Vanga Geetha Exit News: జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy ) రాష్ట్రంలో ప్రధాన నియోజకవర్గాలపై దృష్టి పెట్టారు. ముఖ్యంగా ప్రత్యర్థీ పార్టీలకు చెందిన కీలక నేతల నియోజకవర్గాల విషయంలో ముందుగానే అప్రమత్తమయ్యారు. అక్కడ సరైన అభ్యర్థులను బరిలో దించాలని భావిస్తున్నారు. 2024లో జరిగిన తప్పిదాలు పునరావృతం కాకుండా చూడాలని చూస్తున్నారు. ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గం పై ఫుల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి పవన్ కళ్యాణ్ ను నిలువరించే ఏ ప్రయత్నం కూడా విడిచి పెట్టడం లేదు జగన్. అందులో భాగంగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కు సరైన ప్రత్యర్థిని రంగంలోకి దించాలని చూస్తున్నారు. ఈ విషయంలో సీనియర్ నేత ముద్రగడ పద్మనాభం సలహాతో ముందుకు సాగుతున్నారు. త్వరలో ఇక్కడ కొత్త ఇన్చార్జిని ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.
Also Read: తేల్చి చెప్పిన వైవి సుబ్బారెడ్డి.. అరెస్ట్ తరువాయి!
వంగా గీత పోటీ..
2024 ఎన్నికల్లో ఎంపీగా ఉన్న వంగా గీతను( Vanga Geetha ) పోటీలో దించారు జగన్మోహన్ రెడ్డి. ఆమెకు మద్దతుగా ముద్రగడ పద్మనాభం ప్రచారం చేశారు. ఆపై చివరి వరకు జగన్మోహన్ రెడ్డి సైతం ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్నారు. వంగా గీతను గెలిపిస్తే డిప్యూటీ సీఎం గా అవకాశం కల్పిస్తానని హామీ ఇచ్చారు. కానీ పిఠాపురం ప్రజలు మాత్రం పవన్ కళ్యాణ్ పై మొగ్గు చూపారు. ముద్రగడ పద్మనాభం ప్రత్యేక వ్యూహంతో ముందుకు సాగినా వీలుపడలేదు. ఆయన మాటలను సైతం కాపు సామాజిక వర్గం వినలేదు. పవన్ కళ్యాణ్ సూపర్ విక్టరీ సాధించారు. రాష్ట్రంలో సైతం తన పట్టు పెంచుకున్నారు. అయితే ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డికి షాక్ తగిలింది. అందుకే వచ్చే ఎన్నికల్లో పవన్ దూకుడు కళ్లెం వేయాలంటే పిఠాపురంలో సరైన అభ్యర్థిని పోటీలో దించాలని చూస్తున్నారు.
Also Read: బయటకు వెళ్లొచ్చు.. ఆ ఇద్దరు నేతలకు జగన్ షాక్!
చివరకు ముద్రగడ వైపు..
అయితే తెలుగుదేశం పార్టీ ఇన్చార్జిగా వర్మ( Varma) ఉన్నారు. పవన్ కళ్యాణ్ కోసం ఆయన పోటీ నుంచి తప్పుకున్నారు. కూటమి గెలిస్తే ఎమ్మెల్సీ చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. కూటమి అధికారంలోకి వచ్చి 17 నెలలు అవుతోంది కానీ వర్మకు ఛాన్స్ దక్కలేదు. ఆయన అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. అయితే ఆయన టిడిపిలో కొనసాగి మరి కొద్ది రోజులు వేచి చూసే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు వంగా గీతను తప్పించి మరో బలమైన అభ్యర్థిని బరిలో దించుతారని తెలుస్తోంది. అవసరం అనుకుంటే ముద్రగడ పద్మనాభం కుటుంబానికి పిఠాపురంలో అవకాశం కల్పించాలని జగన్ భావిస్తున్నట్లు సమాచారం. గతంలో పిఠాపురం నియోజకవర్గం నుంచి ముద్రగడ ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే.