TTD Job Recruitment: నిరుద్యోగ యువకులకు తిరుమల తిరుపతి దేవస్థానం( Tirumala Tirupati Devasthanam) గుడ్ న్యూస్ చెప్పింది. పెద్ద ఎత్తున ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఈ మేరకు ఉద్యోగాల భర్తీపై ఫోకస్ పెట్టింది. టీటీడీలో జరిగిన ఉన్నత స్థాయి సమీక్షలు ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రధానంగా స్విమ్స్ ఆసుపత్రిలో సిబ్బంది నియామకం, ఇంజనీరింగ్ విభాగంలో ఉద్యోగాల భర్తీ, దేవస్థానంలో ఖాళీల భర్తీ వంటి అంశాలపై చర్చించారు. స్విమ్స్ ఆసుపత్రిలో 128 మంది పారామెడికల్ సిబ్బందితో పాటు రిజిస్ట్రార్ స్థాయి అధికారులను నియమించాలని గతంలో నిర్ణయించారు. దానిపై తాజాగా చర్చించింది తిరుమల తిరుపతి దేవస్థానం. పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీ చేపట్టాలని నిర్ణయించింది. నిజంగా ఇది నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్.
Also Read: మహిళల ఉచిత ప్రయాణానికి ఓకే.. కానీ
పరీక్షకు ఏర్పాట్లు..
ఇప్పటికే టీటీడీ( TTD ) ఇంజనీరింగ్ విభాగంలో 57 ఉద్యోగాల కోసం దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేశారు. ఈ ఉద్యోగాల కోసం 37 వేల 121 మంది దరఖాస్తు చేసుకున్నారు. త్వరలో వీరందరికీ పరీక్ష నిర్వహించనున్నారు. దేవస్థానంలో ముఖ్యమైన విభాగాల్లో ఖాళీలను శాశ్వత, తాత్కాలిక పద్ధతుల్లో భర్తీ చేసేందుకు హైదరాబాద్ లోని అయాస్కీ అనే సంస్థ కొన్ని సూచనలు చేసింది. ఇప్పటికే ఓ అధికారులతో కూడిన బృందం కీలక సిఫారసులను సైతం చేసింది. అందుకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకున్నారు.
Also Read: ఆ ఛాన్స్ సుమన్ కు ఉందా?
ఆ పదవి నుంచి తొలగింపు..
మరోవైపు టీటీడీ ఈవో కీలక నిర్ణయం తీసుకున్నారు. రవాణా విభాగం జిఎం గా పనిచేస్తున్న శేషారెడ్డిని( Sesha Reddy )ఐటీ ఇన్చార్జి పదవి నుంచి తొలగించారు. ఆయన స్థానంలో ఫణి కుమార్ నాయుడును నియమించారు. ఆయన గతంలో అటవీ శాఖలో డిప్యూటేషన్ పై పనిచేశారు. అయితే గత ప్రభుత్వం నిబంధనలు పాటించకుండా ఐటీ జియంగా సందీప్ రెడ్డిని నియమించింది. అర్హత లేకున్నా తీసుకున్నారని గుర్తించారు. అందుకే తొలగించారు. అయితే టీటీడీలో పెద్ద ఎత్తున ఉద్యోగాలు భర్తీ చేయాలని నిర్ణయించడంపై నిరుద్యోగ యువత ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వీలైనంత త్వరగా ఈ భర్తీ ప్రక్రియ పూర్తి చేయాలని కోరుతున్నారు. మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. రేపటి నుంచి మూడు రోజులపాటు సెలవులు రావడంతో మరింత రద్దీ పెరిగే అవకాశం ఉంది. అందుకే టీటీడీ ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేస్తోంది.