https://oktelugu.com/

Gorantla Madhav: గోరంట్ల మాధవ్ పూర్తిగా బట్టలేసుకుని తప్పు చేశాడా.. టీవీ5 ఏంటి ఇలా చెబుతోంది?

గోరంట్ల మాధవ్ ను హిందూపురం పార్లమెంట్ స్థానం నుంచి తప్పించిన తర్వాత ఆయన అధిష్టానం మీద అత్యంత ఆగ్రహం గా ఉన్నారట! వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఆప్తుడైన సజ్జల రామకృష్ణారెడ్డి తో గొడవ పెట్టుకున్నారట!

Written By:
  • Dharma
  • , Updated On : January 5, 2024 / 12:28 PM IST

    MP Gorantla Madhav

    Follow us on

    Gorantla Madhav: మన మైన రోజుల్లో అన్ని బాగానే ఉంటాయి. మనది కాని రోజుల్లో ఏదైనా తేడాగానే ఉంటుంది. అందుకే అధికారాంతమున అయ్యవారి చిత్రాలు విచిత్రంగా ఉంటాయనే సామెత ఊరికనే పుట్టలేదు. ప్రస్తుతం ఈ సామెత ఏపీలోని ఓ రాజకీయ నాయకుడికి వర్తించే విధంగా ఉంది. ఎందుకంటే ఆయన హిందూపురం వైసిపి పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు ప్రతిపక్షాల మీద చెలరేగే వారు. అప్పట్లో ఆయన నుంచి విడుదలైన ఓ ప్రైవేటు వీడియో పెద్ద సంచలనమైంది. ఇక ఇటీవల పార్లమెంట్లో జరిగిన గొడవలో అతడు వ్యవహరించిన తీరు కూడా సంచలనమైంది. అయితే అతడి తీరు వల్ల వైసీపీకి జాతీయ స్థాయిలో పేరు వచ్చింది. కానీ జగన్ మోహన్ రెడ్డి ఆ పేరును పార్లమెంట్ టికెట్ కేటాయించడంలో పరిగణలోకి తీసుకోలేదు. అంటే హిందూపురం పార్లమెంటు స్థానానికి కొత్తవారిని ఎంపిక చేశారని ప్రచారం జరుగుతున్నది.

    గోరంట్ల మాధవ్ ను హిందూపురం పార్లమెంట్ స్థానం నుంచి తప్పించిన తర్వాత ఆయన అధిష్టానం మీద అత్యంత ఆగ్రహం గా ఉన్నారట! వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఆప్తుడైన సజ్జల రామకృష్ణారెడ్డి తో గొడవ పెట్టుకున్నారట! నాకెందుకు టికెట్ ఇవ్వడం లేదని నిలదీశారట! తాను పార్టీ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశానని.. చివరికి టికెట్ ఇవ్వకపోతే నా రాజకీయ భవిష్యత్తు ఏం కావాలని ఆయనతో వాగ్వాదానికి దిగారట! ఈ మాటలు అంటున్నది ఎవరు కాదు సాక్షాత్ టీవీ 5 న్యూస్ ప్రజెంటర్ సాంబశివరావు. గతంలో తన ప్రైవేటు వీడియో ప్రసారానికి సంబంధించి న్యూస్ చానల్స్ పై గోరంట్ల మాధవ్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. అందులో టీవీ5 కూడా ఉంది. అయితే అప్పటి నుంచి ఇప్పటిదాకా మాధవ్ కు సంబంధించిన వార్తల ప్రసారం విషయంలో టీవీ 5 ఒకింత వెటకారాన్ని ప్రదర్శిస్తూ ఉంటుందనే గుస గుసలున్నాయి.

    అయితే తాజాగా మాధవ్ కు టికెట్ ఇవ్వకపోవడం పట్ల టీవీ 5 రెచ్చిపోయింది. దొరికిందే సందు అనుకొని అతనిపై విమర్శల బాణాలు ఎక్కు పెట్టింది. టీవీ5 న్యూస్ ప్రజెంటర్ సాంబశివరావు గోరంట్ల మాధవ్ కు అత్యంత స్వీట్ చురక అంటించారు. టికెట్ రాలేదని సజ్జల రామకృష్ణారెడ్డి తో గోరంట్ల మాధవ్ గొడవపడ్డారు. కానీ గోరంట్ల మాధవ్ పూర్తిగా బట్టలు వేసుకొని వెళ్తే ఎవరు లెక్క చేస్తారు.. అంటూ సాంబశివరావు సెటైరికల్ గా మాట్లాడారు. దీనికి ముందు తనను తెలుగు ప్రేక్షకులు క్షమించాలని చిన్నపాటి విజ్ఞాపనను కూడా వ్యక్తం చేశారు. టీవీ5 ఎలాగూ టిడిపి స్తోత్రాన్ని పటిస్తుంది కాబట్టి.. అలాంటి మాటలు ఆ ఛానల్ నుంచి కామనే.. మరీ ముఖ్యంగా సాంబశివరావు నుంచి కామనే. కానీ గోరంట్ల మాధవ్ కు సాంబశివరావు ఈ స్థాయిలో ట్రీట్మెంట్ ఇస్తారని ఊహించలేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. టిడిపి గ్రూపులో తెగ చక్కర్లు కొడుతోంది. గోరంట్ల మాధవ్ ను ఉద్దేశించి టిడిపి నాయకులు ఈ వీడియోను తెగ ట్రోల్ చేస్తున్నారు.