Homeఆంధ్రప్రదేశ్‌Gudivada Amarnath: ఆ క్రీడలో మునిగిపోయిన గుడివాడ అమర్నాథ్!

Gudivada Amarnath: ఆ క్రీడలో మునిగిపోయిన గుడివాడ అమర్నాథ్!

Gudivada Amarnath: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు చాలామంది దూకుడు కలిగిన నేతలు ఉన్నారు. అటువంటి వారిలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఒకరు. తొలిసారిగా ఎమ్మెల్యే అయినా ఆయన రాష్ట్ర మంత్రిగా కూడా పదవి బాధ్యతలు చేపట్టారు. మొన్నటి ఎన్నికల్లో మాత్రం ఓడిపోయారు. మధ్య మధ్యలో ఆయన మీడియా ముందుకు వచ్చి కూటమి ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నారు. అయితే ఆయన విపరీతంగా ట్రోల్స్ కు గురవుతుంటారు. అందుకే ఆయనను హై కమాండ్ నియంత్రించినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే మునుపటిలా గుడివాడ అమర్నాథ్ పెద్దగా బయటకు కనిపించడం లేదు. ఆయన ఏం చేస్తున్నారు అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. మొన్ననే అధినేత విశాఖ స్టీల్ ప్లాంట్ బాధితులకు పరామర్శించారు. ఆ సమయంలో మాత్రం ఆయన జగన్ వెంట కనిపించారు. కానీ విశాఖ రాజకీయాల్లో ఆయన పెద్దగా బయటకు రావడం లేదు ఇప్పుడు. అయితే ఆయన ఏం చేస్తున్నారు అనే ప్రశ్న ఉత్పన్నం కాగా.. ఓ క్రీడలో మునిగిపోయారని టాక్ వినిపిస్తోంది. సోషల్ మీడియాలో దీనిపైనే ప్రచారం జరుగుతోంది.

* రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం..
రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చారు గుడివాడ అమర్నాథ్. ఆయన తాత గుడివాడ అమ్మన్న, తండ్రి గుర్నాథరావు కాంగ్రెస్ పార్టీలో ఒక వెలుగు వెలిగారు. కీలక పదవులు చేపట్టారు. విశాఖ ప్రాంతంలో తమకంటూ రాజకీయాలు చేశారు. అనుకోని పరిస్థితుల్లో గుడివాడ అమర్నాథ్ తెలుగుదేశం పార్టీలో సేవలు అందించారు. ఆ పార్టీ నుంచి కార్పొరేటర్ గా.. తెలుగుదేశం పార్టీ పక్ష నాయకుడిగా ఉండేవారు. వైసిపి ఆవిర్భావం నుంచి మాత్రం ఆ పార్టీలో పని చేస్తున్నారు. 2014 ఎన్నికల్లో తొలిసారిగా అనకాపల్లి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2019లో అదే అనకాపల్లి అసెంబ్లీ స్థానం నుంచి పోటీచేసి గెలిచారు. మంత్రి కూడా అయ్యారు. మొన్నటి ఎన్నికల్లో మాత్రం గాజువాక నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు.

* గోల్ఫ్ ఆడుతూ..
తరచూ మీడియాతో మాట్లాడుతూ అడ్డంగా బుక్ అవుతుంటారు గుడివాడ అమర్నాథ్. యూట్యూబ్ ఛానల్స్ తో సైతం ఇంటర్వ్యూలు చేస్తుంటారు. ఆ సమయంలో గుడివాడ అమర్నాథ్ నోటి నుంచి వచ్చే మాటలు టోల్స్ గురవుతుంటాయి. రాష్ట్రానికి పరిశ్రమలు ఎందుకు రాలేదు అని అన్నందుకు కోడి ముందా గుడ్డు ముందా అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు గుడ్డు మంత్రిగా ముద్రవేశాయి. దావోస్ పెట్టుబడుల సదస్సుకు ఎందుకు వెళ్ళలేదు అని మంత్రి హోదాలో ఉన్న అమర్నాథ్ ను ప్రశ్నిస్తే అక్కడ చలి ఉంటుందని చెప్పి సోషల్ మీడియాకు గొప్ప అవకాశం ఇచ్చారు. అయితే ఇప్పుడు మంత్రిగా ఓడిపోవడంతో… పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు, ప్రముఖులు ఆడే గోల్ఫ్ లో బిజీగా ఉన్నారు. ప్రొఫెషనల్ గోల్ఫ్ క్రీడాకారుడిగా కనిపిస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండింగ్ అవుతోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

Public Movement : ప్రధానుల తల వంచిన ప్రజా ఉద్యమాలు..

Public Movement : ప్రజా ఉద్యమాలు భారత దేశానికి కొత్తకాదు. మన స్వాతంత్య్రమే ప్రజా ఉద్యమాలతో సాధించుకున్నాం. స్వతంత్ర భారతదేశంలో ప్రజా ఉద్యమాలు ప్రభుత్వాలపై గణనీయమైన ప్రభావం చూపాయి. కొన్ని సందర్భాల్లో ప్రధానులు...

Narendra Modi : నాడు రైతులు.. నేడు విద్యార్థులు.. మోదీతో వెనకడుగు వేయించిన ఉద్యమాలు!

Narendra Modi : ప్రధాని నరేంద్రమోదీ.. వరుసగా మూడోసారి ప్రధాని అయ్యారు. ఇటీవలే పండిత్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును కూడా అధిగమించారు. అత్యధిక కాలం పాలించిన ప్రధానిగా చరిత్ర సృష్టించారు....

Cockroach Janata Party రాజకీయ పార్టీగా సిజెపి.. తర్వాతి అడుగు అదే..

Cockroach Janata Party ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. కొత్త విద్యా శాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి నియమితులయ్యారు. ఇక్కడితోనే సీజేపీ ఆగిపోతుందా.. తదుపరి ఏం చేస్తుంది.. అసలు బొద్దింకల తదుపరి లక్ష్యం...

Chiranjeevi : బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన గబ్బర్ సింగ్ నటుడికి మెగాస్టార్ చిరంజీవి భారీ విరాళం..

Chiranjeevi : ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడం మెగాస్టార్ చిరంజీవి కి కొత్తేమి కాదు. ప్రతీ నెల ఎవరికో ఒకరికి ఆయన నుండి సహాయం అందుతూనే ఉంటుంది. చిరంజీవి చేసినన్ని సహాయ కార్యక్రమాలు...

Student Movements in India బొద్దింకలే మొదలు కాదు.. మన దేశంలో ఎన్ని విద్యార్థి ఉద్యమాలు జరిగాయి అంటే..

Student Movements in India ఏ దేశానికైనా సరే అక్కడి యువత ప్రధాన బలం. యువత సానుకూలంగా ఉంటేనే ఆదేశం అభివృద్ధి పథంలో సాగుతూ ఉంటుంది. యువతలో అసంతృప్తి పెరిగిపోతే ఆది కాస్త...
Oktelugu Epaper
Exit mobile version