Homeఆంధ్రప్రదేశ్‌Jagan Vs Sharmila: జగన్ వర్సెస్ షర్మిల వివాదంలో ఊహించని కోణం.. జగన్ ను జైలు...

Jagan Vs Sharmila: జగన్ వర్సెస్ షర్మిల వివాదంలో ఊహించని కోణం.. జగన్ ను జైలు పంపే కుట్ర జరిగిందా?

Jagan Vs Sharmila: కేంద్ర దర్యాప్తు సంస్థల అటాచ్ లో ఉన్న ఆస్తులను బదిలీ చేయడం లేదా విక్రయించడం కుదరదు.. అయితే జగన్మోహన్ రెడ్డికి తన సోదరిపై ఉన్న ప్రేమకు గుర్తుగా ఆస్తులను బదిలీ చేచేయాలనుకున్నారు.. కాకపోతే కేంద్ర దర్యాప్తు సంస్థల ఆధీనంలో ఆ ఆస్తులు ఉన్నాయి. దీంతో ఆమెకు తనపై నమ్మకం కలిగించడానికి ఒక అవగాహన ఒప్పందాన్ని రాసి ఇచ్చారు. అలా జగన్ మోహన్ రెడ్డి రాసి ఇచ్చిన ఆస్తులలో సరస్వతి కంపెనీ కూడా ఒకటి. ప్రస్తుతం ఆ కంపెనీ పై కేంద్ర దర్యాప్తు సంస్థలు కేసులు పెట్టిన నేపథ్యంలో.. అందులో వాటాలను షర్మిలకు జగన్మోహన్ రెడ్డి ఇవ్వడం కుదరదు. అయితే నాడు రాసుకున్న అవగాహన ఒప్పందం ప్రకారం ఆస్తుల బదిలీ ప్రక్రియ కోర్టు తీర్పులకు అనుగుణంగా ఉంటుందని పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా లాభాదేవిలు నిర్వహించకూడదని అందులో రాసుకున్నారు. అయితే షర్మిల ఇందుకు విరుద్ధంగా సరస్వతి కంపెనీలో తన తల్లి విజయలక్ష్మి పేరు మీద ఉన్న గిఫ్ట్ డీడ్ ను తన పేరు మీద రాయించుకున్నారు. దీనిపై జగన్మోహన్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు.

న్యాయపరంగా చిక్కులు..

చట్ట విరుద్ధంగా జరిగిన షేర్ల బదిలీ వల్ల తనకు న్యాయపరంగా చిక్కులు ఏర్పడతాయని.. తన బెయిల్ కూడా రద్దయ్యే అవకాశం ఉంటుందని ఆయన ఈ వ్యవహారాన్ని తప్పు పట్టారు. దీనికి సంబంధించిన అభ్యంతరాలను తన తల్లి, అందరికీ తెలియజేశారు. ఇది నమ్మకాన్ని వమ్ము చేయడం అంటూ లేఖలో పేర్కొన్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి తన బాధను వ్యక్తం చేసినప్పటికీ షర్మిల, విజయమ్మ పట్టించుకోలేదని.. అందువల్లే ఆయన నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ను ఆశ్రయించారని వైసీపీ శ్రేణులు చెబుతున్నాయి. తల్లి నుంచి, సోదరి నుంచి కనీస స్పందన రాకపోవడంతో గతంలో ఆయన గత ఒప్పందం రద్దుకు సిద్ధమని ఆయన లేఖలో ప్రస్తావించారు..”కుటుంబ పెద్దగా ఉమ్మడి ఆస్తులను సమంగా పెంచాల్సిన తరుణంలో.. తాను నోటీసులు ఇవ్వాల్సి రావడం అత్యంత బాధాకరమని” జగన్మోహన్ రెడ్డి తన తల్లికి, సోదరికి పంపిన లేఖలో ప్రస్తావించారు.

జగన్ బెయిల్ రద్దుకు కుట్ర జరిగిందా?

జగన్ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో.. గతంలో వారి కుటుంబంలో జరిగిన ఒప్పందాలు తెరపైకి వచ్చాయి. రాజశేఖర్ రెడ్డి బతికి ఉన్నప్పుడు జగన్ కు, షర్మిలకు మధ్య ఆస్తుల పంపకాలు పూర్తయ్యాయి. అందులో మిగిలిపోయిన కొన్ని ఆస్తులను కూడా షర్మిల బదిలీ చేయడానికి జగన్ సిద్ధమయ్యారు. ఆ తర్వాత వైయస్ రాజశేఖర్ రెడ్డి చనిపోవడంతో ఆ వ్యవహారం కాస్త ఆగిపోయింది.. ఈలోపు కేంద్ర దర్యాప్తు సంస్థలు కేసులు నమోదు చేయడంతో జగన్ ఆస్తులు మొత్తం అటాచ్ లోకి వెళ్లిపోయాయి. అటాచ్ లో ఉన్న ఆస్తులు బదిలీ చేయడం లేదా విక్రయించడం సాధ్యం కాదు. అయితే దీనిని దృష్టిలో ఉంచుకొని కొన్ని ఆస్తులను షర్మిల కు ఇవ్వాలని జగన్ నిర్ణయించుకున్నారు.

ఒప్పందాన్ని రాసి ఇచ్చారు..

2019 ఆగస్టు 31న షర్మిలకు ఒక ఒప్పందాన్ని రాసి ఇచ్చారు. అయితే ఆ ఆస్తులను షర్మిల పేరు మీదుగా బదిలీ చేయడం సాధ్యం కాదు కాబట్టి ఒక అవగాహన ఒప్పందాన్ని ఆమెకు రాసి ఇచ్చారు. అలా జగన్ మోహన్ రెడ్డి రాఫీ ఇచ్చిన ఆస్తులలో సరస్వతి కంపెనీ కూడా ఒకటి. కేసులు పూర్తి అయిన తర్వాత ఆస్తులను ఆమెకు అప్పగిస్తామని ఒప్పందంలో జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. అంతేకాదు ఆస్తుల బదిలీ ప్రక్రియ కూడా కోర్టు తీర్పులకు లోబడి ఉంటుందని జగన్ ఆ ఒప్పందంలో ప్రస్తావించారు. అయితే జగన్మోహన్ రెడ్డికి చెందిన కంపెనీకి సంబంధించిన షేర్లు షర్మిలకు బదిలీ కావడం వల్ల.. ఆయన బెయిల్ రద్దయే అవకాశం ఉందని ఇటీవల న్యాయవాదులు హెచ్చరించారు. దీంతో ఆయన తప్పనిసరి పరిస్థితుల్లో షర్మిలకు, విజయమ్మకు నోటీసులు పంపించారు. తన బెయిల్ రద్దుకు కుట్ర జరుగుతుంది కాబట్టే.. జగన్మోహన్ రెడ్డి తన తల్లి, సోదరికి నోటీసులు పంపాల్సి వచ్చిందని వైసీపీ శ్రేణులు అంటున్నాయి.

షర్మిల ప్రతి లేఖ

ఆస్తుల పంపకానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి లేఖ రాసిన నేపథ్యంలో.. వైయస్ షర్మిల కూడా బదులు లేఖ రాశారు. గతంలో చట్టబద్ధంగానే అగ్రిమెంట్ కుదుర్చుకున్నామని.. ఇప్పుడు దానిని రద్దు చేయడం సరికాదని షర్మిల అన్నారు. ఆస్తులను సమానంగా పంచకపోతే తాను మరింత లోతుగా న్యాయపోరాటం చేయాల్సి వస్తుందని షర్మిల ఆ లేఖలో జగన్ ను హెచ్చరించారు. రాజకీయాలకు, ఆస్తుల పంపకాలకు ముడి పెట్టడం ఏంటని షర్మిల ప్రశ్నించారు. నాడు చట్టబద్ధంగా అగ్రిమెంట్ జరిగిందని.. దానికి తన తల్లి విజయలక్ష్మి ప్రత్యక్ష సాక్షి అని.. ఆమె అందులో సంతకం కూడా చేశారని.. దీనిని గుర్తించి సరైన నిర్ణయం తీసుకోవాలని జగన్మోహన్ రెడ్డికి షర్మిల విజ్ఞప్తి చేశారు. అయితే జగన్మోహన్ రెడ్డి తన తండ్రి సంపాదించిన ఆస్తుల్లో సమానంగా షర్మిలకు వాటా ఇచ్చారని.. తను సంపాదించిన ఆస్తులను షర్మిలకు ప్రేమాభిమానాలతో ఇవ్వడానికి జగన్ సిద్ధమయ్యారని.. అయినప్పటికీ దానిని షర్మిల తప్పుగా ప్రచారం చేయడం సరికాదని వైసిపి శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular