Union Cabinet expansion: ఉపరాష్ట్రపతి( Indian vice president) ఎన్నికలు పూర్తయ్యాయి. తదుపరి బీహార్ తో పాటు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి పెట్టనుంది బిజెపి. బీహార్ లో నితీష్ కుమార్ నేతృత్వంలో ఎన్డీఏ, తమిళనాడులో అన్న డీఎంకేతో పొత్తు ద్వారా అధికారంలోకి రావాలని బిజెపి భావిస్తోంది. అయితే ఇప్పుడు మిత్రుల ద్వారా ముందుకెళ్లాలని చూస్తున్న బిజెపి.. కేంద్ర మంత్రివర్గాన్ని విస్తరించి మిత్రులకు పదవులు కేటాయించాలని చూస్తోంది. బీహార్లో జెడియుకు మంత్రివర్గంలో స్థానం ఇవ్వనుంది. తమిళనాడు నుంచి బిజెపి మాజీ చీఫ్ అన్నామలైకు మంత్రి పదవి ఇచ్చేందుకు సుముఖంగా ఉంది. ఇంకోవైపు ఏపీ నుంచి ఒకరిని కేంద్రమంత్రి వర్గంలోకి తీసుకోవాలని చూస్తోంది. అదే జరిగితే మూడు పార్టీల్లో ఎవరికి అవకాశం దక్కుతుంది అన్నది ప్రశ్నగా మిగులుతోంది.
ఇప్పటికే ముగ్గురికి పదవులు..
ఏపీ నుంచి ప్రస్తుతం ముగ్గురు మంత్రులు ఉన్నారు. బిజెపి నుంచి నరసాపురం ఎంపీ భూపతి రాజు శ్రీనివాస్ వర్మ( Bhupathi Raju Srinivasa Varma ), తెలుగుదేశం పార్టీ నుంచి కింజరాపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ ఉన్నారు. అయితే కేంద్ర మంత్రివర్గం తూర్పు సమయంలోనే జనసేనకు అవకాశం ఇచ్చారు ప్రధాని నరేంద్ర మోడీ. అప్పట్లో కేంద్ర మంత్రివర్గంలో చేరేందుకు పవన్ కళ్యాణ్ పెద్దగా సుముఖత వ్యక్తం చేయలేనట్టు తెలుస్తోంది. అయితే ఇప్పుడు మంత్రివర్గ విస్తరణలో ఛాన్స్ ఇస్తే దక్కించుకోవాలని పవన్ భావిస్తున్నట్లు సమాచారం. ఆ పార్టీకి రెండుచోట్ల ఎంపీలు ఉన్నారు. మచిలీపట్నం నుంచి జనసేన తరఫున గెలిచిన బాలసౌరి సీనియర్. జనసేనకు గాని ఆ పదవి కేటాయిస్తే బాల సౌరికి అవకాశం దొరికి పరిస్థితి ఉంటుంది. లేకుంటే మాత్రం నాగబాబును కేంద్ర రాజకీయాల్లోకి పంపించాలని పవన్ భావిస్తే ఆయన మంత్రి పదవి చేపట్టే అవకాశం ఉంది.
ఈసారి రాయలసీమకు..
తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఇప్పటికే ఇద్దరు మంత్రులు ఉన్నారు. కింజరాపు రామ్మోహన్ నాయుడు( kinjarapu Ram Mohan Naidu ) కేంద్రంలో కీలకమైన పౌర విమానయాన శాఖను దక్కించుకున్నారు. గుంటూరు ఎంపీ చంద్రశేఖర్ మాత్రం సహాయ మంత్రి పదవితో ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి కేటాయిస్తే మాత్రం రాయలసీమ ప్రాంతానికి చెందిన ఎంపీకి అవకాశం ఇచ్చే పరిస్థితి కనిపిస్తోంది. ఈ లెక్కన హిందూపురం, చిత్తూరు ఎంపీల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఒకవేళ రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వదలుచుకుంటే నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి చంద్రబాబు అవకాశం ఇస్తారని తెలుస్తోంది.
బిజెపి నుంచి ఆ ఇద్దరికీ?
బిజెపికి సంబంధించి ఇప్పటికే నరసాపురం ఎంపీ భూపతి రాజు శ్రీనివాస వర్మ కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నారు. మరోసారి బిజెపికి అవకాశం ఇవ్వాలనుకుంటే ప్రముఖంగా పురందేశ్వరి పేరు వినిపిస్తోంది. మొన్నటి వరకు ఆమె ఏపీ బీజేపీ చీఫ్ గా ఉండేవారు. కేంద్రమంత్రి పదవి కారణంగానే ఆమెను తప్పించారని అప్పట్లో ప్రచారం నడిచింది. ఒకవేళ సామాజిక సమీకరణల దృష్ట్యా పురందేశ్వరికి అవకాశం రాకుంటే మాత్రం.. అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ కు ఛాన్స్ ఇస్తారని తెలుస్తోంది. అయితే ఏ పార్టీకి ఇస్తారో తెలియదు కానీ ఏపీ నుంచి మరో కేంద్రమంత్రి పదవి ఖాయమని టాక్ నడుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో..కేంద్ర మంత్రివర్గ విస్తరణ.. ఏపీ నుంచి ఛాన్స్ వారికే!
ఉపరాష్ట్రపతి( Indian vice president) ఎన్నికలు పూర్తయ్యాయి. తదుపరి బీహార్ తో పాటు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి పెట్టనుంది బిజెపి. బీహార్ లో నితీష్ కుమార్ నేతృత్వంలో ఎన్డీఏ, తమిళనాడులో అన్న డీఎంకేతో పొత్తు ద్వారా అధికారంలోకి రావాలని బిజెపి భావిస్తోంది. అయితే ఇప్పుడు మిత్రుల ద్వారా ముందుకెళ్లాలని చూస్తున్న బిజెపి.. కేంద్ర మంత్రివర్గాన్ని విస్తరించి మిత్రులకు పదవులు కేటాయించాలని చూస్తోంది. బీహార్లో జెడియుకు మంత్రివర్గంలో స్థానం ఇవ్వనుంది. తమిళనాడు నుంచి బిజెపి మాజీ చీఫ్ అన్నామలైకు మంత్రి పదవి ఇచ్చేందుకు సుముఖంగా ఉంది. ఇంకోవైపు ఏపీ నుంచి ఒకరిని కేంద్రమంత్రి వర్గంలోకి తీసుకోవాలని చూస్తోంది. అదే జరిగితే మూడు పార్టీల్లో ఎవరికి అవకాశం దక్కుతుంది అన్నది ప్రశ్నగా మిగులుతోంది.
ఇప్పటికే ముగ్గురికి పదవులు..
ఏపీ నుంచి ప్రస్తుతం ముగ్గురు మంత్రులు ఉన్నారు. బిజెపి నుంచి నరసాపురం ఎంపీ భూపతి రాజు శ్రీనివాస్ వర్మ( Bhupathi Raju Srinivasa Varma ), తెలుగుదేశం పార్టీ నుంచి కింజరాపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ ఉన్నారు. అయితే కేంద్ర మంత్రివర్గం తూర్పు సమయంలోనే జనసేనకు అవకాశం ఇచ్చారు ప్రధాని నరేంద్ర మోడీ. అప్పట్లో కేంద్ర మంత్రివర్గంలో చేరేందుకు పవన్ కళ్యాణ్ పెద్దగా సుముఖత వ్యక్తం చేయలేనట్టు తెలుస్తోంది. అయితే ఇప్పుడు మంత్రివర్గ విస్తరణలో ఛాన్స్ ఇస్తే దక్కించుకోవాలని పవన్ భావిస్తున్నట్లు సమాచారం. ఆ పార్టీకి రెండుచోట్ల ఎంపీలు ఉన్నారు. మచిలీపట్నం నుంచి జనసేన తరఫున గెలిచిన బాలసౌరి సీనియర్. జనసేనకు గాని ఆ పదవి కేటాయిస్తే బాల సౌరికి అవకాశం దొరికి పరిస్థితి ఉంటుంది. లేకుంటే మాత్రం నాగబాబును కేంద్ర రాజకీయాల్లోకి పంపించాలని పవన్ భావిస్తే ఆయన మంత్రి పదవి చేపట్టే అవకాశం ఉంది.
ఈసారి రాయలసీమకు..
తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఇప్పటికే ఇద్దరు మంత్రులు ఉన్నారు. కింజరాపు రామ్మోహన్ నాయుడు( kinjarapu Ram Mohan Naidu ) కేంద్రంలో కీలకమైన పౌర విమానయాన శాఖను దక్కించుకున్నారు. గుంటూరు ఎంపీ చంద్రశేఖర్ మాత్రం సహాయ మంత్రి పదవితో ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి కేటాయిస్తే మాత్రం రాయలసీమ ప్రాంతానికి చెందిన ఎంపీకి అవకాశం ఇచ్చే పరిస్థితి కనిపిస్తోంది. ఈ లెక్కన హిందూపురం, చిత్తూరు ఎంపీల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఒకవేళ రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వదలుచుకుంటే నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి చంద్రబాబు అవకాశం ఇస్తారని తెలుస్తోంది.
బిజెపి నుంచి ఆ ఇద్దరికీ?
బిజెపికి సంబంధించి ఇప్పటికే నరసాపురం ఎంపీ భూపతి రాజు శ్రీనివాస వర్మ కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నారు. మరోసారి బిజెపికి అవకాశం ఇవ్వాలనుకుంటే ప్రముఖంగా పురందేశ్వరి పేరు వినిపిస్తోంది. మొన్నటి వరకు ఆమె ఏపీ బీజేపీ చీఫ్ గా ఉండేవారు. కేంద్రమంత్రి పదవి కారణంగానే ఆమెను తప్పించారని అప్పట్లో ప్రచారం నడిచింది. ఒకవేళ సామాజిక సమీకరణల దృష్ట్యా పురందేశ్వరికి అవకాశం రాకుంటే మాత్రం.. అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ కు ఛాన్స్ ఇస్తారని తెలుస్తోంది. అయితే ఏ పార్టీకి ఇస్తారో తెలియదు కానీ ఏపీ నుంచి మరో కేంద్రమంత్రి పదవి ఖాయమని టాక్ నడుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో..