Vangaveeti Radhakrishna
Vangaveeti Radhakrishna : ఏపీలో ( Andhra Pradesh)రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా కూటమి దూకుడుగా ముందుకు సాగుతోంది. పాలనతో పాటు అభివృద్ధి పై దృష్టి పెట్టింది. ఈ క్రమంలో మూడు పార్టీల మధ్య సమన్వయం బాగానే ఉంది. పదవుల పంపకంలో కూడా సమన్యాయం పాటిస్తూ వెళ్తున్నారు. ఈ క్రమంలో గతంలో టికెట్లు త్యాగం చేసిన టిడిపి నేతలకు గుర్తించి పదవులు ఇస్తున్నారు. అయితే అందులో కొందరికి జాప్యం జరుగుతోంది. దీంతో వారి అనుచరులు, అభిమానుల్లో ఒక రకమైన అసంతృప్తి వ్యక్తం అవుతోంది. ఇటువంటి నేపథ్యంలో వంగవీటి రాధాకృష్ణకు( vangaveeti Radha Krishna) టిడిపి హై కమాండ్ నుంచి పిలుపు వచ్చింది. గత కొంతకాలంగా ఆయన అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. రాజకీయాలనుంచి నిష్క్రమిస్తున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. ఈ తరుణంలో చంద్రబాబు ప్రత్యేకంగా పిలిపించి రాధాకృష్ణతో మాట్లాడడం విశేషం.
Also Read : నాగబాబు అను నేను.. లైన్ క్లియర్.. చంద్రబాబు గ్రీన్ సిగ్నల్!
* రాజకీయంగా తప్పటడుగులు
అప్పుడెప్పుడో 2004లో కాంగ్రెస్ పార్టీ ( Congress Party) ద్వారా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు వంగవీటి రాధాకృష్ణ. చిన్న వయసులోనే అసెంబ్లీలో అడుగు పెట్టారు. కానీ రాజకీయంగా తప్పటడుగులు వేయడంతో రాధాకృష్ణ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ వైపు వెళ్లారు వంగవీటి రాధాకృష్ణ. వైయస్ రాజశేఖర్ రెడ్డి వద్దని వారించిన వినలేదు. దీంతో అక్కడ ఓటమి ఎదురయింది. కొద్ది రోజులకే ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు చిరంజీవి. దీంతో జగన్మోహన్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు అడుగులు వేశారు రాధాకృష్ణ. జగన్మోహన్ రెడ్డి సైతం ఎంతగానో ప్రాధాన్యం ఇచ్చారు. యువజన విభాగం బాధ్యతలు కూడా అప్పగించారు. 2014 ఎన్నికల్లో విజయవాడ నుంచి అసెంబ్లీకి పోటీ చేశారు రాధాకృష్ణ. కానీ ఆయనకు ఓటమి తప్పలేదు. 2019లో సెంట్రల్ నియోజకవర్గ టికెట్ ఆశించారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఆయనకు మచిలీపట్నం టికెట్ ఆఫర్ చేశారు. ఇది నచ్చక ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారు. అలా చేరిన రాధాకు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని హామీ ఇచ్చారు చంద్రబాబు. కానీ ఆ ఎన్నికల్లో టిడిపి ఓడిపోవడంతో ఐదేళ్లపాటు సైలెంట్ గా ఉండిపోయారు రాధాకృష్ణ.
* వైసీపీలోకి ఆహ్వానించినా..
అయితే వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) పార్టీలో కొడాలి నాని, వల్లభనేని వంశీ మోహన్ స్నేహితులుగా ఉండేవారు రాధాకృష్ణకు. గత ఐదేళ్లలో వారు వైసీపీలోకి తీసుకెళ్లేందుకు చాలా రకాల ప్రయత్నాలు చేశారు. కానీ రాధాకృష్ణ టిడిపిలోనే ఉండిపోయారు. ఈ ఎన్నికలకు ముందు ఆయన జనసేనలో చేరతారని ప్రచారం నడిచింది. అందుకు తగ్గట్టుగానే పవన్ కళ్యాణ్ తో పాటు నాదెండ్ల మనోహర్ తో సమావేశం అయ్యారు. అయితే 2024 ఎన్నికల్లో టిడిపి తో పాటు జనసేనకు మద్దతుగా ప్రచారం చేశారు. బిజెపి అభ్యర్థులకు సైతం మద్దతు తెలిపారు. కూటమి అధికారంలోకి వచ్చిన మరుక్షణం తొలి విడతగా రాధాకృష్ణకు ఎమ్మెల్సీ పదవి దక్కుతుందని అంతా భావించారు. కానీ ఇప్పటివరకు ఎనిమిది ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేశారు. కానీ రాధాకృష్ణకు అవకాశం లేకుండా పోయింది.
* కీలక భేటీ..
అయితే తాజాగా ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి ఎన్నికలు జరిగాయి. రాధాకృష్ణకు చోటు తగ్గకపోవడంతో రకరకాల ప్రచారం నడిచింది. రాజకీయాలనుంచి పూర్తిగా దూరమవుతారని కూడా టాక్ నడిచింది. ఆయనపై సొంత పార్టీ పెట్టాలని ఒత్తిడి కూడా పెరిగినట్లు ప్రచారం జరిగింది. ఇవన్నీ గమనించిన టిడిపి హై కమాండ్ రాధాకృష్ణకు కీలక సమాచారం ఇచ్చింది. ఈ తరుణంలో సీఎం చంద్రబాబుతో( Chandrababu) రాధాకృష్ణ భేటీ అయ్యారు. భేటీ అనంతరం రాధాకృష్ణ త్వరలో గుడ్ న్యూస్ అని అనుచరులు వద్ద ప్రకటించినట్లు సమాచారం. ఆయనకు ఎమ్మెల్సీ పదవి కానీ.. రాష్ట్రస్థాయిలో నామినేటెడ్ పదవి కానీ లభించే అవకాశం ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.
Also Read : అమరావతి నిర్మాణంలో కీలక పరిణామం.. సింగపూర్ సడన్ ఎంట్రీ!
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Vangaveeti radhakrishna radhakrishna met cm chandrababu and got a chance to get an mlc post or a nominated post at the state level
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com