Sensational facts about Atchannaidu: ఒకప్పుడు రాజకీయ నాయకులు పరస్పరం విమర్శలు చేసుకునేవారు. ఏవైనా అవినీతి అక్రమాలు బయటపడితే వాటిని సాక్షాలతో వెల్లడించేవారు. ఇప్పుడు సోషల్ మీడియా రోజులు కాబట్టి.. రాజకీయ పార్టీలు సోషల్ మీడియా ద్వారానే తమ ప్రత్యర్థుల అవినీతి అక్రమాలను బయటపెడుతున్నాయి. ఏపీలో టిడిపి, వైసిపి మధ్య సోషల్ యుద్ధం ఒక స్థాయిలో జరుగుతోంది. ఇటీవల ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ ఉదంతాన్ని ట్రూత్ బాంబు రూపంలో బయటపెట్టిన వైసీపీ సోషల్ మీడియా.. ఇప్పుడు మంత్రి అచ్చె న్నాయుడు విషయంలోనూ ఓ సంచలన నిజాలను బయటపెట్టింది.
అచ్చె న్నాయుడు కూటమి ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగుతున్నారు.. అయితే ఆయన అవినీతి వ్యవహారాలకు పాల్పడుతున్నారని.. ఆంధ్రప్రదేశ్ ఆగ్రోస్ జనరల్ మేనేజర్ రాజమ్మోహన్ పై కక్ష కట్టారని వైసీపీ ఆరోపిస్తోంది. వ్యవసాయ యంత్ర పరికరాల తయారీదారులతో మధ్యవర్తిత్వం చేయాలని మంత్రిపేసి నుంచి రాజమోహన్ కు తీవ్ర స్థాయిలో ఒత్తిడి వచ్చిందని వైసిపి సోషల్ మీడియా విభాగం తన పోస్ట్ లో పేర్కొంది. అవినీతికి సహకరించబోనని రాజమోహన్ చెప్పడంతో ఆయనను నెల్లూరుకు బదిలీ చేయించారని వైసిపి ఆరోపించింది. రాజమోహన్ స్థానంలో జనరల్ మేనేజర్ పోస్టుకు ఏమాత్రం అర్హతలేని జూనియర్ అధికారిని.. పెండింగ్ కేసులు ఉన్న వ్యక్తిని నియమించుకున్నట్టు వైసిపి పేర్కొంది. ఈ నేపథ్యంలో తనకు సెలవు పై వెళ్లడం తప్ప మరో మార్గం లేదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కి రాజమోహన్ లేఖ రాసినట్టు వైసిపి పేర్కొంది.
ప్రభుత్వ పెద్దల అడ్డగోలు దోపిడీకి సహకరించని అధికారులను బదిలీల పేరుతో వేధిస్తారు అంటూ వైసీపీ ఆరోపించడం మొదలుపెట్టింది. “ఇదేనా మీ మంచి ప్రభుత్వం.. ఇదేనా మీరు చేస్తున్న మంచి?” అంటూ వైసీపీ సోషల్ మీడియా విభాగం ప్రశ్నించింది.. దీనిపై టిడిపి ఎలాంటి కౌంటర్ ఇస్తుందనేది చూడాల్సి ఉంది. మరోవైపు వైసీపీ బయటపెట్టిన ఈ విషయాలకు టిడిపి అనుకూల నెటిజన్లు గట్టిగా స్పందిస్తున్నారు. “మీ హయాంలో అవినీతి అనేది తారాస్థాయికి చేరింది. మీరు కూడా ఇప్పుడు నీతులు మాట్లాడటం ఏంటని” టిడిపి అనుకూల నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
Truth Bomb
మంత్రి అచ్చెన్నాయుడు అవినీతి వ్యవహారం బట్టబయలు.
అవినీతికి సహకరించలేదని ఏపీ ఆగ్రోస్ జీఎం రాజమోహన్పై కక్షకట్టిన మంత్రి అచ్చెన్నాయుడు
వ్యవసాయ యంత్ర పరికరాల తయారీదారులతో మధ్యవర్తిత్వం చేయాలని మంత్రి పేషీ నుంచి తీవ్ర ఒత్తిడి… pic.twitter.com/T1mNNDPNXq
— YSR Congress Party (@YSRCParty) August 19, 2025