Mahesh Babu role discussion: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వచ్చిన ప్రతి సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. కెరియర్ స్టార్టింగ్ లో ‘రాజకుమారుడు’ లాంటి సూపర్ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకున్న ఆయన ఆ తర్వాత చేసిన సినిమాలతో ప్రేక్షకులను మెప్పించలేకపోయాడు. ఇక ఎప్పుడైతే ఒక్కడు, అతడు, పోకిరి లాంటి సినిమాలతో భారీ సక్సెస్ లను సాధించాడు. అప్పుడే ఆయన తెలుగులో స్టార్ హీరోగా అవతరించాడు. ఇక అలాంటి హీరో ప్రస్తుతం ఇండియాను దాటి పాన్ వరల్డ్ రేంజ్ లో ముందుకు దూసుకెళ్తున్నాడు… ప్రస్తుతం ఆయన ‘వారణాసి’ సినిమా కోసం విపరీతంగా కష్టపడుతున్నాడు. అయితే మహేష్ బాబుతో చాలామంది దర్శకులు డిఫరెంట్ సినిమాలను చేస్తున్నారు. కానీ ఆయనను పెట్టి ఒక ఎక్స్పరిమెంటల్ సినిమానుఎవరు చేయడం లేదు… సూపర్ మేన్ గెటప్ లో ఆయన కనిపిస్తే చూడాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు.
కానీ ఆ పాత్రలతో అతని దగ్గరికి ఏ దర్శకుడైతే వెళ్లడం లేదు. ఇక ఇలాగే ముందుకు సాగితే మహేష్ బాబు తన ఫ్యూచర్ లో కూడా అలాంటి పాత్రనైతే చేయలేడు. నిజానికి అతనికి ఆ పాత్ర దొరికితే చేయాలని తను చాలా
కుతూహలంగా ఉన్నాడట.
Also Read: ఎన్టీఆర్ ఆ సినిమా చేసి ఉంటే ఇండస్ట్రీ హిట్ వచ్చేదా..?
కానీ దర్శకులెవరు అతని దగ్గరికి అలాంటి కథను పట్టుకొని రావడం లేదట. కానీ వారణాసి సినిమా సూపర్ సక్సెస్ అయిన తర్వాత హాలీవుడ్ దర్శకుడు మహేష్ బాబుతో అలాంటి సీన్ ను కచ్చితంగా చేస్తారు. భారీ మొత్తంలో కలెక్షన్స్ ని కొల్లగొడతారు అంటూ మరి కొంతమంది సినిమా విమర్శకులు సైతం కామెంట్స్ చేస్తున్నారు…
మహేష్ బాబుని కరెక్ట్ గా వాడుకుంటే ఆయన ఈజీగా రెండు మూడు వేల కోట్ల కలెక్షన్స్ ని రాబట్ట కలిగే హీరో…అతన్ని ఎందుకని నెగ్లెట్ చేస్తున్నారు అంటూ ఇంకొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా ‘వారణాసి’ సినిమా రిలీజ్ అయిన తర్వాత మహేష్ బాబుకి ఉండే రేంజ్ నెక్స్ట్ లెవెల్లో పెరిగిపోతుంది…