Pawan Kalyan impact on YSRCP: రాష్ట్ర రాజకీయాల్లో పిఠాపురం( Pithapuram) నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఈ నియోజకవర్గ నుంచి పోటీ చేసిన తర్వాత దీని ప్రాధాన్యం పెరిగింది. గత కొంతకాలంగా ఇక్కడ కూటమి దూకుడుగా ఉంది. రాష్ట్ర డిప్యూటీ సీఎం ప్రాతినిధ్యం వహిస్తుండడంతో అభివృద్ధి సైతం పరుగులు పెడుతోంది. ఇంకోవైపు టిడిపి ఇన్చార్జిగా మాజీ ఎమ్మెల్యే వర్మ ఉన్నారు. కూటమిపై రకరకాల అభిప్రాయాలు ఉన్న ఇక్కడ మాత్రం బలంగానే ఉంది. ఈ తరుణంలో ఇక్కడ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలు తగ్గాయి. ఆ పార్టీ క్యాడర్లో నిరుత్సాహం అలుముకుంది. పవన్ పై వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన వంగా గీత ఇప్పుడు పెద్దగా యాక్టివ్ గా లేరు. ఆ నియోజకవర్గంలో వైసిపి గెలిచే ఛాన్స్ లేదని తెలిసి ఆమె పూర్తిగా సైడ్ అయినట్లు ప్రచారం నడుస్తోంది. జగన్మోహన్ రెడ్డికి సైతం తాను అక్కడ పని చేయలేనని క్లియర్ కట్ గా చెప్పినట్లు సమాచారం.
తప్పిన అంచనా..
మొన్నటి ఎన్నికల్లో కాకినాడ ( Kakinada) ఎంపీగా ఉన్న వంగా గీతను తీసుకొచ్చి పిఠాపురంలో పోటీ చేయించారు. మహిళ నేతకు కావడంతోపాటు గతంలో పిఠాపురం నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించడంతో ఆమె వైపు మొగ్గు చూపారు. ఆపై ముద్రగడ పద్మనాభం సైతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి ఇచ్చేది పవన్ కళ్యాణ్ ను ఓడిస్తానని శపధం చేశారు. దీంతో ఊరు హోరాహోరీగా ఉంటుందని అంతా భావించారు. కానీ అటువంటి పరిస్థితి లేదు. ఏకంగా 70000 ఓట్లకు పైగా మెజారిటీతో గెలిచారు పవన్ కళ్యాణ్. గెలిచిన తరువాత మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ నియోజకవర్గం వర్గాన్ని శరవేగంగా అభివృద్ధి చేస్తున్నారు. అక్కడి ప్రజలు పవన్ కళ్యాణ్ పనితీరు పట్ల సంతృప్తిగా ఉన్నారని కూడా తెలుస్తోంది. మరోవైపు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను ధైర్యం చెప్పే నేతలు లేకుండా పోయారు. రాష్ట్రస్థాయి విషయాలు మాట్లాడేందుకే అన్నట్టు ముద్రగడ పద్మనాభం పరిస్థితి ఉంది. వంగా గీత సైతం పార్టీ శ్రేణులకు పెద్దగా ప్రయారిటీ ఇవ్వడం లేదు. స్థానికంగా కూడా అందుబాటులో లేరని తెలుస్తోంది.
Also Read: వీర సైనిక కుటుంబం విన్నపం.. స్పందించే గుణం పవన్ ది
అధినేత ఎదుట కుండబద్దలు..
కొద్దిరోజుల కిందట జగన్మోహన్ రెడ్డి వంగా గీతను( Vanga Geetha ) పిలిచి మాట్లాడారట. పిఠాపురం నియోజకవర్గంలో యాక్టివ్ కావాలని సూచించారట. అందుకు ఆమె అంగీకరించలేదట. పవన్ కళ్యాణ్ ఉండగా పిఠాపురం నియోజకవర్గంలో వైయస్సార్ కాంగ్రెస్ గెలిచే పొజిషన్లో లేదని.. అందుకే తాను నియోజకవర్గ ఇన్చార్జి పోస్టును తీసుకోలేనని ఆమె తేల్చి చెప్పారట. తెలుగుదేశం పార్టీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన వంగా గీత ప్రజారాజ్యం పార్టీలో కూడా పనిచేశారు. అందుకే ఆమె విషయంలో పవన్ కళ్యాణ్ సైతం గౌరవంగానే మెలిగారు. ఎన్నికల ఫలితాల తర్వాత ఆమెను జనసేనలో చేర్చుకుంటామని కూడా బాహటంగానే చెప్పారు పవన్. అయితే ఇప్పుడు వంగా గీత వ్యవహార శైలి చూస్తుంటే ఆమె జనసేనకు దగ్గరవుతారా? అనే అనుమానాలు కూడా ఉన్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో..