Tirumala : తెలంగాణ ప్రజలకు( Telangana peoples ) తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త వినిపించింది. తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను అనుమతించాలని నిర్ణయించింది. ఈ మేరకు మార్చి 24 నుంచి ఈ సిఫార్సు లేఖలకు శ్రీవారి దర్శనం కల్పించనున్నారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ తెలిపింది. తాజా ఆదేశాల మేరకు సోమ, మంగళవారాల్లో తెలంగాణ సిఫార్సు లేఖలపై విఐపి బ్రేక్ దర్శనం కల్పిస్తారు. బుధ, గురువారాల్లో మాత్రం రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం కేటాయించారు. ఒక్కో ప్రజాప్రతినిధికి సంబంధించి ఒక సిఫార్సు లేఖను మాత్రమే అనుమతిస్తారు. ఆ లేక పై ఆరు మందికి మించకుండా దర్శనం కల్పించనున్నారు. గత కొద్ది రోజులుగా తెలంగాణ ప్రజా ప్రతినిధుల నుంచి వచ్చిన విన్నపం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.
Also Read : అలిపిరి మెట్లు, శ్రీవారి మెట్లు .. ఏవి తక్కువ దూరం.. శ్రీవారి మెట్లకు ఉన్న ప్రాధాన్యత ఏంటి
* కొద్దిరోజులుగా విన్నపం
గత కొద్ది రోజులుగా తెలంగాణలోని( Telangana) కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనాల విషయంలో తమకు ప్రత్యేక అనుమతులు కావాలని కోరుతూ విజ్ఞప్తులు చేస్తూ వచ్చారు. రెండు నెలల కిందటే దీనిపై ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కానీ ఆదేశాలు ఇవ్వడంలో జాప్యం జరిగింది. తెలంగాణకు చెందిన మంత్రి కొండా సురేఖ ఇటీవల సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫారసు లేఖల విషయంలో నిర్ణయం తీసుకోవాలని కోరారు. దీంతో ఏపీ ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోం ది.
* ఏపీ సిఫార్సు లేఖలపై మార్పులు
ఏపీకి( Andhra Pradesh) చెందిన ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలపై సైతం కొన్ని రకాల మార్పులు చేశారు. సోమవారం విఐపి బ్రేక్ దర్శనానికి సంబంధించి సిఫార్సు లేఖలు ఇకపై స్వీకరించమని టిటిడి తెలిపింది. ఇప్పటివరకు సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనాలకు సంబంధించి ఏపీ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను టీటీడీ ఆదివారం స్వీకరిస్తోంది. అయితే దానికి బదులుగా ఆదివారం దర్శనం కోసం శనివారం రోజు సిఫార్సు లేఖలు స్వీకరించనున్నట్లు టీటీడీ తెలిపింది. తిరుమలలో అందుబాటులో ఉన్న వసతి సౌకర్యాలు, ఇతర భక్తుల దర్శన సమయాలు సహా అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ స్పష్టం చేసింది.