒక ఎమ్మెల్యే సీటు తాను కోరుకున్నచోట రాధాకృష్ణకు కల్పించలేదు. చివరకు పార్టీ మారిపోయి వెళ్ళిపోతుంటే సైతం ఆపలేదు. కానీ ఇప్పుడు అదే రాధాకృష్ణ సోదరి ఇలా వచ్చారో లేదో వైసీపీలో చేరిపోతారు అంటూ ప్రచారం చేయడం ప్రారంభించారు. వంగవీటి మోహన్ రంగా కుమారుడిగా రాధాకు ఎనలేని గుర్తింపు ఉండేది. అటువంటి రాధా ను వదులుకున్న జగన్ ఇప్పుడు ఆశాకిరణ్ ద్వారా రాజకీయాలు చేయాలని చూస్తున్నారు.. తాను మంచి స్థితిలో ఉన్నప్పుడు రాధాను పట్టించుకోలేదు. ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి కాపు కులం అవసరం ఉంది. అందుకే ఆషాకిరణ్ పెద్ద నాయకురాలిగా జగన్మోహన్ రెడ్డికి కనిపిస్తోంది. జగన్ ఆడే రాజకీయం వంగవీటి కుటుంబానికి తెలుసు. అందుకే ఆమె ఎంత మాత్రం ఆ పార్టీలో చేరారని ప్రచారం సాగుతోంది.