Ustad Bhagat Singh: పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ప్రస్తుతం ‘ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh) మూవీ షూటింగ్ లో ఎంత బిజీ గా ఉంటున్నాడో మన అందరికీ తెలిసిందే. గత నెల రోజులుగా ఆయన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ లోనే గ్యాప్ లేకుండా పాల్గొంటున్నాడు. ఆగష్టు నెలాఖరున వరకు ఆయన ఈ సినిమా షూటింగ్ లో పాల్గొని తన క్యారక్టర్ కి సంబంధించిన షూటింగ్ పార్ట్ మొత్తాన్ని పూర్తి చేయనున్నాడు. అయితే ఈ సినిమా లో ఇప్పటికే శ్రీలీల(Sreeleela) హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పుడు సెకండ్ హీరోయిన్ రోల్ కోసం, అంటే ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే హీరోయిన్ రోల్ కోసం రాశీ ఖన్నా ని ఎంచుకున్నారట. రీసెంట్ గానే ఆమెని సంప్రదించి డేట్స్ అడగ్గా, వెంటనే ఆమె ఒప్పుకున్నట్టు తెలుస్తుంది. రాశీ ఖన్నా(Rashi Khanna) పవన్ కళ్యాణ్ కి చాలా పెద్ద ఫ్యాన్ అనే విషయం అందరికీ తెలిసిందే.
ఈ విషయాన్ని స్వయంగా ఆమెనే పలు ఇంటర్వ్యూస్ లో చెప్పుకొచ్చింది. అయితే ప్రస్తుతం రాశీ ఖన్నా కెరీర్ ఆశించిన స్థాయిలో వెళ్లడం లేదు. వరుసగా డిజాస్టర్ ఫ్లాప్స్ ఎదురు అవుతున్నాయి. ఆమె చివరిసారిగా నటించిన తెలుగు చిత్రం ‘పక్కా కమర్షియల్’. గోపీచంద్ హీరో గా నటించిన ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది. ఆ తర్వాత ఆమె హిందీ లో పలు వెబ్ సిరీస్ లు చేసింది కానీ, అవి ఆమెకు అంతగా కలిసిరాలేదు. కెరీర్ లో గడ్డు కాలాన్ని ఎదురుకుంటున్న సమయం లో ఆమెకు పవన్ కళ్యాణ్ లాంటి సూపర్ స్టార్ చిత్రం లో అవకాశం రావడం నిజంగా ఆమెకు ఎంతో ఉపయోగపడుతుంది అనుకోవచ్చు. పవన్ కళ్యాణ్ కంటే ముందు గతంలో ఆమె జూనియర్ ఎన్టీఆర్ హీరో గా నటించిన ‘జై లవ కుశ’ చిత్రం లో హీరోయిన్ గా నటించింది.
కెరీర్ ప్రారంభం లోనే స్టార్ హీరో సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశం రావడంతో కచ్చితంగా ఈమె రాబోయే రోజుల్లో పెద్ద రేంజ్ కి వెళ్తుందని అంతా అనుకున్నారు. కానీ అలాంటిదేమి జరగలేదు. స్టార్ హీరోలు ఈమెకు అవకాశాలు ఇవ్వలేదు. అద్భుతమైన అందం తో పాటు, యాక్టింగ్ టాలెంట్ ఉన్న ఇలాంటి హీరోయిన్ కి అవకాశాలు ఇవ్వకుండా, కనీసం ఎక్స్ ప్రెషన్స్ కూడా ఇవ్వడం చేత అవ్వని హీరోయిన్స్ ని ఇండస్ట్రీ లో మేపుతున్నారు అంటూ ఒక విమర్శ ఉండేది. ఆమె అభిమానులు కూడా ఈ విషయం లో అసంతృప్తి ని వ్యక్తం చేసేవారు. ఇలాంటి సమయం లో ఇప్పుడు ఆమెకు పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరో సినిమాలో అవకాశం రావడం గోల్డెన్ ఛాన్స్ అనుకోవాలి. ఈ చిత్రం తో అయినా రాశీ ఖన్నా జాతకం మారుతుందో లేదో చూడాలి.