Tribal Welfare Program: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు( AP deputy CM Pawan Kalyan) గిరిజనులు అన్నా.. అడవులు అన్నా.. అమితమైన అభిమానం. అందుకే అటవీ శాఖను ఏరి కోరి తీసుకున్నారు. అనేక రకాల సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. మంత్రిగా బాధ్యతలు తీసుకున్నాక గిరిజనుల పట్ల ఎంతో ప్రేమ వ్యక్తం చేస్తూ తన అభిమానాన్ని చాటుకున్నారు. గతంలో ఓ గ్రామానికి చెందిన గిరిజనులకు పాదరక్షలను అందించారు. ఇప్పుడు ప్రతి ఇంటికి మామిడి పండ్లు పంచి మరోసారి తన అభిమానాన్ని చాటుకున్నారు. మన్యం గిరిజనులపై తనకున్న వాత్సల్యాన్ని చాటి చెప్పారు. ఈ ఏడాది ఏప్రిల్ 7న అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగూడ మండలం పెదపాడు లో అడవి తల్లిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. అప్పటినుంచి తన అభిమానాన్ని చాటుకుంటూ వస్తున్నారు.
Also Read: ఆ విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాలో మూడు నెలలకు ఒకసారి చెల్లింపులు!
గ్రామస్తులుకంతా చెప్పులు పంపిణీ..
ఏజెన్సీ పర్యటనకు వెళ్లిన తనకు స్వాగతం పలికేందుకు వచ్చిన ఓ మహిళ కాలికి చెప్పులు లేకుండా ఉండడాన్ని గుర్తించారు పవన్ కళ్యాణ్. అక్కడకు కొద్ది రోజుల అనంతరం పెదపాడు( peddapadu ) గ్రామస్తులకు 345 జతల పాదరక్షలు పంపించారు. అప్పట్లో డిప్యూటీ సీఎం తమపై చూపించిన అభిమానానికి గిరిజనులు ఫిదా అయ్యారు. అయితే ఇప్పుడు మరో గిరిజన గ్రామం కురిడి వాసులకు పవన్ తన తోటలో పండిన ఆర్గానిక్ మామిడి పండ్లను పంపించారు. దీంతో ఆ గ్రామస్తుల ఆనందానికి అవధులు లేకపోయాయి. పవన్ కళ్యాణ్ మా కోసం మామిడి పండ్లను పంపించడం ఏంటి అని వారు మురిసిపోయారు. సాధారణ వ్యక్తిగా వచ్చిన పవన్ తమ గ్రామాన్ని ఎంతగానో అభివృద్ధి చేసి చూపించారని వారు చెబుతున్నారు. ఇప్పుడు స్వయంగా మామిడి పండ్లు పంపించడంతో గ్రామ మహిళలు పవన్ కళ్యాణ్ ను దేవుడుగా అభివర్ణిస్తున్నారు.
Also Read: టిడిపి ఒంటరిగా సు’పరిపాలన’!
గిరిజనులకు మామిడి పండ్లు..
సాధారణంగా ప్రముఖులు తమ ఫామ్ హౌస్లలో( farmhouses ) సేంద్రియ పద్ధతుల్లో సాగు చేస్తుంటారు. అలా పండిన పంట ఉత్పత్తులను తెలిసినవారికి, ప్రముఖులకు అందిస్తుంటారు. కానీ పవన్ మాత్రం ఓ మారుమూల గిరిజన గ్రామ ప్రజలకు మామిడి పండ్లు పంపించి.. తాను సైతం మీ వాడినేనని వారికి సందేశం ఇచ్చారు. మరోవైపు గిరిజనుల్లో సేంద్రీయ సాగు విధానంపై ఆసక్తి కలిగేలా.. చర్చకు దారి తీసేలా చేశారు. పవన్ పంపించిన మామిడిపండ్లు భారీ సైజులో ఉండడం గిరిజనులను ఆకర్షించింది. వారు సైతం ఇంత పెద్ద మామిడి పండ్లు ఎలా సాగు చేయాలన్న దానిపై ఒక ఆలోచన చేస్తున్నారు. బహుశా గిరిజనులలో ఈ తరహా ఆలోచన పెంచేందుకే అలా వ్యవహరించి ఉంటారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గతంలో ఏజెన్సీలో పర్యటించిన సమయంలో కూడా పవన్ కళ్యాణ్ సేంద్రీయ పద్ధతిలో సాగు చేయాలని గిరిజనులకు పిలుపునిచ్చారు కూడా.