OG Mania In IPL 2026: ఈమధ్య కాలం లో సలార్ తర్వాత యంగ్ జనరేషన్ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకున్న సినిమాల్లో ఒకటి ‘ఓజీ'(They Call Him OG). పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) హీరో గా నటించిన ఈ చిత్రం ఈ ఏడాది దసరా కానుకగా కనీవినీ ఎరుగని రేంజ్ అంచనాల మధ్య విడుదలైంది. ఇంతటి అంచనాల నడుమ వస్తోంది, పైగా ఈ సినిమా విడుదలకు రెండు నెలల ముందు ‘హరి హర వీరమల్లు’ లాంటి దారుణమైన సినిమా పవన్ కళ్యాణ్ నుండి వచ్చింది, ఇప్పుడు ఆయన నుండి ఒక మంచి సినిమా వస్తుందని గ్యారంటీ ఉందా అనే భయం అభిమానుల్లో ఉండేది. కానీ ఈ చిత్రం అభిమానులను ప్రీమియర్స్ షోస్ నుండే మెంటలెక్కిపోయేలా చేసింది. ఇంటర్వెల్ సమయానికి ప్రతీ ఒక్కరు చొక్కాలు చింపుకొని మరీ థియేటర్స్ లో చిందులు వేశారు. ఇది కదా పవన్ కళ్యాణ్ సినిమా అంటే అంటూ గుండెలు బాదుకున్నారు.
కేవలం పవన్ కళ్యాణ్ అభిమానులకు మాత్రమే కాదు, ఈ చిత్రం జెన్ G ఆడియన్స్ కి విపరీతంగా నచ్చింది. ముఖ్యంగా ఓటీటీ లో విడుదలయ్యాక ఈ చిత్రాన్ని కుర్రాళ్ళు ఎగబడి చూసారు. ఇక ఇన్ స్టాగ్రామ్ లో మీమర్స్ అయితే ప్రతీ సందర్భం లోనూ ఓజీ చిత్రం లోని సన్నివేశాలను అప్లోడ్ చేస్తూ మీమ్స్ ని క్రియేట్ చేసేవారు. ఇక రీసెంట్ గా సౌత్ ఆఫ్రికా టీం పై ఇండియా గెలిచినప్పుడు ఓజీ లోని సన్నివేశాలను ఉపయోగించుకొని ఇన్ స్టాగ్రామ్ లో క్రికెట్ లవర్స్ మీమ్స్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. ప్రతీ ఒక్కరు ఓజీ చిత్రం లోని సన్నివేశాలతో, అదే విధంగా ఆ చిత్రం లోని బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో తమ ఇన్ స్టాగ్రామ్ స్టోరీలను నింపేశారు. ఇలాంటి మేనియా గతం లో ‘సలార్’ చిత్రానికి జరిగింది. మళ్లీ అలాంటి మేనియా ఓజీ చిత్రానికే చూస్తున్నారు ఆడియన్స్.
ఇకపోతే త్వరలోనే IPL సీజన్ మొదలు కానుంది. ఇప్పటి నుండే ఈ సీజన్ కి హైప్ రావడం మొదలైంది. ఇన్ స్టాగ్రామ్ లో విరాట్ కోహ్లీ, మహేందర్ సింగ్ ధోని మరియు రోహిత్ శర్మ అభిమానులు తమ అభిమాన క్రికెటర్స్ ని ఎలివేట్ చేసుకోవడం కోసం ‘ఓజీ’ చిత్రం లోని సన్నివేశాలను ఉపయోగిస్తున్నారు. ఇప్పుడే ఇలా ఉందంటే, ఇక IPL సీజన్ మొదలయ్యాక ఏ రేంజ్ లో ఓజీ సన్నివేశాల వాడకం ఉంటుందో ఊహించుకోవచ్చు. కచ్చితంగా ఓజీ ఫీవర్ తో సోషల్ మీడియా మొత్తం ఊగిపోతోంది రాబోయే రోజుల్లో అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు.