Nara Lokesh: ఎన్నికల ముంగిట పొలిటికల్ సెటైరికల్ చిత్రాలు రావడం తెలుగు మాట ఎప్పటి నుంచో ఉంది. ఎన్టీ రామారావు కి వ్యతిరేకంగా అనేక చిత్రాలు కూడా వచ్చాయి. సినిమాలు తీసినంత మాత్రాన.. రాజకీయ భావజాలాన్ని అతిగా ప్రచారం చేసినంత మాత్రాన.. ఓటర్లు ఏక మొత్తంగా ప్రభావితం అయిపోతారు అనుకోవడం భ్రమే. కానీ ప్రత్యర్థిని పలుచున చేసేందుకు, మానసిక స్తైర్యాన్ని దెబ్బ కొట్టేందుకు ఈ తరహా ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయి. తాజాగా వ్యూహం సినిమాతో రాంగోపాల్ వర్మ సరికొత్త వివాదాలను తెర లేపారు. సీఎం జగన్ జీవిత చరిత్రను తెరకెక్కించే క్రమంలో చంద్రబాబుతో పాటు పవన్ లను విలన్ గా చూపించే ప్రయత్నం చేశారు. అయితే ఆ సినిమా సెన్సార్ సర్టిఫికెట్ సస్పెండ్ అయ్యింది. టిడిపి నుంచి అభ్యంతరాలు, ఫిర్యాదులు వెళ్లడం, కోర్టు కేసులు నమోదు కావడంతో విడుదలలో జాప్యం జరుగుతోంది. న్యాయస్థానం సెన్సార్ సర్టిఫికెట్ను రద్దు చేయడంతో విడుదల సస్పెన్స్ లో పడింది.
జగన్ హైలెట్ చేసేందుకు ఈ చిత్రం అన్నది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ క్రమంలో చంద్రబాబు పాత్రను తీవ్ర ప్రతికూలంగా చూపించడాన్ని టిడిపి వర్గీయులు జీర్ణించుకోలేకపోతున్నారు. దీనికి విరుగుడు చర్యగా జగన్ మీద బురద చల్లేందుకు తెలుగుదేశం పార్టీ కొన్ని సినిమాలు నిర్మిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. టిడిపి సీనియర్లు, ఫైనాన్షియల్ ఈ చిత్రాలకు బినామీ పేర్ల మీద నిర్మిస్తున్నట్లు సమాచారం. వాస్తవానికి వ్యూహం సినిమా మొదలైనప్పుడే జగన్ మీద ప్రతికూల సినిమా చేయాలని టిడిపి ఆలోచన చేసింది. అయితే వ్యూహం సినిమా విడుదలైన తర్వాత.. ఆ చిత్రంలో కథాంశాలకు అనుగుణంగా సినిమా రూపొందించాలన్నది ప్రతి వ్యూహం. ఇప్పటికే సీక్రెట్ గా పోస్ట్ ప్రొడక్షన్ సైతం పూర్తయిందని చిత్ర వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ విషయాన్ని రహస్యంగా ఉంచాలని కూడా తెలుస్తోంది.
తాజాగా ఈ వివాదం పై నారా లోకేష్ కామెంట్ చేశారు ఆర్జీవి తీసిన వ్యూహం సినిమా మీద న్యాయస్థానంలో పోరాడుతున్నామని చెప్పుకొచ్చారు. ఆయనకు నిజంగా సినిమాలు తీయాలనిపిస్తే హూ కిల్డ్ బాబాయ్, కోడి కత్తి, ప్యాలెస్ అవినీతి సినిమాలు తీయవచ్చునన్నారు. అయితే ఈ తరహా మాటలు టిడిపి వర్గాల నుంచి చాలా రోజులుగా వినిపిస్తున్నాయి. లోకేష్ సైతం వ్యూహానికి ప్రతి వ్యూహం ఉండదా అని ప్రశ్నించడం ద్వారా.. ఆయన ఆధ్వర్యంలో సినిమాలు నిర్మిస్తున్నట్లు.. వాటికి సంబంధించి టైటిల్స్ కూడా అవి అయి ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది. అయితే ఇందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి. కాగా వ్యూహం సినిమా జనవరి 11 వరకు విడుదలను నిరాకరిస్తూ కోర్టు స్టే జారీ చేసిన సంగతి తెలిసిందే.