Former YCP ministers: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ సీనియర్లు రాజీ చేసుకున్నారా? కూటమి ప్రభుత్వంతో సర్దుబాటు చేసుకున్నారా? తమ జోలికి రావద్దని కోరారా? తాము సైలెంట్ గా ఉంటామని.. రాజకీయాలు చేయమని ఒప్పందం చేసుకున్నారా? పొలిటికల్ సర్కిల్ లో ఇదే చర్చ నడుస్తోంది. చాలామంది నేతల వైఖరి చూస్తుంటే తెర వెనుక మంత్రాంగం నడుస్తోందా? అన్నా అనుమానాలు కలుగుతున్నాయి. ఇప్పటివరకు జరిగిన అరెస్టులు చూస్తుంటే ఆ జాబితాలో కొంతమంది సీనియర్లు లేకపోవడంతో ఈ అనుమానాలను మరింత పెంచుతోంది. కేవలం కేసులు నమోదు చేయడం, నోటీసులు ఇవ్వడం తప్పించి అరెస్టులు లేకపోవడంతో అంతటా సరికొత్త అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
పట్టించుకోని పెద్దిరెడ్డి..
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి( pedhi Reddy Ramachandra Reddy ) సీనియర్ నాయకుడు. ఆయనతో దశాబ్దాల వైరం చంద్రబాబుకు ఉంది. వైసిపి హయాంలో నేరుగా చంద్రబాబునే పెద్దిరెడ్డి ఇబ్బంది పెట్టగలిగారు. రాయలసీమను తన కనుసైగతో పాలించారు పెద్దిరెడ్డి. చివరకు చంద్రబాబు తన సొంత నియోజకవర్గ కుప్పంలో అడుగుపెట్టిన సందర్భంలో కూడా గొడవలు సృష్టించిన ఘనత అయనది. అటువంటి పెద్దిరెడ్డిని కూటమి అధికారంలోకి రాగానే అరెస్ట్ చేస్తారని ప్రచారం నడిచింది. కానీ ఆయన కుమారుడు మిథున్ రెడ్డిని అరెస్టు చేయడం ద్వారా పెద్దిరెడ్డిని కట్టడి చేసినట్లు తెలుస్తోంది. పెద్దిరెడ్డి అటవీ భూములు ఆక్రమించారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అయినా ఆయన జోలికి వెళ్లకపోవడం వెనుక అనేక రకాల కారణాలు ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. ఆయన కూటమి ప్రభుత్వంతో సర్దుబాటు చేసుకున్నట్లు టాక్ ఉంది.
సొంత పార్టీలో చర్చ..
మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ సైతం ప్రభుత్వంతో రాజీ పడినట్లు సొంత పార్టీలోనే ప్రచారం ఉంది. ప్రస్తుతం ఆయన శాసనమండలిలో వైసీపీ పక్ష నేతగా కూడా ఉన్నారు. వైసిపి హయాంలో విద్యాశాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. 2019లో అధికారంలోకి వచ్చిన తరువాత ఐదేళ్లపాటు మంత్రులుగా కొనసాగిన వారిలో బొత్స ఒకరు. అయితే ఆయన నిర్వర్తించిన విద్యా శాఖలో భారీగా అవకతవకులు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా విద్యా కానుక కిట్లలో 50 కోట్ల రూపాయల గోల్ మాల్ జరిగిందని కూటమి ప్రభుత్వం ఆరోపించింది. అనుకూల మీడియాలో సైతం కథనాలు వచ్చాయి. దీంతో బొత్స సత్యనారాయణ పై కేసు నమోదు తో పాటు అరెస్టు అని ఆ మధ్యన ప్రచారం నడిచింది. కానీ 17 నెలలో అవుతున్న అటువంటివి ఏమీ లేవు. అదే సమయంలో బొత్స సైతం రాజకీయంగా దూకుడు తగ్గించారు. దీంతో ప్రభుత్వంతో రాజీ పడిపోయారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
ఆ మహిళా నేతలు సైతం..
మరోవైపు వైసీపీ మహిళా మాజీ మంత్రులు ఆర్కే రోజా, విడతల రజిని పై అనేక రకాల అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీల్లో దాదాపు 100 కోట్ల రూపాయలకు పైగా అవినీతి జరిగిందని కూటమి ప్రభుత్వం అనుమానించింది. దీనిపై విజిలెన్స్ విచారణకు కూడా ఆదేశించింది. అన్ని జిల్లాల్లో విజిలెన్స్ విచారణ పూర్తయింది. ఆ నివేదికలన్నీ ప్రభుత్వానికి చేరాయి. కానీ చర్యలు తీసుకోవడంలో మాత్రం ప్రభుత్వం వెనుకడుగు వేసింది. అయితే చాలామంది ఐఏఎస్ అధికారుల పాత్ర ఉండటంతోనే ప్రభుత్వం వెనక్కి తగ్గినట్లు ప్రచారం సాగుతోంది. ఇంకోవైపు మాజీ మంత్రి రజిని పై కూడా చాలా ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా బెదిరింపులకు సంబంధించి కేసులు నమోదయ్యాయి. క్రషర్ యజమానిని బెదిరించి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు స్వయంగా బాధితుడే వచ్చి ఫిర్యాదు చేశాడు. ఇంకా చాలా రకాల అవినీతిపై ఆమెపై ఫిర్యాదులు ఉన్నాయి అవినీతిపై. అయినా సరే ఆమెపై ఎటువంటి చర్యలు లేవు. ప్రస్తుతం తమిళనాడులో సెటిల్ కావాలని రోజా భావిస్తున్నారు. విడుదల రజిని రేపల్లె నియోజకవర్గం వర్గానికి పంపించే పనిలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పటికే ఆమె పార్టీ మారుతారని ప్రచారం నడుస్తోంది. ఇటువంటి క్రమంలో ఈ ఇద్దరు మహిళా నేతలపై చర్యలకు ఉపక్రమించకపోవడం వెనుక సర్దుబాటు ఉందన్న అనుమానాలు ఉన్నాయి.
వారిది వ్యూహాత్మక సైలెన్స్?
అయితే వైసిపి హయాబ్లో చాలామంది మంత్రులు దూకుడుగా ఉండేవారు. నెల్లూరుకు చెందిన అనిల్ కుమార్ యాదవ్, గుడివాడ అమర్నాథ్, అంబటి రాంబాబు, కొడాలి నాని లాంటి నేతలు సైలెంట్ గా ఉన్నారు. అయితే ఈ సైలెన్స్ వెనుక ప్రభుత్వంతో రాజీ పడినట్లు అనుమానాలు ఉన్నాయి. ఇప్పటికే రెడ్ బుక్ సంస్కృతితో పాలను పక్కన పెట్టారన్న విమర్శలు ఉన్నాయి. అందుకే ఇప్పుడు వైసిపి మాజీమంత్రులు నేరుగా సరెండర్ అయ్యేలా తొలుత అరెస్టులు జరిపారని.. ఇప్పుడు వారంతా సరెండర్ అయ్యారని.. పేరుకే వైసీపీలో కొనసాగుతున్నారు తప్ప.. అంతగా యాక్టివ్గా పనిచేయని విషయాన్ని ఎక్కువమంది గుర్తు చేస్తున్నారు. మరి ఇందులో ఎంత నిజం ఉందో చూడాలి.