Tirumala Darshan Tickets: ఇటీవల టివి5 యాజమాన్యం తమ సంస్థలో పనిచేసే ఉద్యోగులకు పదోన్నతులు అందించింది. అందులో మూర్తి కూడా ఒకరు. మూర్తి సుదీర్ఘ కాలంగా టీవీ5లో పని చేస్తున్నారు. ఇప్పుడు ఏకంగా ఆయన ఆ ఛానల్ కు సీఈఓ అయిపోయారు. చాలాకాలంగా సంస్థలో పని చేయడం.. సంస్థకు నమ్మిన బంటుగా ఉండడంతో ఆయనకు సీఈఓ పదవి లభించింది.
జర్నలిజంలో సుదీర్ఘకాలం నుంచి కొనసాగుతూ ఉండడం.. ప్రైం టైం డిబేట్లు నిర్వహించడంలో మూర్తి కి గట్టిపట్టు ఉంది. పైగా విశ్లేషణతో కూడిన జర్నలిజాన్ని ప్రదర్శించడంలో మూర్తి ముందుంటాడు. అందువల్లే మేనేజ్ మెంట్ ఏకంగా సీఈఓ పదవి ఇచ్చింది. సుదీర్ఘకాలం జర్నలిజంలో ఉన్న మూర్తి ఎన్నడు కూడా ఆరోపణలు ఎదుర్కోలేదు. విమర్శలను చవిచూడలేదు. కాకపోతే నేటి కాలంలో మీడియా అనేది పార్టీలకు భజన చేసే వ్యవస్థగా మారిపోయింది కాబట్టి.. ఆ వ్యవస్థలో మూర్తి కూడా పనిచేస్తున్నాడు కాబట్టి ఆ తరహా విమర్శలు మాత్రం కచ్చితంగా ఎదుర్కొన్నాడు. ఎదుర్కొంటూనే ఉన్నాడు. ఇక సీఈవో అయిన తర్వాత ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూ నిర్వహించాడు మూర్తి. ఆ ఇంటర్వ్యూ సూపర్ సక్సెస్ అయింది.. ఇక ఆ తర్వాత ఇదే పరంపరను మూర్తి కొనసాగించే అవకాశం కనిపిస్తోంది. అయితే మూర్తి పనిచేస్తున్న సంస్థ యజమాని ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్ అయ్యారు. ఈ నేపథ్యంలో సహజంగానే తనను వెంకటేశ్వర స్వామి దర్శనానికి సంబంధించి టికెట్లు అడుగుతున్నారని మూర్తి వీడియోలో ప్రస్తావించారు. ఆ వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.
Also Read: Tirumala Prasadam Ghee Issue: తిరుమలకే కాదు.. ఆ ఐదు ఆలయాలకు.. కల్తీ నెయ్యి విచారణలో సంచలనాలు!
ఇంతకీ ఆ వీడియోలో మూర్తి ఏమన్నారంటే
మూర్తి పనిచేస్తున్న సంస్థ యజమాని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ అయ్యారు. ఈ నేపథ్యంలో మూర్తి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ కు అత్యంత దగ్గర వ్యక్తి. దీంతో మూర్తిని చాలామంది తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనానికి సంబంధించి టికెట్లు అడుగుతున్నారట. ఇటీవల కాలంలో టికెట్ల ఒత్తిడి అతనిపై పెరిగిపోయిందట. ఇదే విషయాన్ని మూర్తి ఓ వీడియోలో వెల్లడించారు..” నేను పని చేస్తున్న సంస్థ యజమాని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ కావచ్చు. ఆయన వద్ద దర్శనానికి సంబంధించి టికెట్లు అడిగే చనువు నాకు ఉండొచ్చు. కానీ నేను ఎన్నడూ ఆ పని చేయలేదు. ఆ పని చేసే అవకాశం కూడా లేదు. ఎందుకంటే ఉద్యోగం వేరు.. దేవుడికి చేసే సేవ వేరు. ఆ సేవను నేను ఈ విధంగా వినియోగించుకోలేను. నాకు వ్యక్తిగతంగా దగ్గరైన వ్యక్తులకు సిఫారసుతో టికెట్లు ఇప్పించుకోలేను. అక్కడిదాకా ఎందుకు మా సంస్థ చైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్ అయినప్పటికీ నేను ఇంతవరకు దర్శనానికి వెళ్లలేదు. పైగా నేను ఎవరికి టికెట్లు కూడా ఇప్పించలేదు. భవిష్యత్తులో ఇప్పించే అవకాశం కూడా లేదు. ఎందుకంటే నా అధికారాన్ని అలాంటి వాటికి ఉపయోగించుకోదలచుకోలేదు.. ఏదైనా సరే నేను అక్కడ ఉన్న నిబంధనల ప్రకారమే నడుచుకుంటాను. నాకు సంబంధించిన వాళ్ళని కూడా అలాగే నడుచుకోమని చెబుతాను. అంటే తప్ప నాకున్న అధికారాన్ని.. నాకున్న దర్పాన్ని స్వామివారి ముందు ప్రదర్శించలేనని” మూర్తి వెల్లడించారు. గత ప్రభుత్వంలో తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనాన్ని రాజకీయం కోసం వాడుకున్నారని.. స్వామి వారి దర్శనం ఇప్పించి తమ రాజకీయ పనులు చేసుకున్నారని.. కానీ ఇప్పుడు అలాంటి వ్యవహారం చేయాల్సిన అవసరం తనకు లేదని మూర్తి స్పష్టం చేశారు. మూర్తి విడుదల చేసిన వీడియో ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని రాజకీయ కార్యశాలగా తాము వాడుకోబోమని స్పష్టం చేసినట్టు తెలుస్తోంది.
TV5 Murthy Explained Real Facts Behind TTD Dharashan.#AdminPost #TV5 pic.twitter.com/vq2GpJsMiP
— Murthy Journalist (@murthyscribe) June 20, 2025