Kiran Royal: పాత్రికేయమనేది గొప్ప వృత్తి. న్యూట్రల్ గా ఉండడం… నిజం వైపు మాత్రమే ఉండడం.. అబద్దాన్ని సహించలేకపోవడం.. అన్యాయాన్ని, అక్రమాన్ని, అధర్మాన్ని ఉపేక్షించక పోవడం వంటివి.. మిగతా ఉద్యోగుల కంటే పాత్రికేయాన్ని భిన్నంగా చూపిస్తుంటాయి. అయితే ప్రస్తుత కాలంలో పాత్రికేయం అనేది భజనగా రూపాంతరం చెందిన నేపథ్యంలో.. పాత్రికేయానికి విలువ అంటూ లేకుండా పోతోంది.
కాకపోతే అప్పుడప్పుడు కొన్ని అద్భుతాలు జరుగుతుంటాయి. పూర్తిగా విలువలు వదిలేసిన పాత్రికేయంలో సంచలన ఘటనలు చోటుచేసుకుంటాయి. అలాంటిదే ఈ ఈ సంఘటన కూడా. జనసేన నాయకుడు కిరణ్ రాయల్ ఓ మహిళను వేధించినట్టు ఇటీవల వార్తలు వెలుగులోకి వచ్చాయి. సదరు మహిళ నేరుగా విలేకరుల ముందుకు వచ్చి తన బాధను చెప్పుకుంది. తనను కిరణ్ ఏ విధంగా ఇబ్బంది పెట్టింది.. ఏ విధంగా వాడుకున్నది మొత్తం వీడియోలతో సహా బయటపెట్టింది. దీంతో కిరణ్ ఒక్కసారిగా సైలెంట్ కావాల్సి వచ్చింది. అయితే తనపై వస్తున్న ఆరోపణలకు కిరణ్ చాలా తెలివిగా సమాధానం చెప్పడం మొదలుపెట్టాడు. మీడియాను కూడా తప్పుదారి పట్టించేలాగా వ్యవహరించాడు. అయితే ఓ చానల్లో పనిచేసే జర్నలిస్టు మాత్రం కిరణ్ రాయల్ అసలు రూపాన్ని బయట పెట్టాడు. లైవ్ డిబేట్లో నిర్మా సర్ఫ్ తో కడిగి పారేశాడు. “ఆరోపణలు చేసిన మహిళ మీకు ఏమవుతుంది? ఆమెకు మీకు ఎలాంటి సంబంధం ఉంది? పోనీ ఆమె మీకు వరుసకు చెల్లెలు అవుతారా? మీ ఇద్దరి మధ్య అంత గాఢత ఉండడానికి కారణం ఏంటి?” ఇలా ఆ జర్నలిస్టు ప్రశ్నల వర్షం కురిపించడంతో కిరణ్ రాయల్ కు ఏం చెప్పాలో తెలియలేదు. చివరికి నీళ్లు నమలక తప్పలేదు.
సోషల్ మీడియాలో ఏకిపారేస్తున్న వైసిపి నాయకులు
కిరణ్ రాయల్ జనసేన నాయకుడిగా సాగుతున్నారు. రోజా మంత్రిగా ఉన్నప్పుడు ప్రతిరోజు ఆమెపై కిరణ్ విమర్శలు చేసేవాడు. ఏదో ఒక రూపంలో ఆమెను కించపరిచేందుకు ప్రయత్నించేవాడు. ఒకరకంగా రోజా తన నియోజకవర్గంలో ఓడిపోవడానికి కిరణ్ ప్రధాన కారణమయ్యాడు.. తన అనుచరులతో ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయటం.. వినూత్నంగా విమర్శలు చేయడం.. ఆ తర్వాత దానిని సోషల్ మీడియాలో కిరణ్ రాయల్ పబ్లిసిటీ చేసుకునేవాడు. ఇలా ఐదు సంవత్సరాలు రోజాను కిరణ్ రాయల్ ఓ ఆట ఆడుకున్నాడు.. అయితే ఇన్నాళ్లకు కిరణ్ రాయల్ నిజ స్వరూపం వెలుగు చూడడంతో ఒకసారిగా వైసీపీ శ్రేణులకు బలం వచ్చినట్టుయింది. అంతే ఇక సోషల్ మీడియాలో కిరణ్ రాయల్ ను ఏకి పారేయడం మొదలుపెట్టారు. కిరణ్ రాయల్ పై విమర్శ చేసిన మహిళను రాజస్థాన్ పోలీసులు అరెస్టు చేసినప్పటికీ.. కిరణ్ రాయల్ కు జరగాల్సిన డ్యామేజ్ ఎప్పుడో జరిగిపోయింది. పైగా దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. అయితే కిరణ్ రాయల్ పై ఆరోపణలు వినిపించడంతో జనసేన కార్యకలాపాలకు దూరంగా ఉండాలని పవన్ కళ్యాణ్ ఆదేశించినట్టు ప్రచారం జరుగుతోంది.
ఇది కద అసలు జర్నలిజం అంటే , అన్ని విధాలుగా కడిగేసాడు
Kudos to that journalist pic.twitter.com/MOhVyLds5V
— YSRCP UK (@uk_ysrcp) February 11, 2025