Tirupati Clean-Up Drive: ఏపీ సీఎం చంద్రబాబు( CM Chandrababu) తీరులో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ఆయన ప్రజల మధ్య ఎక్కువగా గడిపేందుకు నిర్ణయించుకున్నారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నిత్యం ప్రజల మధ్య ఉంటున్నారు. ప్రతినెలా ఇచ్చే సామాజిక పింఛన్ల పంపిణీ సమయంలో.. ఏదో ఒక జిల్లాను సందర్శిస్తూనే ఉన్నారు. మరోవైపు ప్రతినెల మూడో శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛ్ ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దానికి సైతం హాజరవుతున్నారు చంద్రబాబు. అందులో భాగంగా పారిశుద్ధ్య కార్మికులతో చీపురు పట్టి గంటన్నర సేపు పరిసరాలను శుభ్రం చేశారు. పారిశుద్ధ్య కార్మికులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
తిరుపతిలో పర్యటన..
ఏపీ సీఎం చంద్రబాబు నిన్న తిరుపతిలో( Tirupati) పర్యటన చేశారు. స్వర్ణాంధ్ర స్వచ్ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ఆయన తిరుపతిలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. అందులో భాగంగా అలిపిరి వద్ద ఉన్న కపిలేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు. ముందుగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయం పరిసరాల్లో పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తుండగా.. స్వయంగా చీపురు పట్టి ఆ పరిసరాలను శుభ్రం చేశారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా గంటన్నర సేపు పారిశుద్ధ్య కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ పారిశుద్ధ్య కార్మికులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
Also Read: ముద్రగడకు తీవ్ర అస్వస్థత!
1995 రోజులను గుర్తు చేస్తూ..
గతంలో కూడా చంద్రబాబు చాలా జిల్లాల్లో పర్యటించారు. ఆ సమయంలో సైతం పారిశుద్ధ్య కార్మికులతో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. నారా లోకేష్ సైతం పలుమార్లు జిల్లాల పర్యటనకు వెళ్లే సమయంలో పారిశుద్ధ్య కార్మికులతో స్వయంగా మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అయితే చంద్రబాబు తనలో 1995 పనితీరు చూస్తారని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. నాడు శ్రమదానంతో పాటు జన్మభూమి కార్యక్రమంలో విరివిగా పాల్గొనేవారు చంద్రబాబు. ఇప్పుడు మరోసారి నాటి చంద్రబాబును గుర్తు చేస్తూ ఆయన ప్రజల మధ్యకు వస్తున్నారు. ప్రజలతో మమేకమయ్యే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో పాలనాపరంగా బిజీగా ఉంటూ ప్రజలకు దూరమైనట్లు స్వయంగా చెప్పుకొచ్చారు. ఇప్పుడు దానిని అధిగమించే ప్రయత్నం చేస్తున్నారు.
ఆలయ ప్రాంగణం శుభ్రం చేసిన చంద్రబాబు నాయుడు pic.twitter.com/MeNrZlfLiy
— Telugu Scribe (@TeluguScribe) July 19, 2025