Times Now Survey: టైమ్స్ నౌ సర్వే.. ఏపీలో గెలిచేది ఆ పార్టీ

దేశవ్యాప్తంగా బిజెపి హవా నడుస్తోందని స్పష్టం చేసింది ఈ సర్వే. దక్షిణాది రాష్ట్రాల్లో ఫోకస్ చేసింది ఈ సంస్థ. కర్ణాటకలో మొత్తం 28 లోక్సభ స్థానాల్లో అధికార పార్టీని కాదని బిజెపి 21 నుంచి 23 సీట్లు దక్కించుకోనుందని తెలిసింది.

Written By: Dharma, Updated On : April 17, 2024 10:20 am

Times Now Survey

Follow us on

Times Now Survey: దేశంలో పొలిటికల్ హీట్ నెలకొంది. ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈనెల 19 నుంచి తొలి విడత ఎన్నికలు ప్రారంభం కానున్నాయి. ఇంతలో వివిధ జాతీయ మీడియా సంస్థలు ఒపీనియన్ పోల్స్ నిర్వహిస్తున్నాయి. ఏ పార్టీకి ఎక్కడ ఎన్ని సీట్లు వస్తాయో అంచనా వేస్తున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ జాతీయ మీడియా సంస్థ టైమ్స్ నౌ – ఈ టి జి చేసిన సర్వే ఆసక్తి రేపుతోంది. ఆసక్తికర ఫలితాలను వెల్లడించింది.

దేశవ్యాప్తంగా బిజెపి హవా నడుస్తోందని స్పష్టం చేసింది ఈ సర్వే. దక్షిణాది రాష్ట్రాల్లో ఫోకస్ చేసింది ఈ సంస్థ. కర్ణాటకలో మొత్తం 28 లోక్సభ స్థానాల్లో అధికార పార్టీని కాదని బిజెపి 21 నుంచి 23 సీట్లు దక్కించుకోనుందని తెలిసింది. అధికార కాంగ్రెస్ కేవలం నాలుగు నుంచి ఆరు స్థానాలకే పరిమితం అవుతుందని చెప్పింది. తమిళనాడులో 39 స్థానాలకు గాను డిఎంకె 21 నుంచి 22 సీట్లు, కాంగ్రెస్ ఐదు నుంచి ఏడు సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. కేరళలో కాంగ్రెస్ ఎనిమిది నుంచి పది స్థానాలు, సిపిఎం 6 నుంచి 8 సీట్లు సాధించే ఛాన్స్ కనిపిస్తోంది.

తెలుగు రాష్ట్రాలకు సంబంధించి.. తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీకి ఎనిమిది నుంచి పది స్థానాలు వచ్చే ఛాన్స్ ఉందని.. బిజెపి నాలుగు నుంచి ఆరు స్థానాలు, బిఆర్ఎస్ కు ఒకటి నుంచి మూడు స్థానాలు విజయం సాధించవచ్చు అని తేల్చింది. ఏపీలో అధికార వైసిపి 19 నుంచి 20 సీట్లు, టిడిపి మూడు నుంచి నాలుగు సీట్లు, బిజెపి ఒక సీటు సాధించే ఛాన్స్ ఉందని ఈ సర్వే తేల్చి చెప్పడం విశేషం. ఈ లెక్కన రాష్ట్రంలో వైసిపి అధికారంలోకి రావడం ఖాయమని ఈ సర్వే తేల్చి చెప్పింది. 20 లోక్సభ స్థానాలు వైసిపి ఖాతాలో పడితే.. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఏడు అసెంబ్లీ స్థానాలు ఉంటాయి. ఈ లెక్కన వైసీపీకి 140 స్థానాలు దక్కే అవకాశం కనిపిస్తోంది.