Homeఆంధ్రప్రదేశ్‌Undavalli Arun Kumar: జగన్ దుస్థితి చూసి తట్టుకోలేకపోతున్న ఉండవల్లి!

Undavalli Arun Kumar: జగన్ దుస్థితి చూసి తట్టుకోలేకపోతున్న ఉండవల్లి!

Undavalli Arun Kumar: రాజకీయాల్లో విచిత్ర పరిస్థితులు ఎదురవుతాయి. ఇష్టమున్న నాయకుడికి నేరుగా మద్దతు తెలపలేని పరిస్థితి చాలా మంది నేతలది. తెలంగాణలో తెలుగుదేశం( Telugu Desam) క్యాడర్ ది కూడా అదే పరిస్థితి. 2023 అసెంబ్లీ ఎన్నికల తో పాటు మొన్న జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి ఎక్కువమంది టీడీపీ అభిమానులు ఓటు వేశారు. అలాగని నేరుగా చెప్పుకోలేని పరిస్థితి. అయితే పార్టీల అభిమానులకే కాదు చాలామంది పెద్ద నేతలది ఇదే పరిస్థితి. ప్రస్తుతం ఏ పార్టీతో సంబంధంలేని ఉండవల్లి అరుణ్ కుమార్ ఇదే తరహాలో మాట్లాడుతుంటారు. ఆయన మనసులో జగన్మోహన్ రెడ్డి నాయకత్వం బలపడాలని ఉంటుంది. అలాగని నేరుగా చెప్పలేరు కూడా. రకరకాల విశ్లేషణలతో చివరకు ఆయన మాటలలో జగన్ పై అభిమానం కనిపిస్తుంది. తాజాగా కూడా పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేస్తూ.. జగన్ పై పొడిపొడిగా మాట్లాడుతూ.. చివరకు చంద్రబాబు పెట్టుబడులపై విషం చిమ్మారు.

* అంతిమంగా ఆలోచన అదే..
మంచి రాజకీయ విశ్లేషకుడిగా పేరు తెచ్చుకోవాలన్న ఆలోచనలో ఉండవల్లి అరుణ్ కుమార్( Undavalli Arun Kumar ) ఉన్నారు. అందుకే క్రియాశీలక రాజకీయాలను విడిచిపెట్టారు. రాష్ట్ర విభజన నాటి నుంచి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి తటస్థ నాయకుడిగా చలామణి అవుతున్నారు. అప్పుడప్పుడు సమకాలిన రాజకీయ అంశాలపై మాట్లాడేందుకు మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నారు. అయితే మొత్తం ఎపిసోడ్ చూస్తే ఆయన మాటల్లో స్పష్టత అర్థం అవుతుంది. చంద్రబాబుపై వ్యతిరేకత కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ కు విలువైన సలహాలు ఇచ్చారు. ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా అప్పట్లో తేల్చారు. కనీసం నాలాంటి మేధావి మాటలను పట్టించుకొని చంద్రబాబుతో విభేదిస్తారన్న ఆలోచన అయి ఉండొచ్చు. ఎందుకంటే చంద్రబాబుతో పవన్ విభేదిస్తేనే జగన్మోహన్ రెడ్డికి లాభం. ఉండవల్లి వారి అభిమతం కూడా అదే అయి ఉండొచ్చు. ఇప్పుడు అదే పవన్ మాట వినలేదని చెప్పి తెలంగాణపై ఏదేదో వ్యాఖ్యలు చేశారని తప్పుపడుతున్నారు ఉండవల్లి వారు. డిప్యూటీ సీఎం స్థాయి నేత అలా మాట్లాడవచ్చా అని నెలదీసినంత పని చేశారు. పవన్ పై విమర్శలు చేసి.. ఆయన కంటే జగన్ బెటర్ అన్నట్టు మాట్లాడారు ఉండవెల్లి.

* పెట్టుబడులపై విషం..
జగన్మోహన్ రెడ్డికి ( Jagan Mohan Reddy )ఎన్నో విధాలా సలహాలు ఇచ్చారు. అయితే ఉండవెల్లి కంటే తెలివైన వాడిగా భావించే జగన్మోహన్ రెడ్డి ఆ సలహాలు పట్టించుకునే స్థితిలో లేరు. కానీ తనకు రాజకీయ అవకాశాలు కల్పించిన కుటుంబం కావడంతో ఉండవెల్లి వారు సలహాలు ఇస్తూనే ఉన్నారు. అయితే జగన్ పరిస్థితి చేదాటి పోతుండడంతో ఏం చేయాలో ఉండవల్లికి పాలుపోవడం లేదనిపిస్తోంది. అందుకే ఇప్పుడు తెలంగాణ నేతలు మరిచిపోయిన పవన్ కళ్యాణ్ దిష్టి వ్యాఖ్యలపై మాట్లాడారు.. మరోవైపు చంద్రబాబు హెరిటేజ్ కంపెనీ పైపడ్డారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొస్తున్నారు కదా.. సొంత సంస్థను తేవచ్చు కదా అని సలహా ఇచ్చారు. ఇక్కడే ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేయవచ్చు కదా అని కూడా సూచించారు. అయితే ఇప్పుడు వస్తున్న పరిశ్రమలకు సంబంధించి ప్రధాన సంస్థలు రాలేదు ఏపీకి. కేవలం తమ కార్యకలాపాలు, ఉత్పత్తులు ప్రారంభించేందుకు మాత్రమే పరిశ్రమలు ఇక్కడికి వచ్చాయి. ఈ లెక్కన హెరిటేజ్ ప్రాంతీయ కార్యాలయాలు, ఫ్రాంచైజ్ లు.. ఇలా ఎన్నెన్నో ఏపీలోనే ఉన్నాయి. హెరిటేజ్ కార్యకలాపాలు పెరిగితే మిగతా డైరీ లను తొక్కి పెట్టేస్తున్నారని విమర్శించేది ఇలాంటి వారే. ఇప్పుడు ఏపీకి పెట్టుబడులు వస్తుంటే ఆహ్వానించాల్సింది పోయి.. అనవసర ప్రస్తావనలు తెచ్చి ప్రజల్లో అయోమయం సృష్టించాలని చూస్తున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి చూసి ఉండవల్లి అరుణ్ కుమార్ తట్టుకోలేకపోతున్నారు. అందుకే ఇటువంటి సలహాలు ఇస్తున్నారని సెటైర్లు పడుతున్నాయి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version