TV5 Murthy About Chiranjeevi: విషయాన్ని విషయం మాదిరిగా చెప్పాలి.. అప్పుడే జనాలకు అర్థమవుతుంది. ముఖ్యంగా ఇలాంటి వ్యవహారాలలో పాత్రికేయులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వారు మాట్లాడే ప్రతి మాట కూడా రికార్డెడ్ గా ఉంటుంది. కానీ కొంతమంది పాత్రికేయులు కొన్ని విషయాలలో ఇతర వ్యక్తులను లాగుతుంటారు. అనవసరంగా వారిని ఇబ్బంది పడుతుంటారు.. ఇటువంటి వ్యవహారాలు ఆ తరహా పాత్రికేయులకు పెద్దగా ఇబ్బంది కలిగించకపోవచ్చు గాని.. కానీ సంబంధం లేని వ్యక్తులు మాత్రం తీవ్రంగా ఇబ్బంది పడుతుంటారు. అటువంటి సంఘటన ఎప్పుడు తెలుగు మీడియాలో ఒకటి చోటుచేసుకుంది.
నటుడు మహేష్, గౌతమి చౌదరి దంపతులు. వీరిద్దరి మధ్య ఇటీవల వివాదాలు చోటుచేసుకున్నాయి. ఆ వివాదాలు అంతకంతకు పెరిగిపోయాయి. మహేష్ సినిమాలలో నటిస్తున్న నేపథ్యంలో ఈ వ్యవహారం సహజంగానే మీడియాకు ఎక్కింది. గౌతమి కూడా మహేష్ మీద తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసింది.. ఆమె కొన్ని వీడియోలను కూడా బయటపెట్టింది. మహేష్ కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు. పైగా మహేష్ కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉంది. ఆయన తండ్రి రాజకీయ నాయకుడు.. మాజీ మంత్రి కూడా.. గౌతమి ని టీవీ5 ఛానల్ లో కీలక ఉద్యోగి మూర్తి ఇంటర్వ్యూ చేశారు. పలుమార్లు ఛానల్ స్టూడియోకి పిలిపించి అసలు విషయాలను బయటపెట్టే ప్రయత్నం చేశారు. దీనికి ప్రతిగా మహేష్ కూడా వేరే న్యూస్ ఛానల్స్ కి వెళ్లి కీలక విషయాలను బయటపెట్టారు.. గౌతమికి, మూర్తికి సంబంధం ఉందని.. కొన్ని ఫోటోలను వీడియోలను బయటపెట్టారు.. ఆ తర్వాత కోర్టు అనుమతితో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారు.
ఈ వ్యవహారం తర్వాత టీవీ5 మూర్తి స్పందించారు.. గౌతమి ఇంట్లో తాను సలాడ్ తిన్నందుకు.. తనపై లేనిపోని ఆరోపణలు చేశారని మూర్తి మండిపడ్డారు. గౌతమి కుటుంబ సభ్యుల ఆహ్వానం మేరకే తాను అక్కడికి వెళ్లానని ఆయన స్పష్టం చేశారు.. ఇదే క్రమంలో గతంలో జగన్ ఇంటికి చిరంజీవి వెళ్ళారని.. జగన్ ఇంట్లో భోజనం చేశారని.. అలా భోజనం చేస్తున్నప్పుడు చిరంజీవి కంచాన్ని పట్టుకొని పోయారా అంటూ మూర్తి పేర్కొన్నారు. ఇది సహజంగానే చిరంజీవి అభిమానులకు ఇబ్బందికరంగా మారింది. మహేష్ చేసిన ఆరోపణలకు గట్టి సమాధానం చెప్పాల్సింది పోయి.. చిరంజీవిని మధ్యలోకి ఎందుకు లాగుతున్నారు అంటూ ఆయన అభిమానులు ప్రశ్నిస్తున్నారు.. వాస్తవానికి మూర్తి లాంటి సీనియర్ జర్నలిస్టులు ఇలా మాట్లాడడాన్ని చిరంజీవి అభిమానులు తప్పుపడుతున్నారు.. విషయాన్ని విషయం మాదిరిగా చెప్పాలని… అలాకాకుండా వ్యక్తిగత అంశాల లో సెలబ్రిటీలను లాక్కు రావడం ఏంటని చిరంజీవి అభిమానులు ప్రశ్నిస్తున్నారు. మరి దీనికి మూర్తి ఎలాంటి సమాధానం చెప్తారో చూడాల్సి ఉంది.
Why is Murthy mentioning Chiranjeevi’s name and insulting him? We hope Chiranjeevi take legal action against him. pic.twitter.com/cJfEDNcUS2
— YSRCP Europe (@YSRCPEurope) November 5, 2025